విజయవాడ : కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం వద్ద కూలీలను తీసుకువెళ్తున్న ఆటో బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను చందర్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ప్రమాదంపై ఆరా తీశారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.