చందర్లపాడు(కృష్ణా జిల్లా): వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తోటరావుల్లపాడులో శుక్రవారం చోటుచేసుకుంది.
తోటరావుల్లపాడులోని చెరువు కట్టపై నుంచి వస్తున్న ప్రయాణికుల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన గ్రామస్తులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
Published Fri, Sep 9 2016 9:36 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement