కర్నూలు : జిల్లాలోని రుద్రవరం మండలం చందలూరులో బుధవారం తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. హుస్సేన్ అనే వ్యక్తిపై మాజీ సర్పంచ్ సంజీవరాయుడు కత్తిలో దాడి చేసి... తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారైయ్యాడు. దీంతో హుస్సేన్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.
స్థానికులు వెంటనే స్పందించి... అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని... మెరుగైన వైద్య చికిత్స కోసం కర్నూలు తరలించాలని వైద్యులు తెలిపారు. దీంతో అతడిని కర్నూలు తరలిస్తున్నారు. కాగా చేతబడి చేశాడనే అనుమానంతోనే హుస్సేన్పై మాజీ సర్పంచ్ సంజీవరాయుడు దాడి చేశాడని..పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.