pandas
-
పాండాలకు బదులు..
బీజింగ్: చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని థాయ్జోయూ జంతు ప్రదర్శన శాల ఇటీవల ఒక ప్రకటన చేసింది. ‘‘అత్యంత అరుదైన వన్యప్రాణుల జంతు ప్రదర్శన మొదలవబోతోంది. సందర్శకులకు ఇదే మా స్వాగతం’’అని తెగ ప్రచారం చేసింది. టికెట్ ధరను రూ.236గా నిర్ణయించింది. అరుదైన జంతువులను చూద్దామని జనం తండోపతండాలుగా వచ్చారు. జూలో ఉండే పులి, సింహం వంటి వన్యప్రాణులతో పాటు ఒక వింత జంతువు సందర్శకుల్ని తెగ ఆకర్షించింది. ఆ ఎన్‌క్లోజర్ వద్ద ‘పాండాలు’అని బోర్డ్ తగిలించి ఉంది. చైనా జాతీయ జంతువు పాండాలాగా ఉండటంతో చాలా మంది దాని ఎన్‌క్లోజర్ చుట్టూతా చేరారు. కొద్దిసేపటికి అవి మొరగడంలో జనం అవాక్కయ్యారు. జూ నిర్వాహకులను నిలదీశారు. దీంతో వాళ్లు అసలు విషయం బయటపెట్టారు. పాండా లేకపోవడంతో ఉత్తర చైనా ప్రాంతానికి చెందిన, చూడ్డానికి చిన్నపాటి సింహంలాగా ఉండే ‘చౌ చౌ’జాతి కుక్కలను ఆ ఎన్‌క్లోజర్‌లో పెట్టారు. వాటికి అచ్చం పాండాలాగా తెలుపు, నలుపు ఛారల రంగు వేశారు. దీంతో జనం తమ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గొడవకు దిగారు. అయినా సరే జూ నిర్వాహకులు తమ తప్పును సమరి్థంచుకోవడం విశేషం. ‘‘జనం జట్టుకు రంగు వేసుకోవట్లేదా. అలాగే వీటికీ డై వేశాం. తప్పేముంది?’అని ఎదురు ప్రశ్నించారు. చైనాలో గతంలో, ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగాయి. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని జూలో రెండు కుక్కలకు రంగేసి ప్రదర్శనకు పెట్టగా సంబంధిత వీడియోలను ఆన్లైన్లో 14 లక్షల మంది షేర్చేశారు. గతంలోనూ ఒక జూలో ఎలుగుబంటి లేకపోవడంతో మనిíÙకి ఎలుగుబంటి వేషం వేయించి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. దౌత్య సంబంధాల్లో భాగంగా చైనా తమ దేశంలోని చాలా పాండాలను మిత్ర దేశాలకు ఇచ్చేసింది. అడువుల నరికివేత, కాలుష్యం కారణంగా పాండాల సంఖ్య తగ్గిపోయింది. అది కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది. గత ఏడాది నవంబర్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,800 పెద్ద పాండాలు అడవుల్లో, 600 పాండాలు జూలలో ఉన్నాయి. వాయవ్య చైనా పర్వతప్రాంతాల్లో అధికంగా పాండాలు కనిపిస్తాయి. -
కూల్‌గా.. మంచు కొండల్లో పాండాల ఆటలు!
వాషింగ్టన్: మంచులో సరదాగా గడపడం ఎవరికి ఇష్టం ఉండదు. ఆహ్లాదాన్ని కలిగించే మంచుతో ఆటలాడటం ఓ మధురానుభూతి. జంతువులు సైతం తెల్లని మంచును చూసి మైమరచిపోతాయి. అందులోపడి దొర్లుతూ పరవశిస్తాయి. తాజాగా రెండు పెద్ద పాండాలు మంచులో వేసిన గంతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాండా మంచు కొండపై నుంచి ఆనందంగా కిందకు దొర్లుకుంటూ వస్తుంది. అలాగే మరోసారి పైకి ఎక్కి మళ్లీ కిందకు జారుకుంటూ ఆడుకుంటుంది. మరో పాండా కూడా అదే విధంగా మంచులో కిందకు జారుతూ అల్లరి చేస్తుంది. పాండాలకు సంబంధించిన ఈ వీడియోను వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ నేషనల్ జూ తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేసింది. అదే విధంగా ‘స్వచ్ఛమైన జియాంగ్, టిమాన్ టియన్ పాండాల ఆనందం’ అని కాప్షన్ కూడా జత చేసింది. ఈ వీడియోను 70 లక్షల మంది వీక్షించగా, 1.16 లక్షల మంది లైక్ చేశారు. ‘ఈ రోజు చూసిన ఓ గొప్ప వీడియో ఇది, వాటిని చూస్తే చాలా ఆనందంగా ఉంది’.. ‘మంచులో ఆటలు మనుషులు, జంతువులకు ఒక్కటే’ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క! చదవండి: మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి -
వాటిని చైనాకు పంపించేయనున్న కెనడా
ఒట్టావా: చైనాకు చెందిన రెండు పెద్ద పాండాలను ఆ దేశానికే తిరిగి పంపించేయనున్నట్లు కెనడా కల్గరి జంతు ప్రదర్శనశాల ప్రకటించింది. వాటికి ఆహారం సేకరించడం కష్టతరమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా కాల్గరీ జూ మార్చి 16న తాత్కాలికంగా మూసివేశారు. అందులో ఇతర జంతువులతోపాటు ఎర్ షన్, డామావో అనే రెండు పాండాలున్నాయి. ఇవి వెదురు చెట్లను ఆహారంగా తీసుకుంటాయి. సాధారణంగా చైనా నుంచి వెదురును తెప్పించి వాటికి ఆహారాన్ని అందించేవారు. కానీ కరోనా వల్ల పరిస్థితులు తారుమారయ్యాయి. (అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం) విమానాల రద్దుతో వెదురు రవాణా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో జూ అధికారులు వెదురు కోసం ఇతర మార్గాలను అన్వేషించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అవి ఆకలితో అలమటిస్తూ చనిపోవడం ఇష్టం లేక వాటిని చైనాకు తరలించేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ రెండు పాండాలు పది సంవత్సరాల షరతు మీద 2013లో చైనా నుంచి కెనడాకు తెప్పించారు. ముందుగా టొరంటో జంతు ప్రదర్శనశాలకు తరలించారు. అక్కడ ఐదు సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత 2018లో వాటిని కాల్గరీ జూకు తరలించారు. అప్పుడు వాటికి పన్పన్, జియా యోయు అనే రెండు పిల్ల పాండాలు జన్మించాయి. వీటిని జనవరిలోనే చైనాకు తరలించారు. (మే 16 నుంచి 22 వరకు) -
పాండాల ఎన్‌క్లోజర్‌లో చిక్కుకున్న చిన్నారి...!
బీజింగ్ : పాండాల ఎన్‌క్లోజర్‌లో చిక్కుకున్న ఓ చిన్నారిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాలు... చెంగ్డూ రీసెర్చ్ బేస్ వద్ద పాండాలను వీక్షించేందుకు ఎనిమిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె పాండాల ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. ఆ సమయంలో లోపల మూడు పాండాలు ఉన్నాయి. చిన్నారిని చూసిన పాండాలు మెల్లగా తన దగ్గరికి రావడంతో ఆమె బెంబేలెత్తి పోయింది. సమాచారం అందుకున్న రక్షణా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడారు. కాగా ఈ ఘటనను సిచువాన్ రీసెర్చ్ ఫెసిలిటీ తీవ్రంగా పరిగణించింది. ‘పాండాలు పైకి కనిపించేంత సాత్వికమైన జంతువులేమీ కావు. ఇక ఇంకో విషయం వాటి కాపలాదారులు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారిని చాకచక్యంగా పైకి తీసుకువచ్చిన గార్డు లియూ గిహువాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
చైనీయులను ఇబ్బందిపెడుతున్న పాండాలు
అమెరికాలో పుట్టిపెరిగిన రెండు చైనా పాండాలు అక్కడి భాష, ఆహారపు అలవాట్లతో చైనీయులను ఇబ్బందిపెడుతున్నాయి. ఈ మేరకు చైనా మీడియా ఓ రిపోర్టును ప్రచురించింది. చైనాకు చెందిన మియ్ లున్, మియ్ హువాన్ పాండాలు అమెరికాలోని అట్లాంటా జూలో పుట్టి పెరిగాయి. వీటి తల్లిదండ్రులను అమెరికాకు అప్పగిస్తూ పిల్లలు జన్మించిన తర్వాత నాలుగేళ్ల లోపు వాటిని తిరిగి చైనాకు అప్పగించాలని అమెరికా-చైనాల మధ్య గతంలో ఓ ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం దాదాపు మూడేళ్ల తర్వాత ఈ నెల 5న వాటిని అమెరికా జూ అధికారులు చైనాకు అప్పగించారు. పుట్టుకతో అమెరికా భాష, తిండికి అలవాటు పడిన లున్, హువాన్ లు చైనా భాష అర్ధం కావడం లేదని ఓ వార్త పత్రిక కథనాన్ని ప్రచురించింది. అమెరికన్ క్రాకర్స్ ను మాత్రమే తినడానికి రెండూ పాండాలు ఆసక్తిని చూపుతున్నాయని చెంగ్డూ జెయింట్ పాండా రీసెర్చ్ బేస్ అధికారి ఒకరు తెలిపారు. వెదురు బొంగుల నుంచి ఆపిల్స్ వరకూ అన్నింటిలోనూ అమెరికన్ క్రాకర్స్ ఉండేలా చూడకపోతే రెండూ ఆహారం తీసుకోవడం లేదని, తాగే నీరులో కూడా క్రాకర్స్ లేకపోతే నీటిని కూడా తాగడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం క్రాకర్స్ స్ధానంలో చైనీస్ బ్రెడ్ ను, చైనీస్ భాషను పాండాలకు అలవాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. హువాన్ బ్రెడ్ తినడానికి అలవాటుపడుతుండగా, లున్ మాత్రం అసలు బ్రెడ్ ను ముట్టుకోవడం లేదని తెలిపారు. -
సహచర్యం కోసం వేల మైళ్ల ప్రయాణం..!
వాషింగ్టన్: ఇతర జంతువులకు విరుద్ధంగా పాండాలు వ్యవహరించడాన్ని తాజా అధ్యయనాల్లో కనుగొన్నారు. సాధారణంగా జంతువుల్లో పురుషజాతి జంతువులు సహచర్యం కోసం స్త్రీ జాతి జంతువుల వెంట పడటం చూస్తామని, అయితే పాండాల విషయంలో అది విరుధ్దంగా ఉందని పరిశోధకులు అంటున్నారు. యవ్వన దశలోకి సమీపిస్తున్న సమయంలో ఆడ పాండాలు మగ పాండాల కోసం వేల మైళ్ల దూరాన్ని సైతం లెక్కచేయకుండా ప్రయాణిస్తాయని కొత్త అధ్యయనాల్లో కనుగొన్నారు. అమెరికాలోని మిచిగన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన అధ్యయనకారులు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా ఐదు పాండాల కదలికలను ట్రాక్ చేశారు. ఆడ పాండాలు ఆయా కాలాల్లో మగ పాండాలతో సంభోగం కోసం నిరీక్షిస్తూ ఉండటాన్ని ఇంతకు ముందే కొన్ని అధ్యయనాలద్వారా తెలుసుకున్నా... మైళ్ళ దూరాన్ని సైతం లెక్కచేయకుండా ప్రయాణిస్తుండటాన్ని తాజా పరిశోధనల ద్వారా కనుగొన్నారు. ముఖ్యంగా యవ్వనంలోకి అడుగిడే సమయంలో ఆడ పాండాలు... సంభోగం కోసం మైళ్ళదూరం ప్రయాణించి, తిరిగి పిల్లలకు జన్మనిచ్చే సమయానికి సొంత స్థానానికి చేరుకుంటాయని, పుట్టిన పిల్లలను అక్కడే పెంచుతాయని కూడ అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా క్షీరదాల్లో ఆడ జంతువులు సంభోగంకోసం మగవాటి కోసం వెతకడం చాలా అరుదని, అందులోనూ ఎలుగుబంటి జాతికి చెందిన ఏ జంతువులోనూ ఇటువంటి లక్షణాలు ఇప్పటివరకూ కనిపించలేదని, ఇది ఎంతో ఆసక్తికరమైన ప్రవర్తన అని మిచిగన్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన థామస్ కొన్నోర్ చెప్తున్నారు. చైనాలోని క్వియోంగ్లై, క్విన్ లింగ్ అనే రెండు పర్వత శ్రేణుల్లో నివసించే పాండాల్లో ఇటువంటి లక్షణాలను అధ్యయనకారులు కనుగొన్నారు. ఈ పాండాలను జైంట్ పాండాలని పిలుస్తారని, ఈ జాతిలో ఇంకా ఎన్నో విచిత్రమైన, అరుదైన లక్షణాలు కనిపించే అవకాశం ఉందని కొన్నోర్ తెలిపారు. ఈ తాజా పరిశోధనలను ఇంటిగ్రేటెడ్ జూవాలజీ జర్నల్ లో ప్రచురించారు.