
ఐపీఎల్ బెట్టింగ్ నిందితుల అరెస్టు
మదనపల్లెలో ఆరుగురు ఐపీఎల్ బెట్టింగ్ నిందితులను ఒకటవ పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
మదనపల్లె క్రైం: మదనపల్లెలో ఆరుగురు ఐపీఎల్ బెట్టింగ్ నిందితులను ఒకటవ పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు హుస్సేన్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.2.1 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌చార్జ్ సీఐ హనుమంతునాయక్ తెలిపారు. కదిరి రోడ్డు అమ్మచెరువుమిట్ట సమీపంలోని తులసీ దాబా వద్ద పట్టణంలోని కమ్మవీధికి చెందిన దేవరెడ్డి నరసింహులు కుమారుడు శ్రీధర్(42), గుండ్లూరి వీధికి చెందిన సోంపాళ్యం కృష్ణయ్య కుమారుడు రమేష్‌బాబు(37), సిపాయి వీధిలో ఉంటున్న రెడ్డి వెంకటరామయ్య కుమారుడు లక్ష్మణరావు అలియాస్ లల్లు(24), దేవళం వీధికి చెందిన సురేష్(32), అదే వీధిలోని ఆకుల నాగరాజు కుమారుడు శ్రీకాంత్(23), త్యాగరాజు వీధికి చెందిన జక్కల వెంకటేష్ కుమారుడు వెంకటస్వామి(27) ఒకచోట సమావేశమయ్యారని తెలిపారు. ఎస్‌ఐ సుకుమార్, సిబ్బంది శంకర, సిద్దు, రాజేష్, రాఘవతో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
హుస్సేన్‌కు జిల్లా బహిష్కరణ తప్పదు
మాలిక్ ఫంక్షన్‌హాల్‌లో నివాసముంటున్న హుస్సేన్ గతంలోనూ పెద్ద ఎత్తున ఐపీఎల్ బెట్టింగ్‌లు ఆడుతూ అరెస్టు అయ్యాడని సీఐ హనుమంతునాయక్ తెలిపారు. బెయిల్‌పై వచ్చినా తన తీరులో మార్పులేదన్నారు. నిందితుడిని జిల్లా నుంచి బహిష్కరిస్తామని పేర్కొన్నారు.