Auto overturned
-
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
చందర్లపాడు(కృష్ణా జిల్లా): వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తోటరావుల్లపాడులో శుక్రవారం చోటుచేసుకుంది. తోటరావుల్లపాడులోని చెరువు కట్టపై నుంచి వస్తున్న ప్రయాణికుల ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇది గుర్తించిన గ్రామస్తులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో బోల్తా : బాలుడు మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా కూడేరు వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : ఎనిమిది మందికి గాయాలు
విజయవాడ : కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం వద్ద కూలీలను తీసుకువెళ్తున్న ఆటో బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను చందర్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ప్రమాదంపై ఆరా తీశారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆటో బోల్తా : 11 మందికి గాయాలు
నెల్లూరు : నెల్లూరు జిల్లా దగదర్తి మండలం మనుబోలుపాడులో మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. -
ఆటో బోల్తా: ఏడుగురికి తీవ్ర గాయాలు
నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం అక్కరపాక సమీపంలో శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
-
నిమజ్జనానికి వెళ్తూ బోల్తా పడిన ఆటో
హైదరాబాద్: వినాయకుడ్ని హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి తీసుకువెళ్తున్న ఆటో ట్రాలీ సోమవారం ఎంజే మార్కెట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒకరు సృహా కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయాపడ్డారు. దాంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనలో వినాయకుడి విగ్రహాం ధ్వంసమైంది. డ్రైవర్ ఆటోను మలుపు తిప్ప బోయారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.