బీజింగ్: చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని థాయ్‌జోయూ జంతు ప్రదర్శన శాల ఇటీవల ఒక ప్రకటన చేసింది. ‘‘అత్యంత అరుదైన వన్యప్రాణుల జంతు ప్రదర్శన మొదలవబోతోంది. సందర్శకులకు ఇదే మా స్వాగతం’’అని తెగ ప్రచారం చేసింది. టికెట్ ధరను రూ.236గా నిర్ణయించింది. అరుదైన జంతువులను చూద్దామని జనం తండోపతండాలుగా వచ్చారు. జూలో ఉండే పులి, సింహం వంటి వన్యప్రాణులతో పాటు ఒక వింత జంతువు సందర్శకుల్ని తెగ ఆకర్షించింది.
ఆ ఎన్‌క్లోజర్ వద్ద ‘పాండాలు’అని బోర్డ్ తగిలించి ఉంది. చైనా జాతీయ జంతువు పాండాలాగా ఉండటంతో చాలా మంది దాని ఎన్‌క్లోజర్ చుట్టూతా చేరారు. కొద్దిసేపటికి అవి మొరగడంలో జనం అవాక్కయ్యారు. జూ నిర్వాహకులను నిలదీశారు. దీంతో వాళ్లు అసలు విషయం బయటపెట్టారు. పాండా లేకపోవడంతో ఉత్తర చైనా ప్రాంతానికి చెందిన, చూడ్డానికి చిన్నపాటి సింహంలాగా ఉండే ‘చౌ చౌ’జాతి కుక్కలను ఆ ఎన్‌క్లోజర్‌లో పెట్టారు.
వాటికి అచ్చం పాండాలాగా తెలుపు, నలుపు ఛారల రంగు వేశారు. దీంతో జనం తమ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గొడవకు దిగారు. అయినా సరే జూ నిర్వాహకులు తమ తప్పును సమరి్థంచుకోవడం విశేషం. ‘‘జనం జట్టుకు రంగు వేసుకోవట్లేదా. అలాగే వీటికీ డై వేశాం. తప్పేముంది?’అని ఎదురు ప్రశ్నించారు. చైనాలో గతంలో, ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగాయి. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జూలో రెండు కుక్కలకు రంగేసి ప్రదర్శనకు పెట్టగా సంబంధిత వీడియోలను ఆన్‌లైన్‌లో 14 లక్షల మంది షేర్‌చేశారు.
గతంలోనూ ఒక జూలో ఎలుగుబంటి లేకపోవడంతో మనిíÙకి ఎలుగుబంటి వేషం వేయించి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. దౌత్య సంబంధాల్లో భాగంగా చైనా తమ దేశంలోని చాలా పాండాలను మిత్ర దేశాలకు ఇచ్చేసింది. అడువుల నరికివేత, కాలుష్యం కారణంగా పాండాల సంఖ్య తగ్గిపోయింది. అది కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది. గత ఏడాది నవంబర్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,800 పెద్ద పాండాలు అడవుల్లో, 600 పాండాలు జూలలో ఉన్నాయి. వాయవ్య చైనా పర్వతప్రాంతాల్లో అధికంగా పాండాలు కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment