పెళ్లి ఇష్టంలేక యువకుని ఆత్మహత్య | youth commits suicede due to dislike of marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇష్టంలేక యువకుని ఆత్మహత్య

Published Tue, May 3 2016 8:14 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

youth commits suicede due to dislike of marriage

గిద్దలూరు(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నల్లబండబజారులో నివసిస్తున్న హుసేన్(25) అనే యువకుడు పెళ్లి ఇష్టంలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. పొరుగూరి అమ్మాయితో హుసేన్‌కు ఇటీవలే పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురి ఇంటి వాళ్లతో పెళ్లి విషయమై మాట్లాడేందుకు కుటుంబసభ్యులు వెళ్లారు.

దాంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న హుసేన్ మంగళవారం ఉదయం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement