చోరీకి గురైన కారు (ఫైల్ ఫొటో)
షాపింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి కారు చోరీకి గురైంది. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ బాధితుడు పోలీసులకు ఫోన్ చేసి తన కారు వివరాలు చెప్పి, చోరీ అయిందని ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగన పోలీసులు ఆరా తీయగా చోరీ చేసింది ఎవరో తెలిసి అవాక్కయ్యారు. గాలి వల్లే కారు చోరీకి గురైందని తేలడంతో ఓనర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. చైనాలోని క్విగ్‌డావోలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్వింగ్‌డావో పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తన కారులో షాపింగ్‌కు వెళ్లాడు. కొంతసేపటికి వచ్చి చూస్తే కారు మాయమైంది. కారు పార్కింగ్ చేసిన ప్రాంతం లో లేదని, చోరీ చేశారని పోలీసులకు ఫోన్ చేశాడు. షాపింగ్‌కు వెళ్లి అరగంటకు బయటకు రాగా తన కారు చోరీకి గురైనట్లు గుర్తించానని తెలిపాడు. అయితే సీసీటీవీ ఫుటేజీ చూసిన పోలీసులు గాలి వల్ల కారు ముందుకు కదిలిందని కొంతదూరం అలాగే వెళ్లిన తర్వాత ఆగిపోయిందని తేల్చేశారు. పార్కింగ్ చేసిన సమయంలో హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోయాడు. భారీ గాలులకు కారు కొద్దిదూరం వెళ్లి ఆగిపోయినట్లు బాధితుడికి వివరించారు. హమ్మయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్న ఓనర్ కారులో ఇంటికి వెళ్లిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment