జమ్మూ: పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ జిల్లాలోని సరిహద్దు వద్ద పాక్ సైనికులు భారత స్థావరాలపై కాల్పులు జరిపారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కాల్పులు జరిపినట్టు ఓ పోలీస్ అధికారి తెలిపారు.
పాక్ సైన్యం భారత భూభాగంలోని బీఎస్ఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. 'మంగళవారం అర్ధ రాత్రి 12 నుంచి 1 గంటలకు పాక్ సైనికులు కాల్పులు జరిపారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు మళ్లీ కాల్పులకు దిగారు. భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయి' అని పోలీస్ అధికారి చెప్పారు.
భారత స్థావరాలపై పాక్ కాల్పులు
Published Wed, Aug 13 2014 8:32 AM | Last Updated on Mon, Mar 25 2019 3:03 PM
Advertisement
Advertisement