హజరత్ హుసేన్ త్యాగాలు చిరస్మరణీయం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): మహమ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రాణ త్యాగాలు చేశారని హజరత్ అజీముద్దీన్ దర్గా బ్రాదరే సజ్జాదే నషీన్ సయ్యద్ తాహెర్ పాషా ఖాద్రి పేర్కొన్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకుని ముహిబ్బానే అహ్లెబైత్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇస్లామియా అరబ్బిక్ కళాశాల మైదానంలో 'యాదే హుసైన్' పేరుతో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. లావుబాలీ దర్గా పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్లా హుసేని బాద్‌షా ఖాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మన్షాద్ పాషా ఖాద్రి, సయ్యద్ రిజ్వాన్ పాషా ఖాద్రి, సయ్యద్ షఫి పాషా ఖాద్రి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు.