జమ్మూ కాశ్మీర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బీఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా సరిహద్దు వెంబడి జరిపిన కాల్పుల్లో ఇరవై మంది గాయపడ్డారు. గాయపడినవారిలో బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు 15మంది సామాన్య పౌరులు ఉన్నారు. సాంబ, కొత్వా జిల్లాలతో పాటు కానాచాక్, ఆర్నియా, పర్గావల్ ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది.
కొన్నిచోట్ల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ జవాన్లు తిప్పికొడుతున్నారు. కాగా 20 గ్రామాల్లోని సుమారు 20వేల కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాయి.మరోవైపు ప్రతిష్టంభన తొలగించడానికి ఇరు దేశాల సైనిక అధికారులు హాట్‌లైన్‌లో మాట్లాడుకున్నా ఫలితం లేకపోయింది.