'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి' | ys vijayamma compaigning in visakha district | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి'

Published Fri, Apr 18 2014 2:48 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి' - Sakshi

'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి'

విశాఖ : ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో  కృషి చేశారని విశాఖ వైఎస్ఆర్ సీపీ లోక్సభ అభ్యర్థి వైఎస్‌ విజయమ్మ కొనియాడారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత వైఎస్‌ఆర్‌దేనని ఆమె అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభంలో ప్రజలనుద్దేశించి  ప్రసంగించిన విజయమ్మ ...... రాబోయే ఎన్నికల్లో సంక్షేమం కోసం పాటుపడే వైఎస్‌ఆర్ సీపీకి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

మూతపడిన చిట్టివలస జూట్ మిల్లు సమస్యను పరిష్కరిస్తామని విజయమ్మ పద్మనాభం బహిరంగ సభలో హామీ ఇచ్చారు. మత్య్సకారులకు వేట నిషేధ కాలంలో మూడువేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. చేపల వేటకు వెళ్లే మరపడవల డీజిల్ సబ్సిడీ రూ.6నుంచి రూ.10కి పెంచుతామన్నారు. వ్యవసాయ రైతులకు ఆనందపురంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని, భీమిలిని అందమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న భీమిలి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా నడిపిస్తామని విజయమ్మ తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement