
ప్రతీకాత్మక చిత్రం
బళ్లారి రూరల్(బెంగళూరు): మృత్యువు అనేది ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ జరగాల్సి ఘోరం జరిగిపోతుంటాయి. ఓ వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడుతుండగా బాల్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బళ్లారి రూరల్ ఇందిరానగర్‌కు చెందిన విజయ్(32) దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు.
ఇతనికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. తరచూ క్రికెట్ ఆడుతుండేవాడు. సోమవారం సాయంత్రం ఎప్పటిలానే క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు వెళ్లాడు. ఆట మధ్యలో క్రికెట్ బాల్ అతని చెవికి తగిలి రాయి మీద పడ్డాడు. దీంతో గాయపడిన విజయ్‌ని విమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతు అతను బుధవారం మృతిచెందాడు. బళ్లారి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చదవండి: మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు
Comments
Please login to add a commentAdd a comment