
ఫొటోలో కనిపిస్తున్న సింహాన్ని చూడండి. అరె.. సింహానికేంటీ ఈ బేబీ కటింగ్? ఎవరు చేశారబ్బా అనుకుంటున్నారు కదా? జూకు వచ్చిన ఓ వ్యక్తి కూడా ఈ వెరైటీ సింహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నవ్వలేక చచ్చిపోతున్నాను.. ఈయనగారికి కటింగ్ ఎవరు చేశారో’ అని క్యాప్షన్ పెట్టాడు.
ఇంకేముంది ఫొటోలు విపరీతంగా వైరలయ్యాయి. దీంతో జూ అధికారులు స్పందించారు. సింహానికి తామేం కటింగ్ చేయలేదని, వాతావరణంలో తేమ ఎక్కువుండటం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని చెప్పారు. ఇంతకీ ఈ సింహం ఎక్కడుందో తెలుసా.. చైనాలోని గ్వాంగ్జౌ జూలో.
Comments
Please login to add a commentAdd a comment