కురబలకోట: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకుని ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం గంగావారిపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి రావడంతో అతణ్ని వేరే వర్గం వారు అడ్డుకున్నారు.
ఆ వివాదం కాస్త పెద్దది కావడంతో ఇరు వైపుల వారు దాడి చేసుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నిమజ్జనంలో ఘర్షణ: ఆరుగురికి గాయాలు
Published Sun, Sep 20 2015 2:18 PM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM
Advertisement
Advertisement