Jiangsu Province
-
పాండాలకు బదులు..
బీజింగ్: చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని థాయ్జోయూ జంతు ప్రదర్శన శాల ఇటీవల ఒక ప్రకటన చేసింది. ‘‘అత్యంత అరుదైన వన్యప్రాణుల జంతు ప్రదర్శన మొదలవబోతోంది. సందర్శకులకు ఇదే మా స్వాగతం’’అని తెగ ప్రచారం చేసింది. టికెట్ ధరను రూ.236గా నిర్ణయించింది. అరుదైన జంతువులను చూద్దామని జనం తండోపతండాలుగా వచ్చారు. జూలో ఉండే పులి, సింహం వంటి వన్యప్రాణులతో పాటు ఒక వింత జంతువు సందర్శకుల్ని తెగ ఆకర్షించింది. ఆ ఎన్‌క్లోజర్ వద్ద ‘పాండాలు’అని బోర్డ్ తగిలించి ఉంది. చైనా జాతీయ జంతువు పాండాలాగా ఉండటంతో చాలా మంది దాని ఎన్‌క్లోజర్ చుట్టూతా చేరారు. కొద్దిసేపటికి అవి మొరగడంలో జనం అవాక్కయ్యారు. జూ నిర్వాహకులను నిలదీశారు. దీంతో వాళ్లు అసలు విషయం బయటపెట్టారు. పాండా లేకపోవడంతో ఉత్తర చైనా ప్రాంతానికి చెందిన, చూడ్డానికి చిన్నపాటి సింహంలాగా ఉండే ‘చౌ చౌ’జాతి కుక్కలను ఆ ఎన్‌క్లోజర్‌లో పెట్టారు. వాటికి అచ్చం పాండాలాగా తెలుపు, నలుపు ఛారల రంగు వేశారు. దీంతో జనం తమ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గొడవకు దిగారు. అయినా సరే జూ నిర్వాహకులు తమ తప్పును సమరి్థంచుకోవడం విశేషం. ‘‘జనం జట్టుకు రంగు వేసుకోవట్లేదా. అలాగే వీటికీ డై వేశాం. తప్పేముంది?’అని ఎదురు ప్రశ్నించారు. చైనాలో గతంలో, ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగాయి. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని జూలో రెండు కుక్కలకు రంగేసి ప్రదర్శనకు పెట్టగా సంబంధిత వీడియోలను ఆన్లైన్లో 14 లక్షల మంది షేర్చేశారు. గతంలోనూ ఒక జూలో ఎలుగుబంటి లేకపోవడంతో మనిíÙకి ఎలుగుబంటి వేషం వేయించి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. దౌత్య సంబంధాల్లో భాగంగా చైనా తమ దేశంలోని చాలా పాండాలను మిత్ర దేశాలకు ఇచ్చేసింది. అడువుల నరికివేత, కాలుష్యం కారణంగా పాండాల సంఖ్య తగ్గిపోయింది. అది కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది. గత ఏడాది నవంబర్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,800 పెద్ద పాండాలు అడవుల్లో, 600 పాండాలు జూలలో ఉన్నాయి. వాయవ్య చైనా పర్వతప్రాంతాల్లో అధికంగా పాండాలు కనిపిస్తాయి. -
హాలిడేస్ ఎఫెక్ట్: భారీగా ట్రాఫిక్ జామ్
-
హాలిడేస్ ఎఫెక్ట్: భారీగా ట్రాఫిక్ జామ్
బీజింగ్: చైనాలో సెలవుల సందర్భంగా నగరాల్లోని జనభా ఒక్కసారిగా సొంత ఊర్లకి తరలి వెళ్లింది. అక్టోబర్ 1 నుంచి 7 వరకు చైనా నేషనల్ హాలిడే కావడంతో నగరాల్లో నివసించే వారు ఒక్కసారిగా తమ సొంత ఊర్లకి బయలు దేరడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. దీంతో సొంతవాహనాల్లో సొంత ఊర్లకు బయలు దేరిన వారికి ట్రాఫిక్ ఇబ్బందులు చుక్కలు చూపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వాహనాలు ఏకకాలంలో నగరాల నుంచి బయటకు బయలు దేరడంతో పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జాం అయింది. చైనాలో సాధారణ సెలవురోజుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టోల్ టాక్స్ నుంచి మినహాయింపు కూడా ఇస్తారు. విశాలమైన రోడ్లు ఉండి, టోల్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోయినా టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయిందంటే రద్దీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవొచ్చు. అయితే నగరం వైపు మాత్రం వాహనాలు లేక రోడ్లు వెలవెల పోతున్నాయి. రద్దీ దృష్ట్యా 11 కోట్ల రైలు ట్రిప్పులు సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం కోసం 11 కోట్ల రైలు ట్రిప్పులు అవసరమౌతుందని చైనా రైల్వే కార్పొరేషన్ అంచనా వేస్తోంది. గత ఏడాది చైనా నేషనల్ హాలిడే సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రిప్పులతో పోల్చితే ఈ సారి అంచనా వేస్తున్న ట్రిప్పులు 11.3 శాతం అధికం. తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లో నాన్జింగ్ యాంగ్జి బ్రిడ్జ్ సమీపంలో రద్దీ దృశ్యాలు: -
60 మీటర్ల ఎత్తులో గంటన్నర పాటూ..
సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వచ్చిన పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం యాంగ్జోహూ పారడైజ్లోని ఫెర్రిస్ వీల్ తిరుగుతుండగా ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అందులో కూర్చున్న 138 మంది యాత్రికులు గాల్లోనే గంటన్నరపాటూ ఉండాల్సి వచ్చింది. అందులో నుంచి ఎటూ కదలలేని పరిస్థితితో పాటూ అసలు ఏం జరిగిందో తెలియక పోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లోని యాంగ్జోహూ పారడైజ్ అమ్యూజ్మెంట్ పార్క్‌లో చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలం చేరుకొని దాదాపు 60 మీటర్ల ఎత్తులో ఇరుక్కు పోయిన యాత్రుకులను సురక్షితంగా రక్షించారు. గంటన్నరపాటూ గాల్లోనే ఉండటంతో కళ్లు తిరగడంతో పాటూ ఛాతిలోనొప్పి కూడా వచ్చిందని ఓ పర్యాటకురాలు ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్ అంతరాయంతో సమస్య తలెత్తినట్టు నిర్వాహకులు తెలిపారు. 2015 అక్టోబర్‌లో ప్రారంభించిన యాంగ్జోహూ పారడైజ్ అమ్యూజ్మెంట్ పార్క్ జియాంగ్సూ ప్రావిన్స్‌లోనే అతిపెద్దది. బాధితుల టికెట్ రుసుమును తిరిగి ఇవ్వనున్నట్టు యాజమాన్యం తెలిపింది. -
కన్న కొడుకులకు చెంప పెట్టు!
బీజింగ్: వృద్దాప్యలో తనను నిర్లక్ష్యం చేసిన ఆ కొడుకులకు తగిన శాస్తి చేయాలనుకున్నాడు ఓ తండ్రి. తన సంపాదనలో ఒక్క రూపాయి కూడా వారికి దక్కకుండా చేశాడు చైనాకు చెందిన తావో. జీవితాంతం కష్టపడి సంపాదించిన నగదును చనిపోతే తనతోనే కాల్చేయాలని వీలునామాలో రాశాడు. వీలునామా ప్రకారం ఇటీవల ఆయన చనిపోతే దాదాపు రూ.21 లక్షలు ఆయనతోనే కాల్చేశారు. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన తావో.. పది సంవత్సరాల కింద తన పొలాలన్నీ కొడుకులకు అప్పగించి వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకుని చిన్న పాటి ఉద్యోగం చేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు. వృద్దాప్యం వచ్చాక తమ వద్ద ఉండొద్దంటూ ఇద్దర కొడుకులూ చెప్పేశారు. కోపంతో తను సంపాదించిన డబ్బు కొడుకులకు దక్కకూడదని, ఆ డబ్బంతా తనతో పాటే కాల్చేయాలని పేర్కొంటూ వీలునామా రాశాడు.