
సాక్షి, బి.కొత్తకోట: కురబలకోట మండలం అంగళ్లుకు చెందిన ఓ విద్యార్థిని (20)పై అదే ఊరికి చెందిన ముగ్గురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. గత నెల 3న రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో లైంగిక దాడి కేసు నమోదు చేసినట్లు రూరల్ సర్కిల్ సీఐ అశోక్‌కుమార్ గురువారం వెల్లడించారు. ఆయన కథనం..అంగళ్లుకు చెందిన ఓ విద్యార్థిని మదనపల్లె దగ్గరున్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. గతనెల 3న రాత్రి 7గంటల ప్రాంతంలో ఈమె స్నేహితుడితో కలసి అంగళ్లులోని ఓ కళాశాల వద్ద ఉండగా అదే ఊరికి చెందిన ఎస్.అస్రఫ్ (24), జయచంద్ర (23), షామీర్ (23) మద్యం సేవించి చీకట్లో ఎవరో జంట ఉన్నారని తొలుత అస్రఫ్ వారి వద్దకు వెళ్లాడు. తమ గ్రామ విద్యార్థిని కావడంతో పక్కనున్న ఆమె స్నేహితుడిని బెదిరించి ఆ విద్యార్థినిని బలవంతంగా లాక్కుపోయి అస్రఫ్ లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత జయచంద్ర, షామీర్ కూడా లైంగిక దాడికి చేశారు. అంతేకాకుండా ఈ ఉదంతాన్ని వీడియో తీసి, ఎవరికైనా చెబితే హతమారుస్తామని బెదిరించారు. అనంతరం ఆ విద్యార్థినిని బైక్‌పై వారింటికి దగ్గరగా అస్రఫ్ వదిలి వెళ్లా డు. ఆ మృగాళ్ల బెదిరింపులకు భయపడి ఇన్నాళ్లూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అస్రఫ్ బీటెక్ పూర్తిచేసి ఖాళీగా ఉన్నా డు. జయచంద్ర స్థానికంగా పూలహారాలు కడుతూ జీవిస్తున్నాడు. షామీర్ ప్రైవేటు వాహనాల డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment