= పోలీసుల అదుపులో కామాంధుడు
= అజ్ఞాతంలో నలుగురు
= నమ్మించి సినిమాకు తీసుకు వెళ్లి..
= ఆలస్యంగా వెలుగులోకి
బెంగళూరు, న్యూస్‌లైన్ : బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వ చ్చింది. ఈ సంఘటనలో అబుల్లా అనే కామాంధుడిని ఇక్కడి హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ రాజేష్ కథనం ప్రకారం... బెమెల్ లేఔట్‌లోని క్వార్టర్స్‌లో బాధితురాలి తల్లిదండ్రులు కూరగాయలు విక్రయిస్తుంటారు. వీరి కుమార్తె (15) ఆరో తరగతి వరకు చదువుకుంది. వ్యాపారంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఇదిలా ఉంటే బాలికకు హుస్సేన్ అనే యువకుడితో పరిచయం ఉంది.
ఈనెల 23న హుస్సేన్ బాలికను నమ్మించి మధ్యాహ్నం సినిమాకు తీసుకెళ్లాడు. సాయంత్రం ఇద్దరు ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో బెమెల్ క్వార్టర్స్ సమీపంలోని బెమెల్ నీలగిరి తోటలోకి బాలికను లాక్కెళ్లి లైంగికదాడికి యత్నించాడు. ఆ సమయంలో బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. అదే సమయంలో సమీపంలో మకాం వేసిన హుస్సేన్ స్నేహితులు అబ్దుల్లా, జాఫర్, వాసీం, ఖాన్ అక్కడికి వచ్చారు. బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక సృహ కోల్పోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
సృహలోకి వ చ్చిన బాలిక ఇంటికి చేరుకుని తండ్రికి చెప్పి కుప్పకూలిపోయింది. బాలికను ఆస్పత్రికి తరలించి తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాలిక వివరాల ఆధారంగా అబ్దుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని సోమవారం హెచ్‌ఏఎల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ తెలిపారు. బాలిక ఇప్పటికి సరిగా మాట్లాడే పరిస్థితిలో లేదని, పూర్తిగా కోలుకున్న అనంతరం విచారించి అన్ని వివరాల వెల్లడిస్తామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అజ్ఞాతంలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
బాలికపై సామూహిక లైంగికదాడి
Published Tue, Nov 26 2013 2:32 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement