kurubalakota
-
బీటెక్ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి
సాక్షి, బి.కొత్తకోట: కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఓ విద్యార్థిని (20)పై అదే ఊరికి చెందిన ముగ్గురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. గత నెల 3న రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో లైంగిక దాడి కేసు నమోదు చేసినట్లు రూరల్ సర్కిల్ సీఐ అశోక్‌కుమార్ గురువారం వెల్లడించారు. ఆయన కథనం..అంగళ్లుకు చెందిన ఓ విద్యార్థిని మదనపల్లె దగ్గరున్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. గతనెల 3న రాత్రి 7గంటల ప్రాంతంలో ఈమె స్నేహితుడితో కలసి అంగళ్లులోని ఓ కళాశాల వద్ద ఉండగా అదే ఊరికి చెందిన ఎస్.అస్రఫ్ (24), జయచంద్ర (23), షామీర్ (23) మద్యం సేవించి చీకట్లో ఎవరో జంట ఉన్నారని తొలుత అస్రఫ్ వారి వద్దకు వెళ్లాడు. తమ గ్రామ విద్యార్థిని కావడంతో పక్కనున్న ఆమె స్నేహితుడిని బెదిరించి ఆ విద్యార్థినిని బలవంతంగా లాక్కుపోయి అస్రఫ్ లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత జయచంద్ర, షామీర్ కూడా లైంగిక దాడికి చేశారు. అంతేకాకుండా ఈ ఉదంతాన్ని వీడియో తీసి, ఎవరికైనా చెబితే హతమారుస్తామని బెదిరించారు. అనంతరం ఆ విద్యార్థినిని బైక్‌పై వారింటికి దగ్గరగా అస్రఫ్ వదిలి వెళ్లా డు. ఆ మృగాళ్ల బెదిరింపులకు భయపడి ఇన్నాళ్లూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అస్రఫ్ బీటెక్ పూర్తిచేసి ఖాళీగా ఉన్నా డు. జయచంద్ర స్థానికంగా పూలహారాలు కడుతూ జీవిస్తున్నాడు. షామీర్ ప్రైవేటు వాహనాల డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
చౌకగా పనిచేయలేం
ఈ–పాస్ వచ్చాక రేషన్ షాపుల నిర్వహణ వ్యయ ప్రయాసగా మారింది. అదనపు పనివారు, అన్‌లోడింగ్‌చార్జీలు, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. డీడీలు కట్ట డం నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు డీలర్లు చెబుతున్నారు. కమీషన్ చాలా తక్కువగా ఉందని, క్వింటాల్ బియ్యానికి రూ.150కి పెంచాలని, నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరించాలని కోరుతున్నారు. కురబలకోట : చౌక దుకాణాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని డీలర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీడీలు కట్టడం నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నియోజక వర్గంలో 150 మంది డీలర్లు ఉన్నారు. నెలలో 15 రోజుల సరుకులు ఇవ్వడానికే సమయం సరిపోతోందని చెబుతున్నారు. ప్రభు త్వ పథకాల అమలులో భాగస్వామం కావాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కమీషన్ పెంచాలని, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్‌కు సరఫరా చేస్తున్న సరుకుల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ–పాస్ వచ్చాక పని భారం పెరిగి వ్యయప్రయాసలు ఎక్కువయ్యాయని వాపోతున్నారు. కనీస ఆదాయం లేక కాలం గడుపుతున్న తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యయప్రయాసలు రేషన్ షాపుల నిర్వహణ వ్యయ ప్రయాసగా మారింది. షాపు బాడుగ, కూలీల ఖర్చు, కరెంట్ చార్జీలు, అదనపు పనివారు, అన్‌లోడింగ్‌చార్జీలు, బ్యాంకు చలానాతో పాటు ఇతర ఖర్చులుతడిసి మోపెడవుతున్నాయి. డీలర్‌కు ఇచ్చే కమీషన్ కూడా తక్కువే. విధిలేక వదలలేక చేస్తున్నాం. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతాం –గోపాల్ రెడ్డి, డీలర్ల అసోసియేషన్ డివిజన్ అధ్యక్షుడు కమీషన్ పెంచాలి క్వింటాల్ బియ్యానికి రూ.70 కమీషన్ ఇస్తున్నారు. దీన్ని రూ.150కి పెం చాలి. కూలీలతో పాటు షాపు నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరించాలి. కార్డుకు సర్‌చార్జీ కింద రూ.10 ఇవ్వాలి. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ప్రభుత్వ పథకాల్లో సహకరిస్తున్నా కష్టానికి తగ్గ ఫలితం లేదు –ఎస్ఎం.బాషా, డీలర్ల సంఘం నాయకుడు, కురబలకోట -
నిమజ్జనంలో ఘర్షణ: ఆరుగురికి గాయాలు
కురబలకోట: వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ చోటు చేసుకుని ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం గంగావారిపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి మద్యం సేవించి రావడంతో అతణ్ని వేరే వర్గం వారు అడ్డుకున్నారు. ఆ వివాదం కాస్త పెద్దది కావడంతో ఇరు వైపుల వారు దాడి చేసుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.