సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. సోమవారం(సెప్టెంబర్16) నిమజ్జనంపై సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.’నిమజ్జనానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులను ఆదేశించాం.ట్యాంక్‌బండ్‌పై క్రేన్స్ ఏర్పాటు చేశాం. ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం జరుగుతుంది.
నాతోపాటు అధికారులు కూడా గత వారం రోజుల నుంచి నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. వేలసంఖ్యలో సిబ్బంది, అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాం. గతంతో పోలిస్తే ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం’అని మేయర్ చెప్పారు.
కాగా, హైదరాబాద్‌లో మంగళవారం(సెప్టెంబర్ 17) నిమజ్జనం జరగనున్న విషయం తెలిసిందే. నిమజ్జనం కోసం పోలీసులు పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్, నాలుగు గంటలకు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి.. గణేష్ నిమజ్జనం..అనుభవాల నుంచి పాఠాలు
Comments
Please login to add a commentAdd a comment