east China
-
చైనాలో అగ్ని ప్రమాదం.. 39 మంది బలి
బీజింగ్/నాన్‌చాంగ్: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో బుధవారం ఒక దుకాణసముదాయంలో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్జిన్యూ నగరంలోని ఈ భవన సమదాయంలో ఇంకా కొందరు చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక గ్జియాన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. -
‘మహా ప్రళయమే’ ముంచుకొస్తోందా? అనే స్థాయిలో ప్రచండ గాలులు
టోక్యో: ఈ ఏడాదిలో అత్యంత శక్తివంతమైన గాలివాన తుపానుగా అభివర్ణిస్తున్న హిన్నమ్నోర్.. ఇప్పుడు దక్షిణాసియా దేశాలను వణికిస్తోంది. మహా ప్రళయమే ముంచుకొస్తోందా అనే రేంజ్లో ముందుకొస్తోంది తుపాను. జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం.. తూర్పు చైనా సముద్రం నుంచి ఈ బలమైన ఉష్ణమండల తుపాను జపాన్ దీవుల దూసుకువస్తోంది. దీంతో తూర్పు చైనా, జపాన్ సహా పలు దేశాలు, దక్షిణ దీవులు భయాందోళనలకు లోనవుతున్నాయి. సూపర్ టైపూన్ హిన్నమ్నోర్గా నామకరణం చేసిన ఈ శక్తివంతమైన తుపాను.. 50 అడుగుల ఎత్తులో.. గంటకు 160 మైళ్లు(257 కిలోమీటర్ల) వాయువేగంతో దూసుకొస్తోందని అమెరికా జాయింట్ టైపూన్ వార్నింగ్ సెంటర్ ప్రకటించింది. ఈ ప్రభావంతో గాలులు గంటకు 195 మైళ్ల (314 కిలోమీటర్ల) వేగంతో వీస్తాయని హెచ్చరించింది. ఈ ప్రభావం.. చైనా, జపాన్‌తో పాటు ఫిలిప్పీన్స్‌పైనా తీవ్రంగా చూపించనుంది. చిన్న చిన్న ద్వీపాలపై దీని ప్రభావం మరింతగా ఉండొచ్చని భావిస్తోంది. అయితే దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలు, భారత్ తీర ప్రాంతాలపై ప్రభావం తక్కువగా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2.5-minute rapid scan #Himawari8 Infrared images showing Super Typhoon #Hinnamnor as it reached Category 5 intensity while approaching the island of Minamidaitōjima, Japan (station identifier ROMD): https://t.co/oPnRJDgHbY pic.twitter.com/zIkcWGDrEG — UW-Madison CIMSS (@UWCIMSS) August 30, 2022 ఈ ఏడాదిలో వేగం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దూసుకొచ్చిన 11 తుపానులలో.. హిన్నమ్నోర్ అత్యంత శక్తివంతమైన తుపానుగా పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు. మరోవైపు జపాన్ ఒకినావా నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయం తుపాను కేంద్రీకృతమై ఉందని, గంటకు 22 కిలోమీటర్ల వేగంతో రియూక్యూ ద్వీపాల వైపు దూసుకొస్తోందని హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకటించింది. ఇప్పటికే జపాన్ తీర ప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్రమక్రమంగా పశ్చిమం వైపు కదులుతూ ఈ తుపాను బలహీన పడొచ్చని అంచనా వేస్తున్నారు. BREAKING: TY #Hinnamnor is now a SUPER TYPHOON in PAGASA. This was based on their 4 PM Daily Weather Update. It will retain its "super typhoon" status as it enters PAR tomorrow, becoming the first storm to do so since #OdettePH (#Rai) in 2021, and the fourth overall since 2015. pic.twitter.com/2TCLDZRlKS — Matthew Cuyugan (@MatthewCuyugan) August 30, 2022 ఇదిలా ఉంటే.. ఆఫ్రికా, కరేబియన్ మధ్య ఉండే అట్లాంటిక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రశాంతత వాతావరణం నెలకొంది అక్కడ. సాధారణంగా ఆగస్టు నెల తుపాను సీజన్ అయినప్పటికీ.. దాదాపు 25 తర్వాత ఈ రీజియన్‌లో ఇలా ప్రశాంత వాతావరణం కనిపిస్తుండడంపై వాతావరణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. Super Typhoon #Hinnamnor has rapidly intensified in the Western Pacific Ocean with sustained winds of 150 mph and gusts up to 185 mph and could impact Miyakojima of the Miyako Islands of Okinawa. @JaneMinarWX with the latest. pic.twitter.com/V6Cp4UqDCS — FOX Weather (@foxweather) August 31, 2022 ఇదీ చదవండి: అమెరికాకు గట్టి షాక్ ఇచ్చిన చిన్న ద్వీపం -
త్రుటిలో తప్పిన యుద్ధనౌకల ఢీ
టోక్యో: తూర్పు చైనా సముద్రంలో అమెరికా, రష్యా యుద్ధనౌకలు శుక్రవారం ఢీకొట్టుకోబోయాయి. అయితే చివరి నిమిషంలో రెండునౌకల కెప్టెన్లు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయమై అమెరికాకు చెందిన 7వ ఫ్లీట్ స్పందిస్తూ..‘మా నౌక యూఎస్ఎస్ చాన్స్లర్విల్లే తూర్పుచైనా సముద్రంలో శుక్రవారం స్థిరంగా వెళుతోంది. ఈ క్రమంలో వెనుకే వస్తున్న రష్యన్ డెస్ట్రాయర్ యుద్ధనౌక ఒక్కసారిగా వేగం పెంచి 50 మీటర్ల సమీపానికి వచ్చేసింది. దీంతో యూఎస్ఎస్ ఛాన్స్లర్విల్లేలోని అన్ని ఇంజన్లను మండించి రెండు నౌకలు ఢీకొట్టకుండా చూడగలిగాం. రష్యా వ్యవహారశైలి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా ఉంది’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై రష్యా స్పందిస్తూ..‘మా అడ్మిరల్ వినొగ్రడోవ్ డెస్ట్రాయర్ నౌక వెళుతున్న మార్గానికి అడ్డంగా అమెరికా యుద్ధనౌక అకస్మాత్తుగా వచ్చేసింది. దీంతో మా నౌకను మరోదిశకు మళ్లించి రెండు యుద్ధనౌకలు ఢీకొట్టుకోకుండా నివారించగలిగాం. ఈ విషయంలో అమెరికాకు మా నౌకాదళం నిరసనను తెలియజేసింది’ అని చెప్పింది. -
తూర్పు చైనా సముద్రంలో నౌకల ఢీ
బీజింగ్ : తూర్పు చైనా సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ నౌక, సరకు రవాణా నౌక ఢీకొన్న ప్రమాదంలో ట్యాంకర్‌కు చెందిన మొత్తం 32 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 30 మంది ఇరాన్ దేశస్తులు కాగా ఇద్దరు బంగ్లాదేశీయులు. ఇరాన్ నుంచి 1.36 లక్షల టన్నుల ముడి చమురుతో వెళ్తున్న సాంచీ అనే రవాణా నౌక శనివారం సాయంత్రం షాంఘైకి 160 నాటికల్ మైళ్ల దూరంలో చైనాకు చెందిన, 64 వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న సీఎఫ్ క్రిస్టల్ అనే మరో సరకు రవాణా నౌకను ఢీకొట్టింది. ముడిచమురు కావడంతో వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్‌కు చెందిన 32 మంది సిబ్బంది గల్లంతవ్వగా, క్రిస్టల్ నౌకలోని మొత్తం 21 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ముడి చమురు వ్యాపించడంతో సముద్ర జలాలు కలుషితమయ్యాయని చైనా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి కూడా సాంచి ఇంకా నీటిపై తేలుతూ, మండుతూనే ఉందనీ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. గల్లంతైన వారిని వెతికేందుకు చైనా సముద్రతీర విభాగం అధికారులు 8 ఓడలను పంపించారు. దక్షిణ కొరియా కూడా ఓ విమానాన్ని, తీర ప్రాంత రక్షణ దళానికి చెందిన ఓ నౌకను పంపించి గాలింపు చర్యలు చేపడుతోంది. -
300 అడుగుల లోతు నుంచి 2 గంటల్లోనే..
గతేడాది చైనాలో ఏకంగా 300 అడుగుల బోరుబావిలో అడుగున ఉన్న మూడేళ్ల బాలుడిని అక్కడి అధికారులు కేవలం రెండు గంటల్లోనే కాపాడి శెభాష్ అనిపించుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం బోరు బావిలో పడిన 18 నెలల చిన్నారి మీనాను మూడు రోజులైనా ప్రాణాలతో బయటకు తీయలేకపోయారు. చివరికి మృతదేహాన్ని అవశేషాలతో బయటకు తీయాల్సి వచ్చింది. తొలుత పాప కేవలం 40 అడుగుల లోతులో పడిపోయిందని త్వరగానే రక్షిస్తారని అందరూ భావించగా.. ఆపై 110 అడుగుల లోతుకు జారిందని శుక్రవారం అన్నారు. శనివారం నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్నారి మీనా 200 అడుగుల మేర ఉన్నట్లుగా కెమెరాలలో కనిపించక పోవడం విచారకరం . చైనాలో అద్భుతమైన టెక్నాలజీ ఆ వివరాలు.. గతేడాది మార్చి 31న తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్, వీఫాంగ్ లో మూడేళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అరగంటలో ఘటనాస్థలానికి రెండు ఫైరింజన్లు, 12 మంది సిబ్బంది చేరుకున్నారు. 11 ఇంచుల వెడల్పున్న బోరు బావిలో పడ్డ చిన్నారి 300 అడుగుల లోతులో ఉన్నాడని సెన్సార్ల ద్వారా గుర్తించారు. సెన్సార్లతో పాటు ఆక్సిజన్ పైపును, చిన్నారికి కట్టేందుకు ఇతరత్రా పైపులను సిబ్బంది బోరులోకి పంపారు. సెన్సార్ల సాయంతో వారి వద్ద ఉన్న మానిటర్లో బాలుడి కదలికలను గుర్తించారు. ఆపై బాబు ముక్కుకు ఆక్సిజన్ పైపు సెట్ చేశారు. అత్యాధునిక సెన్సార్ల సాయంతో బాబుకు ఓ పైపు చుట్టుకునేలా చేశారు. తమ వద్ద ఉన్న స్క్రీన్‌లో చూస్తూ చిన్నారికి కట్టిన పైపుతో పాటుగా ఆక్సిజన్, సెన్సార్ పైపులను పైకి లాగడం ప్రారంభించారు. ఇలా జాగ్రత్తగా రెండు గంటలపాటు ఎంతో శ్రమించిన సిబ్బంది బాలుడికి ఎలాంటి గాయాలు అవకుండానే బోరుబావి నుంచి రక్షించారు. బాలుడి తల్లిదండ్రులతో పాటు ఘటనా స్థలంలో ఉన్న అందరూ ఈ అద్బుతాన్ని వీక్షించారు. బాలుడి తండ్రి చెంగ్ ఫైర్ సిబ్బందికి ధన్యావాదాలు తెలిపాడు. అంత లోతైన బోరుబావిలో పడినా.. నా కుమారుడికి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. అయితే భయంతో ఎంతోసేపు ఏడుస్తూనే ఉన్నాడని చెప్పాడు. అద్భుతమైన టెక్నాలజీని వినియోగించిన కారణంగానే సిబ్బంది తమ కుమారుడిని రక్షించగలిగారని ఆనందభాష్పాలతో చెప్పడం స్థానికులు ఎప్పటికీ మరిచిపోరు. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తే 300 అడుగుల లోతైన బోరు బావిలో పడిన చిన్నారుల ప్రాణాలను సైతం సులువుగా రక్షించవచ్చని చైనా వాసులు నిరూపించినా.. భారత్ లో మాత్రం 100 అడుగుల లోతైన బోరు బావిలో పడుతున్న చిన్నారులను రక్షించలేక పోవడం విచారకరమని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత కథనాలు చిట్టితల్లీ క్షేమమేనా? 200 అడుగుల కిందికి జారిన చిన్నారి -
షాకింగ్ వీడియో: ప్రమాదం జరిగినా..
చైనాలోని ఓ మార్కెట్ పరిధిలోని సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్నాయి. రెండేళ్లు కూడా నిండని పసిబాలుడు తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్‌కు వచ్చాడు. బాలుని పేరెంట్స్ పక్కనే ఉన్న మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో బాలుడు ఒంటరిగా ఆడుకుంటుండగా ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. పార్కింగ్లోంచి మినీ వ్యాన్ తీస్తుండగా బాలున్ని గమనించకుండా డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ముందు రెండు టైర్ల మధ్యలో, కుడివైపు టైరుకు దాదాపు ఆనుకొని బాలుని పక్క నుంచి వ్యాను వెళ్లింది. గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. అప్పటికే వెనక టైరు వరకు వచ్చిన బాలుడు వెనక టైరు కిందకు వచ్చాడు. అదృష్టం కొద్ది అక్కడ నీరు ఉండటంతో బ్రేక్ వేయడంతో ఆగిన టైర్లు బాలున్ని ముందుకు తోశాయి. లేక పోతే టైర్లు బాలుని పైకి వచ్చేవి. ఈ సంఘటన తూర్పు చైనాలో జియాంగ్సు ప్రావిన్స్‌లోని క్సుజోహులో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన బాలుని తల్లిదండ్రులు వెంటనే అక్కడకు వచ్చి బాలున్ని బయటకు తీశారు. వ్యాన్ కింద పడి వెనక టైర్లు ముందుకు లాక్కు వచ్చినా బాలుడు స్పల్పగాయాలతో ప్రాణాపాయస్థితినుంచి తప్పించుకున్నాడు. -
బస్సు డ్రైవర్‌కు చిర్రెత్తుకొచ్చి..
బస్సు డ్రైవర్ ఆగ్రహావేశానికిలోనై తనకు అడ్డొచ్చిన కారుకు పలుమార్లు డ్యాష్ ఇచ్చాడు. ఈ ఘటనలో కారు డ్రైవర్ కాళ్లు విరిగాయి. ఈ తతంగాన్నంతా రోడ్డు పై నడుస్తూ వెళుతున్న ఓ వ్యక్తి తన ఫోన్లో రికార్డు చేశాడు. ఈ సంఘటన తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్, క్విన్జూ నగరంలో చోటు చేసుకుంది.ఈ వీడియోలో బస్సుతో డ్రైవర్, కారును పలుమార్లు కావాలని ఢీకొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బస్సు యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం..కారు, బస్సు డ్రైవర్ల మధ్య తలెత్తిన చిన్న వివాదం కాస్త పెద్ద గొడవకు దారితీసింది. దీంతో ఒకరిని ఒకరు దూషించుకున్నారు. అదే సమయంలో తన కోపాన్ని బస్సు డ్రైవర్‌కు చూపించాలనుకున్నాడు కారు డ్రైవర్. వెంటనే కారును తీసుకువచ్చి బస్సు ముందు నెమ్మదిగా తీసుకు వెళ్లడం ప్రారంభించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బస్సు డ్రైవర్ కారుకు డ్యాష్ ఇచ్చాడని బస్సు యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఎందుకిలా చేశారో?
జియాంగ్ సు: కుక్కలపై కక్ష కట్టి వందల సంఖ్యలో వాటిని పొట్టన పెట్టుకున్న 'శునక సీరియర్ కిల్లర్'ను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర చైనాలోని జియాంగ్ సులో గత రెండు నెలలుగా వందల సంఖ్యలో పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి హతమార్చిన నిందితుడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారని 'పీపుల్స్ డైలీ ఆన్ లైన్' వెల్లడించింది. శునకాలను అపహరించి బాణాలతో వాటి ఉసురు తీసినట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు దుండగులు ఈ దారుణాలకు పాల్పడినట్టు కనిపెట్టారు. వీరిలో ఒకడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి పేరు, వివరాలు వెల్లడించలేదు. పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం గాలిస్తున్నారు. నిందితులిద్దరూ చాంగ్ హ్జౌ నుంచి దన్ యాంగ్ కు బైకుపై ప్రయాణిస్తూ కనిపించిన ప్రతి కుక్కను ఎత్తుకు పోయి బాణాలతో చంపేవారని స్థానిక మీడియా వెల్లడించింది. మార్చి నుంచి వీరు ఈ దారుణాలు సాగిస్తున్నారు. మే 12న వీరిలో ఒకడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి విల్లంబు, బాణాలు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన ఏడు శునకాలను కనుగొన్నారు. వందలాది కుక్కలను కిడ్నాప్ చేసి హతమార్చినట్టు నిందితుడు అంగీకరించాడు. అయితే ఇదంతా ఎందుకు చేశారనేది వెల్లడి కాలేదు. దీని వెనుకున్న కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పెంపుడు శునకాల వరుస హత్యలతో జియాంగ్ సు వాసులు భయభ్రాంతులకు గురైయ్యారు. -
కన్న కొడుకులకు చెంప పెట్టు!
బీజింగ్: వృద్దాప్యలో తనను నిర్లక్ష్యం చేసిన ఆ కొడుకులకు తగిన శాస్తి చేయాలనుకున్నాడు ఓ తండ్రి. తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా వారికి దక్కకుండా చేశాడు చైనాకు చెందిన తావో. జీవితాంతం కష్టపడి సంపాదించిన నగదును చనిపోతే తనతోనే కాల్చేయాలని వీలునామాలో రాశాడు. వీలునామా ప్రకారం ఇటీవల ఆయన చనిపోతే దాదాపు రూ.21 లక్షలు ఆయనతోనే కాల్చేశారు. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన తావో.. పది సంవత్సరాల కింద తన పొలాలన్నీ కొడుకులకు అప్పగించి వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని చిన్న పాటి ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు. వృద్దాప్యం వచ్చాక తమ వద్ద ఉండొద్దంటూ ఇద్దర కొడుకులూ చెప్పేశారు. కోపంతో తను సంపాదించిన డబ్బు కొడుకులకు దక్కకూడదని, ఆ డబ్బంతా తనతో పాటే కాల్చేయాలని పేర్కొంటూ వీలునామా రాశాడు. -
నదిలో పడిన బస్సు : నలుగురు గల్లంతు
బీజింగ్: తూర్పు చైనా జియాంగ్జీ ప్రావెన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. గల్లంతయ్యిన వారిలో ముగ్గురు ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ ఉన్నారని తెలిపింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. అనంతరం నదిలో పడిందని పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు ఓ ప్రయాణికుడిని పోలీసులు స్థానికుల సహాయంతో కాపాడి...సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. బస్సు బ్రేకులు ఫేయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు దర్యాప్తులో వెల్లడైందని మీడియా పేర్కొంది.