రూ.500 టికెట్ల విక్రయం నిలిపివేత
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల సందర్భంగా దేవస్థానం విక్రయిస్తున్న రూ.500 వీఐపీ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఆదివారం ఉదయం నుంచి ఈ టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని ఆలయ అధికారులు ఆదేశించినట్లు కౌంటర్లలో సిబ్బంది చెబుతున్నారు. శనివారం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు పలువురు భక్తులు టికెట్ల ధరలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. టికెట్ల ధరలు పెంచడాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు పలు ఆధ్యాత్మిక సంస్థలు వ్యతిరేకించాయి. ఈ విషయం కూడా సీఎం దష్టిలో ఉండటంతో రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.