చైనాలో షాకింగ్‌ వీడియో | On Camera, Man Drives Car Over Security Guard | Sakshi
Sakshi News home page

చైనాలో షాకింగ్‌ వీడియో

Published Tue, May 30 2017 5:21 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

చైనాలో షాకింగ్‌ వీడియో

చైనాలో షాకింగ్‌ వీడియో

బీజింగ్‌: చైనాలో షాకింగ్‌ సంఘటన జరిగింది. తనకు మంచి పార్కింగ్‌ చోటుపోతుందని ఓ వ్యక్తి ఏకంగా సెక్యూరిటీ గార్డుపై నుంచి కారును పోనిచ్చాడు. అతడు వద్దని చెబుతున్న వినకుండా ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా మీద నుంచి వెళ్లి కారును పార్క్‌ చేసుకున్నాడు. అదృష్టం కొద్ది అతడికి ఎలాంటి నష్టం చోటు చేసుకోలేదు. స్వల్పగాయంతో బయటపడ్డాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు పలువురిని కలవర పెడుతోంది.

అందులో రికార్డయిన ప్రకారం చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోగల షెంజెన్‌లో ఓ పెద్ద షాపింగ్‌ మాల్‌ వద్ద గ్రౌండ్‌ ఫ్లోర్‌కు ఓ కారు వచ్చింది. అయితే, కారు పార్కింగ్‌కు అనుమతి వచ్చే వరకు ఎదురుచూడాలని సూచించి వైర్‌లెస్‌ సెట్‌లో అతడు మాట్లాడుతుండగానే ఆ కారులోని వ్యక్తి కారును ముందుకు పోనివ్వడం స్టార్ట్‌ చేశాడు. దీంతో ఆ కారును అడ్డుకునే ప్రయత్నంలో సెక్యూరిటీ కిందపడుకున్నాడు. అయినప్పటికీ ఆ డ్రైవర్‌ మాత్రం ఏకంగా ఆ సెక్యూరిటీ గార్డు మీద నుంచే కారును పోనిచ్చాడు. అదృష్టం కొద్ది అతడు అడ్డంగా కాకుండా నిలువుగా పడుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement