Bengalis
-
ఇక్కడ దసరా మామూలుగా ఉండదు
దసరా పండుగ దేశమంతా ఒక తీరున... బెంగాల్లో ఒక తీరున జరుగుతుంది. కోల్‌కతాలోని కుమార్తులి అనే వాడ అంతా దుర్గ విగ్రహాల తయారీ,కొనుగోళ్లతో కోలాహలంగా మారుతుంది. పురుషులతోపా టు స్త్రీలు కూడా విగ్రహాలు తయారు చేస్తారు. బెంగాలీల నవ రూప దుర్గలుగా కనిపించడానికి అక్కడ సెలబ్రిటీలు ఉవ్విళ్లూరుతారు. ఒక టీవీ చానెల్ స్పెషల్ షో కోసం ముస్తాబైన నవరూప దుర్గలు వీరు... ఆ అవతారాల పేర్లు, ఇతర బెంగాల్ దసరా విశేషాలు...2024లో బెంగాల్లో దుర్గ పూజ వల్ల జరిగే సృజనాత్మకత ఆర్థిక లావాదేవీల అంచనా ఎంతో తెలుసా? 50 వేల కోట్లు. సృజనాత్మక ఆర్థిక లావాదేవీలు అంటే? దుర్గ విగ్రహాల తయారీ, మంట΄ాల ఏర్పాటు, అలంకరణ, వినోద కార్యక్రమాలు, పూజా సామగ్రి, భోజనాలు, పబ్లిసిటీ సామగ్రి, స్పాన్సర్‌షిప్‌లు, యాడ్లు, పుస్తకాల ప్రచురణ... ఇవన్నీ 50 వేల కోట్ల మేరకు జరుగుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి కుటుంబం ఈ వేడుకల్లోపా ల్గొంటుంది. కోల్‌కతా అంతా 3000కు పైగా దుర్గ మంట΄ాలు వెలుస్తాయి. హైదరాబాద్‌లో గణపతి మంట΄ాల్లాగే కోల్‌కతాలో అతి పెద్ద విగ్రహాలు పెట్టడానికి కూడా జనం ఉత్సాహపడతారు. నవరాత్రుల్లో నగరం నలుమూలలా పూజలు జరుగుతుంటే ప్రత్యేకంగా కోటి రూ΄ాయల ఖర్చుతో జరిగే పూజలు కనీసం 200 ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. అందుకే దసరా అంటే బెంగాల్ బెంగాల్ అంటే దసరా.17వ శతాబ్దం నుంచిదుర్గ పూజ ఒకప్పుడు బెంగాల్లో జమీందారుల పండగగా ఉండేది. అయితే 1610లో సబర్ణ రాయ్ చౌదరి అనే జమీందారు కుటుంబం ప్రజల మధ్యలో తెచ్చి దుర్గ పూజ వేడుకలు మొదలెట్టింది. ఆ తర్వాత జమీందార్లు, శ్రీమంతులు కోల్‌కతాలో దుర్గపూజ ఆర్భాటంగా చేయసాగారు. 1910లో కోల్‌కతాలో కొద్దిమంది సామాన్యులు చందాలు వేసుకొని మొదటి దుర్గా మంట΄ాన్ని నవరాత్రుల్లో మొదలెట్టారు. దాంతో జనం పోగయ్యి వాడవాడల దుర్గ మంట΄ాలు స్థాపించుకునే ఆనవాయితీ వచ్చింది. అయితే 1985లో ఆసియన్ పెయింట్స్ వారు కోల్‌కతాలోని దుర్గ మంట΄ాల్లో ఉత్తమమైన వాటికి బహుమతులు ఇవ్వడంప్రారంభించే సరికి ఇక పోటాపోటీ మొదలయ్యి సృజనాత్మకంగా ఒకరికి మించి ఒకరు దుర్గ మంట΄ాలను విస్తృతం చేయసాగారు. ఆ తర్వాత కోల్‌కతాలోని ఎన్నో సంస్థలు నేడు దుర్గ మంట΄ాలకు అవార్డులు ఇస్తున్నాయి. స్త్రీల పండుగదుర్గ అంటే శక్తి. దసరా అంటే మహిళా శక్తికి ప్రతీక. అందుకే బెంగాల్లో స్త్రీలు దసరాను చాలా విశేషంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజుల్లో ఎర్రంచు ఉన్న తెల్లచీర, ఎర్రగాజులు, కుంకుమ బొట్టుతో కళకళలాడతారు. నవరాత్రుల్లో చివరి రోజు వీరంతా ‘పుట్టింటికి వచ్చిన దుర్గమ్మ తిరిగి అత్తవారింటికి వెళ్లిపోతున్న’ సందర్భంగా ‘సిందూర్ ఖేలా’ అనే ఆటను ఆడతారు. వివాహితలు ఒకరికి ఒకరు కుంకుమ బొట్టు పెట్టుకుని ఆనందిస్తారు. ఇలా చేస్తే తమ సౌభాగ్యం చెక్కు చెదరదని భావిస్తారు.కుమార్ తులిలో విగ్రహాలుకోల్కతాలో కుమార్ తులి అనేప్రాంతంలో సంవత్సరం అంతా దుర్గ విగ్రహాలు తయారు చేస్తూనే ఉంటారు. ప్రతి బొమ్మను విలక్షణంగా తీర్చిదిద్దడమే కాదు ఆ విగ్రహానికి అమర్చే దుస్తులు, నగలు కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఒక్కో విగ్రహం పది వేల నుంచి రెండు–మూడు లక్షల వరకూ ఉంటుంది. కుమార్ తులిలో చినపా ల్, నమితాపా ల్, మాలాపా ల్, కోకిలాపా ల్ అనే నలుగురు అక్కచెల్లెళ్లు దుర్గ విగ్రహాల తయారీలో పేరు గడించారు.నవ దుర్గలువిగ్రహాలతోపా టు సెలబ్రిటీలు కూడా ఈ సందర్భంగా దుర్గ అవతారాలను ధరించి వివిధ షోలలోపా ల్గొంటూ ప్రేక్షకులకు ఉత్సాహం కలిగిస్తారు. జీ బెంగాలీ చానల్ ఈ సంవత్సరం తమ సీరియల్స్‌లో నటించే నటీమణుల చేత నవ దుర్గలపా త్రలు ధరింప చేసి అందరినీ ఆకట్టుకుంది. బెంగాల్ వారు నవరాత్రుల సందర్భం గా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకూ నవ దుర్గలను ఆవిష్కరిస్తారు. -
అన్యాయాలపై పోరులో ముందుండాలి
సిలిగురి: దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి పశ్చిమబెంగాల్, బెంగాలీలు నాయకత్వం వహించాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆదివారం సిలిగురిలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. యాత్రకు లభిస్తున్న ఆదరణకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘స్వాతంత్య్ర పోరాట సమయంలో సైద్ధాంతిక పోరాటానికి నాయకత్వం వహించిన బెంగాల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. అన్యాయాన్ని ఎదుర్కోవడం, ఐక్యతను పెంపొందించడం, విద్వేష వ్యాప్తిని అరికట్టడం బెంగాల్, బెంగాలీల కర్తవ్యం. ‘మీరు సందర్భానికి తగినట్లుగా స్పందించకుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు, ఇది ఏ ఒక్క వ్యక్తికో సంబంధించింది కాదు. బెంగాల్ ఈ పోరాటానికి నాయకత్వం వహించాలి’అని రాహుల్ ఉద్ఘాటించారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్వేషాలను, హింసను పెంచుతోంది. నిరుపేదలు, యువతకు బదులుగా కొందరు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తోంది’అని మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన టీఎంసీ లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం, ఆ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీని సముదాయించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రయత్నాలు జరుగుతున్న వేళ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీఎంసీ స్పందించింది. నిజమే, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముందుండి పోరాడిన చరిత్ర బెంగాలీలకు ఉంది. సీఎం మమతా బెనర్జీ సైతం ప్రతిపక్ష కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం రాష్ట్రంలో కాషాయదళంతో అంటకాగుతోంది’అని టీఎంసీ నేత శంతను సేన్ ఆరోపించారు. న్యాయ్ యాత్ర సోమవారం ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లా నుంచి బిహార్‌లోకి ప్రవేశించనుంది. -
అమ్మాయిలను సమకూరుస్తామంటూ మోసాలు..
సాక్షి, హైదరాబాద్ : డేటింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్న ఐదుగురు బెంగాలీలను సైబర్‌క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు టెలీకాలర్స్ పేరుతో యువతుల్ని జాబ్‌లో చేర్పించుకుని డేటింగ్ సైట్లను నిర్వహిసున్నారని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. భారీ స్థాయిలోకాల్ సెంటర్లు ఏర్పాటు చేసి డేటింగ్ రాకెట్ నడుపుతున్నారని వెల్లడించారు. ముఠా సూత్రధారి దేబశిష్ ముఖర్జీతో సహా ఫజుల్ హాక్, సందీప్ మిత్ర, యువతులు అనిత డెయ్, నీత శంకర్లను అరెస్టు చేశామని తెలిపారు. గెట్ యువర్ లేడీ, వరల్డ్ డేటింగ్, మై లవ్ పేర్లతో డేటింగ్ సైట్లు క్రియేట్ చేసి యువతుల్ని సమకూరుస్తామంటూ.. వేలకు వేలు డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. 20 కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి అమాయకులను బురిడీ కొట్టించారని పోలీసులు తెలిపారు. కాల్ సెంటర్లకు సంబంధించిన మెటీరియల్ సీజ్ చేశామని తెలిపారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ మోసాలకు బలికావద్దని ప్రజలకు కమిషనర్ సూచించారు. -
బెంగాలీ భలే..
దసరాకు బెంగాలీలకు ఉన్న అనుబంధం తెలియనివారుండరు. నవరాత్రి వేడుకలను పశ్చిమ బెంగాల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. సిటీలో కూడా దసరా మంటపాలకు స్ఫూర్తి అక్కడి వేడుకలే. ఈ నేపథ్యంలో.. నగరంలో దశాబ్దాలుగా స్థిరపడిన విభిన్న రంగాల బెంగాలీ ప్రముఖులతో ముచ్చటించినప్పుడు... 49వ పండుగ.. ‘ఇది మా సంఘం ప్రారంభించిన తర్వాత జరుగుతున్న 49వ పండుగ. ఈ వేడుకల్లో పాల్గొనడం కోసం కోల్‌కతా, ముంబై నుంచి సైతం కళాకారులు ‘వచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో మ్యూజిక్, డ్రాయింగ్, అంత్యాక్షరి... ఇలా ఉదయం అంతా పోటీలే. సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ కార్యక్రమాలు జరుగుతున్న ఆవరణలో 40 వరకూ బెంగాలీ రుచులు చూపించే ఫుడ్ స్టాల్సే ఉన్నాయి’ అని వివరించారు బంగీయ సాంస్కృతిక సంఘ్అధ్యక్షుడు దీపక్ భట్టాఛార్జీ. అమ్మవారి దగ్గరే... ‘దసరా నవరాత్రులంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్లున్నా, ఈవెంట్లున్నా, అన్నీ బంద్. ఈ 10 రోజులూ ఇక్కడే గడిపేస్తాం. నిష్టగా పూజలు చేస్తాం. నిండుగా చీరలు కడతాం. అంతేనా.. ఆడతాం. పాడతాం. ఓహ్.. సంబరాలంటే ఇవీ’ అంటూ హుషారుగా చెప్పారు నటి శిల్పా చక్రవర్తి. రాష్ట్రవ్యాప్తంగా పరిచయమున్న ఈ ప్రముఖ టీవీ యాంకర్.. తెలుగమ్మాయి కాదంటే నమ్మలేం. ఆమెలోని అచ్చమైన బెంగాలీని బయటికి తెచ్చే సమయం అంటే దసరా పండుగే. ‘ఇక్కడ జరిగే నవరాత్రులే నాకు బాగా ఇష్టం’ అంటున్నారు శిల్ప. సామూహిక వేడుక ‘మాది తూర్పు బెంగాల్. ఇప్పుడది బంగ్లాదేశ్ అయింది. మా తాతల కాలంలోనే హైదరాబాద్ వచ్చేశాం’ అంటూ చెప్పిన నటి చందనా చక్రవర్తి.. అన్ని కుటుంబాలు కలసి ఒక్క చోట చేరి సామూహిక పూజలు, కార్యక్రమాలు నిర్వహించడమే తమ వేడుకలోని విశిష్టత అంటున్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమైనా, కుల మతాలకు అతీతంగా అందరూ ఒక్కటే అన్న భావనతో సంబరం చేసుకుంటామని అంటున్నారామె. మంటపాలను ఒక థీమ్‌తో అలంకరించడం బెంగాలీ దసరా వేడుకల్లో మరో విశేషం’అని చెప్పుకొచ్చారు. సంస్కృతికి ప్రతీకగా.. ఏడాదికి రెండుసార్లు కోల్‌కతా వెళ్లినా దసరా సరదా మాత్రం ఇక్కడే అంటున్నారు అసిమా సేన్‌గుప్తా. నగరంలోని పాపులర్ ఎడ్యుకేషన్ సొసైటీ కి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న అసిమా 40 ఏళ్లుగా సికింద్రాబాద్‌లో నివసిస్తున్నారు. స్థానిక బెంగాలీల కోసం వారి స్వరాష్ట్రానికి తీసిపోని విధంగా పండుగ సంబరాలను నిర్వహిస్తున్నారు. - సత్యబాబు -
స్వీట్ సిటీ..
ఇది బెంగాలీల మాట మినీ భారత్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌తో బెంగాలీలు వందల ఏళ్ల నుంచి అనుబంధం కొనసాగిస్తున్నారు. ఇక్కడ తెలుగు వాళ్లు, బెంగాలీలు అనే తేడాలు ఏమీ లేవు, అందరూ ఇండియన్స్ అనే ఫీలింగ్ మాత్రమే. హైదరాబాదీలు చాలా స్నేహంగా వుంటారు. పొగరు, తలబిరుసుతనం ఇక్కడి వాళ్లలో కనిపించదు. ఇది స్వీట్ సిటీ అని బెంగాలీలు మనస్ఫూర్తిగా చెబుతున్నారు. భాగ్యనగరంతో బెంగాలీల అనుబంధం ఈనాటిది కాదు. నిజాం జమానాలోనే పలువురు బెంగాలీలు ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. తెలుగింటి కోడలైన సరోజినీ నాయుడు బెంగాలీనే. ఆమె తండ్రి అఘోరనాథ ఛటోపాధ్యాయ శాస్త్రవేత్త. ఇక్కడ నిజాం కాలేజీని స్థాపించింది ఆయనే. అప్పట్లో ఈస్టిండియా కంపెనీలో, సైన్యంలో, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే పలువురు బెంగాలీలు బదిలీలపై ఇక్కడకు వచ్చారు. వారిలో చాలామంది ఇక్కడే స్థిరపడి, హైదరాబాదీలతో మమేకమైపోయారు. మొదట్లో ఎక్కువ మంది హిమాయత్‌నగర్, దోమల్‌గూడ ప్రాంతాల్లో ఉండేవారు. అప్పట్లో వచ్చిన రైల్వే ఉద్యోగులు చాలామంది తార్నాక వైపు ఉంటున్నారు. ఇక హైదర్‌గూడ, సోమాజిగూడ, అమీర్‌పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా బెంగాలీలు గణనీయంగానే ఉంటున్నారు. ‘హైదరాబాదీలు ఎంతో స్నేహంగా ఉంటారు. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పొగరు, తలబిరుసుతనం ఇక్కడి వాళ్లలో కనిపించదు’ అని చాలాకాలంగా ఇక్కడే స్థిరపడ్డ బెంగాలీలు మనస్ఫూర్తిగా చెబుతున్నారు. బెంగాలీలకు, తెలుగు వారికి సాహితీ సంబంధాలు చిరకాలంగా ఉన్న సంగతి తెలిసిందే. రవీంద్రనాథ్ టాగోర్, బంకించంద్ర ఛటర్జీ, శరత్చంద్ర ఛటర్జీల రచనలు తెలుగులోకి విరివిగా అనువాదమయ్యాయి. తీపి లేనిదే తినలేరు... దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నా, బెంగాలీల ఆహారపు అలవాట్లు మాత్రం పెద్దగా మారలేదు. ఇప్పటికీ వారు తమ సంప్రదాయ వంటకాలనే ఇష్టపడతారు. బెంగాలీలు తమ వంటల్లో చింతపండును దాదాపు వాడనే వాడరు. తీపికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. రసగుల్లా, సందేశ్ వంటి బెంగాలీ స్వీట్లు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంగతి తెలిసిందే. తెలుగువారి మాదిరిగా స్పైసీఫుడ్ను వీరు తినరు. కూరల్లో సైతం కాస్తంత పంచదార లేదా బెల్లం వేసి వండుకునే అలవాటు వారిది. పప్పుల్లో ఐదారు రకాలు వండుతారు. మాంసాహారంలో ముఖ్యంగా చేపలను ఎక్కువగా ఇష్టపడతారు. బెంగాలీలు నాన్‌వెజ్ ఎంతగా తిన్నా, కూరగాయలనూ అదే మోతాదులో తింటారని యాభయ్యేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్న సంఘమిత్ర అన్నారు. సంప్రదాయబద్ధంగా.. పండుగలను, వేడుకలను బెంగాలీలు అత్యంత సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. వినాయక చవితి, దసరా నవరాత్రులు, దీపావళి, బసంత్ పంచమి, జన్మాష్టమి వీరికి ముఖ్యమైన పండుగలు. ఏప్రిల్‌లో వచ్చే మేష సంక్రాంతి బెంగాలీలకు సంవత్సరాది. రాఖీ పండుగకు బదులు సోదరుల కోసం భాయిదూజ్ పండుగను జరుపుకుంటారు. పండుగలలో వీరు కేవలం మట్టి విగ్రహాలనే పూజిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఏమాత్రం వాడరు. పండుగ సమయాల్లో మగవారు ధోవతీ, కుర్తా ధరిస్తారు. చిన్నపిల్లలు సైతం ఇవే దుస్తులు ధరిస్తారు. బెంగాలీల్లో దాదాపు ప్రతి ఒక్కరికీ లలిత కళల్లో ప్రవేశం ఉంటుంది. విద్యార్థి దశలోనే సంగీతం, చిత్రకళ వంటివి నేర్చుకుంటారు. కట్నాల ప్రసక్తి లేని పెళ్లిళ్లు... బెంగాలీల పెళ్లిళ్లు రాత్రిపూట జరుగుతాయి. పెళ్లి తర్వాత మూడో రోజు వరుడి ఇంట జరిగే విందులో పెళ్లికూతురు స్వయంగా వడ్డన చేస్తుంది. ఐదారు కిలోల చేపలు, చీర, జాకెట్, పసుపు వరుడి ఇంటి నుంచి వధువు ఇంటికి పంపడం ఆనవాయితీ. వాటిని కళాత్మకంగా అలంకరించి మరీ పంపుతారు. అలాగే వరుడి ఇంటికి వధువు తరఫు వారు కూడా కానుకలు పంపుతారు. వీరి పెళ్లిళ్లలో కట్నాల ప్రసక్తి లేకపోవడం విశేషం. ఏడు దశాబ్దాల బెంగాలీ సమితి హైదరాబాద్‌లో బెంగాలీ సమితి ఏడు దశాబ్దాల కిందటే ఏర్పడింది. ఇది 1942లో రిజిస్టర్ అయింది. అయితే, అంతకు ముందు నుంచే ఇక్కడ ఉంటున్న బెంగాలీలు కలసికట్టుగా పండుగలు, వేడుకలు జరుపుకుంటూ వచ్చేవారు. 1950ల నుంచి ఇక్కడ బెంగాలీల దుర్గాపూజ మహోత్సవాలు మొదలయ్యాయి. మా నాన్న 1951లో ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత చాలామంది బెంగాలీలు ఉద్యోగరీత్యా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. ఇది స్వీట్ సిటీ. - సుమీత్ సేన్, జనరల్ సెక్రటరీ, బెంగాలీ సమితి