సోమందేపల్లి : గోరంట్ల నుంచి మంగళవారం వానవోలుకు వెళుతున్న ప్యాసింజర్ ఆటో ఎముకలగుట్టపల్లి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఆదెమ్మ, లక్ష్మి, మహేష్, రంగనాథనాయక్, శ్యామల, హరీష్ గాయపడ్డారు. వెంటనే వీరిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.