బస్సు డ్రైవర్కు చిర్రెత్తుకొచ్చి.. | Bus driver intentionally hits car and runs over driver after getting enraged | Sakshi

బస్సు డ్రైవర్కు చిర్రెత్తుకొచ్చి..

May 16 2016 2:45 PM | Updated on Sep 4 2017 12:14 AM

బస్సు డ్రైవర్కు చిర్రెత్తుకొచ్చి..

బస్సు డ్రైవర్కు చిర్రెత్తుకొచ్చి..

బస్సు డ్రైవర్ ఆగ్రహావేశానికిలోనై తనకు అడ్డొచ్చిన కారును పలుమార్లు డ్యాష్ ఇచ్చాడు.

బస్సు డ్రైవర్ ఆగ్రహావేశానికిలోనై తనకు అడ్డొచ్చిన కారుకు పలుమార్లు డ్యాష్ ఇచ్చాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ కాళ్లు విరిగాయి. ఈ తతంగాన్నంతా రోడ్డు పై నడుస్తూ వెళుతున్న ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేశాడు. ఈ సంఘటన తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్, క్విన్జూ నగరంలో చోటు చేసుకుంది.ఈ వీడియోలో బస్సుతో డ్రైవర్, కారును పలుమార్లు కావాలని ఢీకొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

బస్సు యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం..కారు, బస్సు డ్రైవర్ల మధ్య తలెత్తిన చిన్న వివాదం కాస్త పెద్ద గొడవకు దారితీసింది. దీంతో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. అదే సమయంలో తన కోపాన్ని బస్సు డ్రైవర్కు చూపించాలనుకున్నాడు కారు డ్రైవర్. వెంటనే కారును తీసుకువచ్చి బస్సు ముందు నెమ్మదిగా తీసుకు వెళ్లడం ప్రారంభించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బస్సు డ్రైవర్ కారుకు డ్యాష్ ఇచ్చాడని బస్సు యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement