పాండాల ఎన్‌క్లోజర్‌లో చిక్కుకున్న చిన్నారి...! | Girl Falls Into Panda Enclosure In China | Sakshi
Sakshi News home page

పాండాల ఎన్‌క్లోజర్‌లో చిక్కుకున్న చిన్నారి...!

Published Mon, Feb 11 2019 8:55 PM | Last Updated on Mon, Feb 11 2019 9:18 PM

Girl Falls Into Panda Enclosure In China - Sakshi

బీజింగ్‌ : పాండాల ఎన్‌క్లోజర్‌లో చిక్కుకున్న ఓ చిన్నారిని భద్రతా సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటన చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాలు... చెంగ్డూ రీసెర్చ్‌ బేస్‌ వద్ద పాండాలను వీక్షించేందుకు ఎనిమిదేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె పాండాల ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. ఆ సమయంలో లోపల మూడు పాండాలు ఉన్నాయి. చిన్నారిని చూసిన పాండాలు మెల్లగా తన దగ్గరికి రావడంతో ఆమె బెంబేలెత్తి పోయింది. సమాచారం అందుకున్న రక్షణా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడారు.

కాగా ఈ ఘటనను సిచువాన్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీ తీవ్రంగా పరిగణించింది. ‘పాండాలు పైకి కనిపించేంత సాత్వికమైన జంతువులేమీ కావు. ఇక ఇంకో విషయం వాటి కాపలాదారులు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చిన్నారిని చాకచక్యంగా పైకి తీసుకువచ్చిన గార్డు లియూ గిహువాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement