Video Of Pandas Enjoying With Sliding And Rolling In Snow Goes Viral - Sakshi
Sakshi News home page

కూల్‌గా.. మంచు కొండల్లో పాండాల ఆటలు!

Published Tue, Feb 16 2021 12:56 PM | Last Updated on Tue, Feb 16 2021 2:36 PM

Viral Video Of Pandas Enjoying With Sliding And Rolling In Snow - Sakshi

వాషింగ్టన్‌: ​మంచులో సరదాగా గడపడం ఎవరికి ఇష్టం ఉండదు. ఆహ్లాదాన్ని కలిగించే మంచుతో ఆటలాడటం ఓ మధురానుభూతి. జంతువులు సైతం తెల్లని మంచును చూసి మైమరచిపోతాయి. అందులోపడి దొర్లుతూ పరవశిస్తాయి. తాజాగా రెండు పెద్ద పాండాలు మంచులో వేసిన గంతులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాండా మంచు కొండపై నుంచి ఆనందంగా కిందకు దొర్లుకుంటూ వస్తుంది. అలాగే మరోసారి పైకి ఎక్కి మళ్లీ కిందకు జారుకుంటూ ఆడుకుంటుంది. మరో పాండా కూడా అదే విధంగా మంచులో కిందకు జారుతూ అల్లరి చేస్తుంది.  

పాండాలకు సంబంధించిన ఈ వీడియోను వాషింగ్టన్‌ డీసీలోని స్మిత్సోనియన్ నేషనల్ జూ తన ట్వీటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. అదే విధంగా ‘స్వచ్ఛమైన జియాంగ్‌, టిమాన్‌ టియన్‌ పాండాల ఆనందం’ అని కాప్షన్ కూడా‌ జత చేసింది. ఈ వీడియోను 70 లక్షల‌ మంది వీక్షించగా, 1.16 లక్షల మంది  లైక్‌ చేశారు. ‘ఈ రోజు చూసిన ఓ గొప్ప వీడియో ఇది, వాటిని చూస్తే చాలా ఆనందంగా ఉంది’.. ‘మంచులో ఆటలు మనుషులు, జంతువులకు ఒక్కటే’ అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
 

చదవండి: రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క!
చదవండి: మాధురీ దీక్షిత్‌ను ఫిదా చేసిన యువతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement