కన్న కొడుకులకు చెంప పెట్టు! | Strong lesson to sons | Sakshi
Sakshi News home page

కన్న కొడుకులకు చెంప పెట్టు!

Published Mon, Oct 12 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

కన్న కొడుకులకు చెంప పెట్టు!

కన్న కొడుకులకు చెంప పెట్టు!

బీజింగ్: వృద్దాప్యలో తనను నిర్లక్ష్యం చేసిన ఆ కొడుకులకు తగిన శాస్తి చేయాలనుకున్నాడు ఓ తండ్రి. తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా వారికి దక్కకుండా చేశాడు చైనాకు చెందిన తావో. జీవితాంతం కష్టపడి సంపాదించిన నగదును చనిపోతే తనతోనే కాల్చేయాలని వీలునామాలో రాశాడు. వీలునామా ప్రకారం ఇటీవల ఆయన చనిపోతే దాదాపు రూ.21 లక్షలు ఆయనతోనే కాల్చేశారు. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన తావో.. పది సంవత్సరాల కింద తన పొలాలన్నీ కొడుకులకు అప్పగించి వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని చిన్న పాటి ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు.

వృద్దాప్యం వచ్చాక తమ వద్ద ఉండొద్దంటూ ఇద్దర కొడుకులూ చెప్పేశారు. కోపంతో తను సంపాదించిన డబ్బు కొడుకులకు దక్కకూడదని, ఆ డబ్బంతా తనతో పాటే కాల్చేయాలని పేర్కొంటూ వీలునామా రాశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement