
హాలిడేస్ ఎఫెక్ట్: భారీగా ట్రాఫిక్ జామ్
బీజింగ్: చైనాలో సెలవుల సందర్భంగా నగరాల్లోని జనభా ఒక్కసారిగా సొంత ఊర్లకి తరలి వెళ్లింది. అక్టోబర్ 1 నుంచి 7 వరకు చైనా నేషనల్ హాలిడే కావడంతో నగరాల్లో నివసించే వారు ఒక్కసారిగా తమ సొంత ఊర్లకి బయలు దేరడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. దీంతో సొంతవాహనాల్లో సొంత ఊర్లకు బయలు దేరిన వారికి ట్రాఫిక్ ఇబ్బందులు చుక్కలు చూపిస్తున్నాయి.
పెద్ద మొత్తంలో వాహనాలు ఏకకాలంలో నగరాల నుంచి బయటకు బయలు దేరడంతో పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జాం అయింది. చైనాలో సాధారణ సెలవురోజుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టోల్ టాక్స్ నుంచి మినహాయింపు కూడా ఇస్తారు. విశాలమైన రోడ్లు ఉండి, టోల్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోయినా టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయిందంటే రద్దీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవొచ్చు. అయితే నగరం వైపు మాత్రం వాహనాలు లేక రోడ్లు వెలవెల పోతున్నాయి.
రద్దీ దృష్ట్యా 11 కోట్ల రైలు ట్రిప్పులు
సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం కోసం 11 కోట్ల రైలు ట్రిప్పులు అవసరమౌతుందని చైనా రైల్వే కార్పొరేషన్ అంచనా వేస్తోంది. గత ఏడాది చైనా నేషనల్ హాలిడే సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రిప్పులతో పోల్చితే ఈ సారి అంచనా వేస్తున్న ట్రిప్పులు 11.3 శాతం అధికం.
తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్లో నాన్జింగ్ యాంగ్జి బ్రిడ్జ్ సమీపంలో రద్దీ దృశ్యాలు: