Enclosure
-
125 మొసళ్లను షాకిచ్చి చంపేశాడు..!
బ్యాంకాక్: థాయ్‌ల్యాండ్‌కు చెందిన మొసళ్ల పెంపకందారు ప్రజల హితం కోరి ఎవరూ ఊహించని సాహసం చేశారు. ఇటీవల సంభవించిన వరదలతో మొసళ్లను పెంచుతున్న ఎన్‌క్లోజర్ గోడ దెబ్బతిని, బలహీనపడింది. ఆ గోడ ఏ క్షణాన్నైనా కూలొచ్చని, అదే జరిగితే అందులోని ప్రమాదకర మొసళ్లన్నీ జనవాసాల్లోకి ప్రవేశిస్తాయని ఆయన ఊహించారు. జరగబోయే ప్రమాదంపై అధికారులకు సమాచారమిచ్చారు. వారు చెప్పిన సూచనల ప్రకారం 125కు పైగా మొసళ్లను కరెంటుషాకిచ్చి చంపేశారు. జనం కోసం తన సొంతలాభాన్ని త్యాగం చేసిన నత్థపక్ ఖుంకడ్(37)ను అందరూ ‘కోకడైల్ ఎక్స్’గా పిలుచుకుంటారు. లుంఫున్ ప్రాంతంలో 17 ఏళ్లుగా సియామీస్ అనే అరుదైన రకం మొసళ్లను ఈయన పెంచుతున్నారు. వీటిని చర్మాన్ని పరిశ్రమలకు, మాంసాన్ని థాయ్‌ల్యాండ్‌తోపాటు ఇతరదేశాలకు పంపిస్తుంటారు. ఏమైందంటే.. సెప్టెంబర్ 21వ తేదీన థాయ్‌ల్యాండ్ ఉత్తర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. నత్థపక్ ఫాంను కూడా వరద తాకింది. ఆ తీవ్రతకు మొసళ్ల ఎన్‌క్లోజర్ గోడ దెబ్బతింది. అది పూర్తిగా కూలితే మొసళ్లు సమీపంలోని ఆవాసాల్లోకి, పొలాల్లో ప్రవేశించి, జనాన్ని చంపేస్తాయని నత్థపక్ ఆందోళన చెందారు. మొసళ్లను వేరే చోటుకు తరలించాలని ప్రయత్నించినా వీలు పడలేదు. కుటుంబసభ్యులతో ఆలోచించిన మీదట..ప్రజలకు హాని కలిగించకుండా తామే వాటిని చంపేయడమే మేలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయమై స్థానిక అధికారుల సలహా మేరకు మర్నాడు మొత్తం 125 మొసళ్లను విద్యుత్ షాకిచ్చి చంపేశారు. ఇందులో అతిపెద్దదైన నాలుగు మీటర్ల పొడవుండే బ్రీడర్ మొసలి ‘అయి హర్న్’కూడా ఉంది. నత్థపక్ నిర్ణయం ధైర్యంతో కూడిన బాధ్యతాయుతమైన నిర్ణయమని అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు. నత్థపక్ వద్ద ఇంకా అడుగు నుంచి నాలుగుడుగుల వరకు పొడవైన 500 దాకా పిల్ల మొసళ్లున్నాయి. పిల్ల మొసళ్లతో కలిసి ఎన్‌క్లోజర్‌లో గడపటం వంటి మొసళ్లతో చేసే విన్యాసాలతో ఈయన వీడియోలు ఇంటర్నెట్లో బాగా పాపులర్ అయ్యాయి కూడా. థాయ్‌ల్యాండ్‌లో మొసళ్ల పెంపకం ఆకర్షణీయమైన పరిశ్రమగా భారీ ఎత్తున సాగుతోంది. దేశంలో 1,100 మొసళ్ల పెంపకందారులున్నారు. -
పాండాలకు బదులు..
బీజింగ్: చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని థాయ్జోయూ జంతు ప్రదర్శన శాల ఇటీవల ఒక ప్రకటన చేసింది. ‘‘అత్యంత అరుదైన వన్యప్రాణుల జంతు ప్రదర్శన మొదలవబోతోంది. సందర్శకులకు ఇదే మా స్వాగతం’’అని తెగ ప్రచారం చేసింది. టికెట్ ధరను రూ.236గా నిర్ణయించింది. అరుదైన జంతువులను చూద్దామని జనం తండోపతండాలుగా వచ్చారు. జూలో ఉండే పులి, సింహం వంటి వన్యప్రాణులతో పాటు ఒక వింత జంతువు సందర్శకుల్ని తెగ ఆకర్షించింది. ఆ ఎన్‌క్లోజర్ వద్ద ‘పాండాలు’అని బోర్డ్ తగిలించి ఉంది. చైనా జాతీయ జంతువు పాండాలాగా ఉండటంతో చాలా మంది దాని ఎన్‌క్లోజర్ చుట్టూతా చేరారు. కొద్దిసేపటికి అవి మొరగడంలో జనం అవాక్కయ్యారు. జూ నిర్వాహకులను నిలదీశారు. దీంతో వాళ్లు అసలు విషయం బయటపెట్టారు. పాండా లేకపోవడంతో ఉత్తర చైనా ప్రాంతానికి చెందిన, చూడ్డానికి చిన్నపాటి సింహంలాగా ఉండే ‘చౌ చౌ’జాతి కుక్కలను ఆ ఎన్‌క్లోజర్‌లో పెట్టారు. వాటికి అచ్చం పాండాలాగా తెలుపు, నలుపు ఛారల రంగు వేశారు. దీంతో జనం తమ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని గొడవకు దిగారు. అయినా సరే జూ నిర్వాహకులు తమ తప్పును సమరి్థంచుకోవడం విశేషం. ‘‘జనం జట్టుకు రంగు వేసుకోవట్లేదా. అలాగే వీటికీ డై వేశాం. తప్పేముంది?’అని ఎదురు ప్రశ్నించారు. చైనాలో గతంలో, ఇటీవల ఇలాంటి ఘటనలు జరిగాయి. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని జూలో రెండు కుక్కలకు రంగేసి ప్రదర్శనకు పెట్టగా సంబంధిత వీడియోలను ఆన్లైన్లో 14 లక్షల మంది షేర్చేశారు. గతంలోనూ ఒక జూలో ఎలుగుబంటి లేకపోవడంతో మనిíÙకి ఎలుగుబంటి వేషం వేయించి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. దౌత్య సంబంధాల్లో భాగంగా చైనా తమ దేశంలోని చాలా పాండాలను మిత్ర దేశాలకు ఇచ్చేసింది. అడువుల నరికివేత, కాలుష్యం కారణంగా పాండాల సంఖ్య తగ్గిపోయింది. అది కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరిపోయింది. గత ఏడాది నవంబర్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కేవలం 1,800 పెద్ద పాండాలు అడవుల్లో, 600 పాండాలు జూలలో ఉన్నాయి. వాయవ్య చైనా పర్వతప్రాంతాల్లో అధికంగా పాండాలు కనిపిస్తాయి. -
ఉల్లాసంగా చీతాలు: మోదీ
న్యూఢిల్లీ: నమీబియా నుంచి తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉంచిన 8 చీతాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని, కొత్త వాతావరణానికి అలవాటు పడుతున్నాయని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా గొప్పవార్త. నిర్బంధ క్వారంటైన్ తర్వాత కునో పార్కు వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా రెండు చీతాలను మాత్రం మరింత పెద్దదైన ఎన్‌క్లోజర్‌లోకి వదులుతామని అధికారులు చెప్పారు. ఆ తర్వాత మిగతా వాటిని విడతలుగా వదులుతారు’అని మోదీ ఆదివారం ట్వీట్ చేశారు. రెండు చీతాలను శనివారం పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి వదులుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు. పెద్ద ఎన్‌క్లోజర్ విస్తీర్ణం ఐదు చదరపు కిలోమీటర్ల మేర ఉంటుందని అధికారులు చెప్పారు. 30–66 నెలల వయస్సున్న 8 చీతాలను సెప్టెంబర్ 17న కునో నేషనల్ పార్కు క్వారంటైన్ జోన్లో ప్రధాని మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
ఆ అతిథులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఏనుగులు!
భోపాల్: సుమారు 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన వన్యప్రాణులైన 8 చీతాలు భారత్‌లో అడుగుపెట్టాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఈ చిరుతలను.. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ కునో నేషనల్ పార్క్‌లో ఈనెల 17వ తేదీన విడిచిపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడటానికి మరో రెండు నుంచి నాలుగు నెలల పాట చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. ఆ తర్వాతే స్వేచ్ఛగా జాతీయ పార్క్‌లో విడిచిపెడతారు. మరోవైపు.. ఈ చీతాల భద్రతకు అన్ని ఏర్పాటు చేప్టటారు కునో పార్క్ నిర్వహణ అధికారులు. చీతాల రక్షణ కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. రెండు ఏనుగులను రంగంలోకి దింపారు. నర్మదాపురంలోని సత్పురా టైగర్ రిజర్వ్‌కు చెందిన రెండు గజరాజులను కునో పార్క్‌కు తీసుకొచ్చారు. వాటికి ఉన్న అనుభవం ఆధారంగా గజరాజులు లక్ష్మి, సిద్ధనాథ్లను గత నెలలోనే పార్క్‌కు తీసుకొచ్చారు అధికారులు. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన 5 చిరుతలను బయటకి తరిమేసే ఆపరేషన్‌లో ఈ రెండు ఏనుగులు కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు గజరాజులు నేషనల్ పార్క్ సెక్యూరిటీ బృందాలతో కలిసి రేయింబవళ్లు గస్తీ కాస్తున్నాయి. ఏనుగులతో తిరుగుతూ చీతాలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఏనుగులు ఉండటం ద్వారా ఏ వన్యప్రాణులు చీతాలు ఉన్న ఎన్‌క్లోజర్ వైపు రావని చెబుతున్నారు. ‘పులుల రెష్యూ ఆపరేషన్‌లో 30 ఏళ్ల సిద్ధనాథ్ మంచి గుర్తింపు పొందాడు. అయితే, సిద్ధనాథ్‌కు టెంపర్ సమస్య ఉంది. 2010లో ఈ ఏనుగు కోపానికి ఇద్దరు బలయ్యారు. అలాగే..2021, జనవరిలో ఓ టైగర్‌ను నియంత్రించటంలో సిద్ధనాథ్ కీలక పాత్ర పోషించింది. 25 ఏళ్ల లక్ష్మి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, తన పనిలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది’ అని తెలిపారు కునో నేషనల్ పార్క్ డీఎఫ్ఓ ప్రకాశ్ కుమార్ వర్మ. ఇదీ చదవండి: 70 ఏళ్ల తర్వాత భారత్‌లోకి 8 చీతాలు.. వాటిలో ఒకదానికి పేరు పెట్టిన ప్రధాని మోదీ -
జూ నుంచి తప్పించుకుంది; కట్‌చేస్తే షాపింగ్‌మాల్‌లో
లూసియానా: కారా అనే 12 అడుగుల కొండచిలువ రెండు రోజుల క్రితం లూసియానాలోని బ్లూ అక్వేరియం జూ నుంచి తప్పించుకుంది. ఎంతో పకడ్బందీగా ఉండే ఎన్‌క్లోజర్ నుంచి ఎలా తప్పించుకుందో అధికారులకు అర్థం కాలేదు. పాపం రెండు రోజుల నుంచి నిద్రాహారాలు మాని అధికారులు కారాను వెతికే ప్రయత్నం చేశారు. అలా చివరికి ఒక షాపింగ్‌మాల్‌లో గోడ సీలింగ్‌లో కారా దాక్కున్నట్లు వారికి తెలిసింది. ఇంకేముంది షాపింగ్‌మాల్ నిర్వాహకులు అనుమతితో వారి గోడకున్న సీలింగ్‌ను పగుగొట్టి దాని నుంచి కొండచిలువను బయటికి తీశారు. ఆ కొంచిలువ ఇక్కడే ఉంటే ప్రమాదమని.. వెంటనే బ్లూ జూ అక్వేరియంకు తరలించి పటిష్టమైన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీంతో కథ సుఖాంతమైంది. ''మాకు కారా తప్పిపోయిందని తెలిసినప్పటి నుంచి దానిని వెతికే ప్రయత్నంలో పడ్డాం. రెండురోజుల పాటు నిద్రహారాలు మాని కారా కోసం గాలించాం. చివరికి గురువారం ఒక షాపింగ్‌మాల్‌లో చిన్న సందు ద్వారా గోడ సీలింగ్‌లోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. కారాను సురక్షితంగా బయటికి తీసి ఎన్‌క్లోజర్‌లో పెట్టేశాం'' అంటూ జూ ప్రధాన అధికారి రోండా స్వాన్సన్ చెప్పుకచ్చాడు. కాగా కారాను (కొండచిలువ) సీలింగ్ నుంచి బయటికి తీసిన వీడియోనూ బ్లూ జూ అక్వేరియం తమ ఫేస్బుక్లో షేర్ చేయగా.. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను చాలా మంది వీక్షించారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి. SEE THE MOMENT: Here’s video of Cara the Python was pulled out from the wall somewhere within the Mall of Louisiana. Video is from Blue Zoo Baton Rouge. @WAFB https://t.co/ziVjx9EWIW pic.twitter.com/DFdQBJAeoD — lizkohTV (@lizkohTV) July 8, 2021 -
నెహ్రూ జూ ఎన్‌క్లోజర్‌లోకి జిరాఫీలు
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతా నుంచి ఇటీవలే తెచ్చిన రెండు జిరాఫీలు బబ్లీ, బంటీలను కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. ఇవి జూ పార్క్ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడటంతో సందర్శకులు చూసేందుకు ఎన్‌క్లోజర్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే ఉన్న ఒక జిరాఫీకి ఈ రెండు తోడవటంతో వాటి సంఖ్య మూడుకు పెరిగింది. మరోవైపు ఇప్పటికే ఉన్న పక్షుల కేంద్రానికి అదనంగా మరో భారీ పక్షుల సందర్శన కేంద్రాన్ని నిర్మించేందుకు అటవీ శాఖ శంకుస్థాపన చేసింది. జంతువుల ఆవాసానికి మెరుగైన వసతులు కల్పించేలా జూను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని, కొత్తగా ఏర్పాటు చేయబోయే వాకింగ్ ఎవియరీ (పక్షుల కేంద్రం) కచ్చితంగా అదనపు ఆకర్షణగా మారుతుందని పీసీసీఎఫ్ పీ.కే.ఝా అన్నారు. కార్యక్రమంలో మరో పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, అటవీ శాఖ ఉన్నతాధికారులు, అదనపు పీసీసీఎఫ్‌లు మునీంద్ర, శోభ, డోబ్రియల్, సిద్ధానంద్ కుక్రేటీ, ఓఎస్డీ శంకరన్, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, సిబ్బంది పాల్గొన్నారు. -
జూలో సిద్ధమవుతున్న చింపాంజీల ఎన్‌క్లోజర్
ఆరిలోవ: జూలో చింపాంజీల కోసం ఎన్‌క్లోజర్ సిద్ధమవుతోంది. జూ అధికారులు గత నెలలో ఇజ్రాయిల్ నుంచి ఇక్కడకు మూడు చింపాంజీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిని క్వారెంటైన్ పరీక్షల కోసం ప్రస్తుతం జూలో ప్రత్యేకమైన నైట్క్రాల్లో ఉంచారు. వాటి కోసం అనుకూలమైన ఎన్క్లోజర్ను సిద్ధం చేస్తున్నారు. గతంలో చింపాంజీల కోసమని ఇక్కడ ఎన్‌క్లోజర్ నిర్మించారు. అయితే ఇంతవరకు చింపాంజీలను ఇక్కడకు తీసుకురాలేదు. దీంతో ఖాళీగా ఉన్న ఈ ఎన్‌క్లోజర్‌లో రేసు కుక్కలను విడిచిపెట్టేవారు. ఇప్పుడు చింపాంజీలను ఇక్కడకు తీసుకురావడంతో వాటికి ఎన్‌క్లోజర్ అవసరమైంది. దీంతో అదే ఎన్‌క్లోజర్‌కు రూపులు దిద్ది వాటికి అనుకూలంగా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ ఎన్‌క్లోజర్‌లో ఇంతవరకు ఉన్న గడ్డిని తొలగించారు. దీని అంతటిలోనూ అర అడుగు లోతులో మట్టిని తొలగించారు. కొమ్మల ఆధారంగా చింపాంజీలు బయటకు రాకుండా జాగ్రత చర్యల్లో భాగంగా ఎన్‌క్లోజర్ లోపల, బయట నుంచి గోడలకు అందుబాటులో ఉన్న చెట్ల కొమ్మలను, కొన్ని చెట్లను తొలగించేశారు. ఎన్‌క్లోజర్ చుట్టూ ఇంతవరకు ఉన్న 10 అడుగుల ఎత్త గోడను 20 అడుగులకు పెంచారు. ఎన్‌క్లోజర్ లోపల నుంచి ఇప్పటికే 15 అడుగులు గోడ నిర్మించారు. ఆ గోడపై మరో 5 అడుగుల ఎత్తులో సోలార్ సిస్టంతో తీగలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గోడలపై దానికోసం ఊచలు అమర్చారు. ఈ ఊచలకు విద్యుత్ తీగలు అమర్చనున్నారు. చింపాంజీలు గోడ దూకడానికి ప్రయత్నించే సమయంలో ఈ తీగలను తాకినప్పుడు మెరుపులాంటి కాంతి వస్తుంది. దానికి భయపడి అవి ఆ ప్రయత్నాన్ని విరమించుకొంటాయని జూ క్యూరేటర్ బి.విజయకుమార్ తెలిపారు. ఆ తీగల వల్ల ప్రాణాపాయం ఉండదని తెలిపారు. వాటిని తాకితే షాక్ తగులుతుందనే భయం మాత్రం పుడుతుందన్నారు. సుమారు రెండు వారాల్లో వాటిని సందర్శకుల కోసం ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టనున్నామన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చేతులు మీదుగా వాటిని ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టడానికి ఇక్కడ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
పులులు ఏం చేస్తాయో చూద్దామని...
అలవికాని చోట అధికులమనరాదు అన్న సామెత.. ఆవ్యక్తికి తెలుసో లేదో కాని... ఏకంగా పులులతోనే పెట్టుకునేందుకు చూశాడు. తన జిమ్నాస్టిక్ విన్యాసాలను అక్కడ ప్రదర్శించేందుకు ప్రయత్నించాడు. జూ సందర్శించేందుకు వెళ్ళిన పర్యాటకుల్లోని ఓ కుర్రాడు... అప్పటిదాకా కేబుల్ కార్ లో కూచుని శ్రద్ధగానే తిలకించాడు. తీరా పులులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్ పైకి వచ్చేప్పటికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చినట్టుంది. తన ప్రతిభను ప్రదర్శిద్దామని ప్రయత్నించాడు. ఉన్నట్టుండి పులులు ఉండే ఎన్ క్లోజర్ నెట్ పైకి దూకేశాడు. ఇంతకూ బతికాడా లేదా అన్నదేగా మీ సందేహం...? చైనా జంతు ప్రదర్శన శాలలో పులలకు ప్రత్యేక ఎన్ క్లోజర్ ఉంది. సాధారణంగా ఏ జూలో అయినా అలాగే ఉంటుంది. వన్యప్రాణులను తిలకించాలనుకున్నవారిని ప్రత్యేకంగా పకడ్బందీగా ఉన్న వాహనాల్లో లోపలికి పంపుతుంటారు. అయితే చైనాలో తుంటరిగాళ్ళను నమ్మకూడదనుకున్నారో ఏమో జూ సిబ్బంది... సందర్శకులకు కనిపించే విధంగా.. ఎన్ క్లోజర్ పైభాగాన్ని కూడ వలతో పూర్తిగా కప్పేశారు. పులులను చూడాలనుకునేవారు కేబుల్ కార్ ద్వారా (రోప్ వే) వెళ్ళాల్సిందే. ఈ నేపథ్యంలో రోప్ వే ఛైర్ లో నుంచి చూస్తున్నట్టుగా చూస్తూ ఆ కుర్రాడు... ఉన్నట్లుండి వలపైకి దూకేశాడు. జరిగిన సంఘటనకు తోటి పర్యాటకులు షాకైపోయారు. వెంటనే తేరుకుని పెద్దగా కేకలు వేయడం ప్రారంభించారు. ఈ గందరగోళం గమనించిన పులులు...ఆకతాయిని నోటికి కరచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఆ కుర్రాడి అదృష్టం కలసి రావడంతో జూ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వలపై పడిన వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురు చూసిన పర్యాటకులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని పబ్లిక్ న్యూసెన్స్ గా పోలీసులు అరెస్టు చేశారు. ఇంతా చేస్తే. ఇదంతా థ్రిల్ కోసం చేశానని అతడు చెప్పడం విశేషం. పులుల ఎన్ క్లోజర్ లో వ్యక్తులు పడటం ఇది మొదటిసారి కాదు. ఇండియాలోని గ్వాలియర్ జూ లో 2014 లో ఓ విద్యార్థి 20 అడుగుల గోడ ఎక్కి మరీ పులులను చూసేందుకు ప్రయత్నించి ఎన్ క్లోజర్ లో పడ్డాడు. షర్టు విప్పేసి డ్యాన్స్ చేస్తూ పెన్ లో నానా హంగామా చేశాడు. పులుల మూడ్ ఎలా ఉందో ఏమో జూ సిబ్బంది వచ్చే వరకూ అవి పట్టించుకోపోవడంతో బతికిపోయాడు. అదే సంవత్సరంలో ఢిల్లీ జూలో రెండు తెల్ల పులులున్న ఎన్ క్లోజర్ లో పడ్డ విద్యార్థి... వాటి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. అవును... ఓ సినిమాలో హీరోగారన్నట్లు.. సింహం పడుకుంటే జూలుతో జడేయాలనుకోవడం, పులితో ఫొటో తీయించుకోవాలనుకోవడం మంచిది కాదు మరి... -
బెడిసికొట్టిన‘ పులి క్రాసింగ్’
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో కదంబా పులిని క్రాసింగ్ కోసం తెచ్చిన ఎన్‌క్లోజర్ ఇతర వన్యప్రాణుల కోసం నిర్మించిందని జూ పార్కు క్యూరేటర్ గోపిరవి పేర్కొన్నారు. కిందిస్థాయి అధికారులు ఐదు సంవత్సరాల వయస్సున్న పులితో సంతానోత్పత్తి కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూ ఉన్నతాధికారులు బాధ్యులైన వారికి మెమోలను జారీ చేశారు. క్రాసింగ్ కోసం వినియోగించిన ఎన్‌క్లోజర్ వద్ద ఎలాంటి చర్యలు, కనీస నిబంధనలను పాటించలేదు. పులుల కోసం నిబంధనల ప్రకారం అయితే 18 ఫీట్ల ఎత్తు ఎన్‌క్లోజర్ నిర్మించాలి. కానీ కొత్తగా నిర్మించిన ఎన్‌క్లోజర్ ఎత్తు 12 ఫీట్లని జూ అధికారులు పేర్కొంటున్నా... వాస్తవంగా 10 ఫీట్లే ఉన్నట్లు సమాచారం. జూ లోని ఎన్క్లోజర్లను కాంట్రాక్టర్ కాకుండా జూ అధికారులే నిర్మిస్తుండటం గమనార్హం. జూలో డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ అసిస్టెంట్ క్యూరేటర్ ఇప్పటికే లక్షలాది రూపాయల అభివృద్ధి పనులను నిర్వహించారు. కదంబా బయటికి దూకిన ఎన్క్లోజర్ను గత సంవత్సరం నుంచి నిర్మిస్తున్నారు. చిన్న చిన్న మృగాల కూనల కోసం నిర్మించిన ఈ ఎన్‌క్లోజర్‌లో 5 ఫీట్ల ఎత్తున్న పులితో క్రాసింగ్ చేయిస్తే ఎదురయ్యే పరిస్థితులను కూడా సంబంధిత అధికారులు పరిశీలించకుండా క్రాసింగ్‌కు మొగ్గు చూపారు. పులులతో సత్సంబంధాలు కలిగిన యానిమల్ కీపర్లను వేరే చోటుకు మార్చి అనుభవం లేని యానిమల్ కీపర్లను పులుల ఎన్క్లోజర్ల వద్ద అసిస్టెంట్ క్యూరేటర్ వేయించుకున్నట్లు సమాచారం. జూలో ఓ వర్గానికి అసిస్టెంట్ క్యూరేటర్ వత్తాసు పలుకుతూ... మరో వర్గానికి వేధింపులు గురి చేస్తున్నారని గతంలో ఎన్నో ఆరోపణలు రావడంతో పాటు కొందరు విధులను మానేశారు. తాజాగా శనివారం పులితో క్రాసింగ్ చేయించి పేరు తెచ్చుకోవాలని అసిస్టెంట్ క్యూరేటర్ చూడటం కొసమెరుపు. ఈ ఘటనతో అధికారుల పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
అమ్మో.. పెద్ద పులి
-
అమ్మో.. పెద్ద పులి
ఎన్‌క్లోజర్ నుంచి బయటకు దూకిన రాయల్ బెంగాల్ టైగర్ హైదరాబాద్: బోనులో బుద్దిగా ఉండాల్సిన ఓ పెద్ద పులికి ఏమైందో ఏమో... 10 అడుగుల ఎన్‌క్లోజర్ పైనుంచి దూకేసి ఒక్కసారిగా బయటకు వచ్చింది. జూ పార్కులో కలియతిరుగుతూ మరో ఎన్‌క్లోజర్ వైపు అడుగులు వేసింది... అప్పుడు ఆ ఎన్‌క్లోజర్‌లో ఇద్దరు సిబ్బంది కూడా ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. జూ సిబ్బంది సమ్మర్ హౌజ్‌లో ఉన్న రాయల్ బెంగాల్ టైగర్ కదంబా (5) ను సంతానోత్పత్తి కోసం కరీనా అనే ఆడ పులి ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో 10 అడుగులు ఉన్న ఆ ఎన్‌క్లోజర్ పైనుంచి కదంబా పులి ఒక్కసారిగా బయటికి దూకింది. అక్కడి నుంచి తనను రోజూ ఉంచే ఎన్‌క్లోజర్ ద్వారం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లో జూ సిబ్బంది తిలక్, మహేశ్‌లు ఉన్నారు. పులిని చూసిన వెంటనే వారు అప్రమత్తమై లోపలే ఉండి ఎన్‌క్లోజర్‌కు తాళం వేసుకున్నారు. సమాచారాన్ని వెంటనే జూ అధికారులకు తెలియజేశారు. అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా జూ లో ఉన్న సందర్శకులను బయటకు పంపించారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని పులిపై మత్తు మందును ప్రయోగించారు. మత్తులోకి జారుకున్న పులిని వెంటనే పాత ఎన్‌క్లోజర్‌లోకి తీసుకెళ్లారు. అప్పటి వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎన్‌క్లోజర్‌లోనే ఉన్న తిలక్, మహేశ్‌లను బయటికి తీసుకొచ్చారు. అయితే ఎన్‌క్లోజర్ నుంచి బయటకొచ్చిన పులి తన సమీపంలోని మౌస్ డీర్, సరిసృపాల జగత్తు, మొసళ్ల ఎన్క్లోజర్ల వద్ద ఉండే జనాల వైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. జంతువుల మార్పిడిలో భాగంగా 2010 లో కదంబా పులిని మైసూర్‌లోని మంగళూర్ జూ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. కదంబా పులితో క్రాసింగ్ చేయిస్తున్న ఎన్క్లోజర్ను ఇటీవల నిర్మించారు. ఈ ఎన్‌క్లోజర్ 10 అడుగులే ఉంది. విశాలమైన స్థలం లేకపోవడంతో క్రాసింగ్‌కు అవకాశం లేని కారణంగా చిర్రెత్తిన పులి ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చని జూ సిబ్బంది భావిస్తున్నారు. సంతానోత్పత్తి కోసమే పంపాం: సంతానోత్పత్తి కోసమే కదంబా పులిని మరో ఎన్‌క్లోజర్‌లోకి పంపామని వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ పి.కె. శర్మ తెలిపారు. ఎన్‌క్లోజర్ నుంచి పులి బయటికి రావడంపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. సంతానోత్పత్తి కోసం తీసుకొఢచ్చిన పులి బయటికి వచ్చినా.. సిబ్బంది అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్క్లోజర్ల వద్ద జూ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ సూచిం చారు. పులిని సురక్షితంగా ఎన్‌క్లోజర్‌లోకి తరలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. -
త్వరలో ఓరుగల్లు ‘జూ’కు చిరుత
సిద్ధమవుతున్న చిరుత ఎన్‌క్లోజర్ వీటితోపాటే జంగిల్ క్యాట్, కసోరియా దసరా నాటికి ప్రారంభమయ్యే అవకాశం వరంగల్ మినీ జూకు కొత్త అందాలు హన్మకొండ : పక్షుల కిలకిలలు, జింక పిల్లల గెంతులకే పరిమితమైన వరంగల్ జూలో ఇకపై పులి గాండ్రింపులు వినపించనున్నాయి. వరంగల్ జూ పార్కుకు వచ్చే సందర్శకులు మరికొద్ది రోజుల్లో చిరుత పులిని ప్రత్యక్షంగా చూడొచ్చు. వివిధ రకాల పక్షుల, జింకలతో మొదలైన వరంగల్ వన విజ్ఞాన కేంద్రం ప్రస్థానం చిరుతపులి రాకతో జూ పార్కు స్థాయి సైతం పెరగనుంది. దసరా నాటికి సిద్ధం రానున్న కొద్ది రోజుల్లో మన జూ పార్కు సరికొత్త అటవీ అందాలు సంతరించుకోనుంది. దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, మొసళ్లు, హంసల వంటి జంతుజాలం సరసన ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే చిరుతపులి జూ పార్కులో సందడి చేయనుంది. ఈ మేరకు జూ పార్కులో ఎన్‌క్లోజర్ సైతం సిద్ధం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర జూ అథారిటీలు ఎన్క్లోజర్ను పరిశీలించాక దసరా పండుగనాటికి చిరుతపులి గర్జనలు జూ పార్కులో వినిపిస్తాయి. చిరుతపులితో పాటు జంగిల్క్యాట్(అడవి పిల్లి), కోసోవరిలేదా రియో పక్షల(నిప్పుకోడిని పోలి ఉండే ఆఫ్రికా పక్షులు) కోసం జూ పార్కులో ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. విస్తరించనున్న జూ పార్కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వరంగల్ మినీ జూ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో జూపార్క్‌గా అప్‌గ్రేడ్ చేయాలంటూ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ స్మాల్ జూ పార్కు ప్రస్తుతం 48 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతమిక్కడ దుప్పులు, సాంబర్ జింకలకు ప్రత్యేకంగా పార్కులు ఉండగా కొండ గొర్రెలు, ఎలుగుబంటి, నెమళ్లు, రామచిలకలు, పావురాలు, నిప్పుకోళ్లకు ఎన్క్లోజర్లు ఉన్నాయి. త్వరలో చిరుతపులితో పాటు జంగిల్క్యాట్, కచావర్ రానున్నాయి. పెద్దపులి, తెల్లపులి, తోడేలు, ఏనుగు, పగ్డీర్, బార్కింగ్ డీర్, హైనా, అడవిపంది తదితర జంతువులకు సంబంధించిన ఎన్క్లోజర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అవసరమైతే ప్రస్తుతం జూ పార్కుకు అనుకుని చుట్టు పక్కల అందుబాటులో ఉండే స్థలాన్ని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. దసరా నాటికి సిద్ధం -గంగారెడ్డి(డీఎఫ్ఓ, వైల్డ్‌లైఫ్ వరంగల్) చిరుతపులి, కోసవరి, జంగిల్క్యాట్ల కోసం కొత్తగా ఎన్క్లోజర్ల నిర్మాణం పూర్తి కావొస్తుంది. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత జూ అథారిటీ అధికారులు ఎన్క్లోజర్లను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల నుంచి ఈ మూడు జంతువులను ఒక్కో జత వంతున వరంగల్ జూకు తీసుకొస్తాం. -
తాబేలుపై నిలబడి ఫొటో, 'బుక్' అయ్యాడు
*నెహ్రూ జూపార్కులో ఘటన *అదుపులో అనుమానితుడు బహదూర్‌పురా: నెహ్రూ జూ పార్కులోని వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి.. అక్కడి పక్షలతో ఫొటోలు దిగడంతో పాటు తాబేలుపై నిలబడి ఫొటో దిగిన దృశ్యాలు ఫేస్బుక్లో హల్చల్ చేయడంతో పాటు ఇంగ్లిషు పత్రికలో రావడం నగరంలో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా జూ క్యూరేటర్ జి. రామకృష్ణరావు బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ.... ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టామని, ఈ ఫొటోల్లోని వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన ఫజల్ షేక్‌గా అనుమానిస్తూ బహదూర్‌పురా పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఫొటోలు గతేడాది జూన్,జులైల్లో దిగి ఉండవచ్చన్నారు. ఉదయం 9 - 10.30 గంటల మధ్యలో వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోని వ్యర్థ ఆహార పదార్థాలు, యానిమల్ కీపర్లు తొలగిస్తారని, ఆ సమయంలో ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి ఫోటో దిగి ఉండవచ్చన్నారు. జూలోని ఓపెన్ ఎన్‌క్లోజర్ మైదానంలో పక్షులతో పాటు చీతాలు ఉంటాయని, ఇక్కడ కూడా ఫజల్ షేక్ ఫొటో దిగాడన్నారు. ఈ ఘటన నేపథ్యంలో జూ పార్కులోని అన్ని ఎన్క్లోజర్ల వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశామన్నారు. వన్యప్రాణుల పట్ల సామరస్యంగా మెలగాలని లేకపోతే అటవీ యాక్ట్ కింద శిక్షకు గురవుతారనే విషయాన్ని మైక్ ద్వారా ప్రచారం చేస్తామన్నారు. కాగా, నెహ్రూ జూ పార్కులోని వన్యప్రాణుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించి ఫొటోలు దిగిన ఘటనలో అనుమానితుడు ఫజల్ షేక్ ను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ హరీష్ కౌషిక్ తెలిపారు. -
ఇక్కడా అంతే!
నగరంలోని జూలోనూ భద్రత అంతంతే తక్కువ ఎత్తులోనే పులుల ఎన్క్లోజర్లు పైకి ఎక్కుతున్న సందర్శకులు పట్టించుకోని జూ సిబ్బంది ఢిల్లీ సంఘటనతోనైనా మేలుకోని వైనం బహదూర్‌పురా: సందర్శకులు చేష్టలుడిగి చూస్తుండగా... వారి కళ్ల ముందే ఓ వ్యక్తిని పులి పొట్టన పెట్టుకున్న విషాద సంఘటనకు మంగళవారం ఢిల్లీలోని జూ వేదికైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో జంతు ప్రదర్శన శాలల్లో భద్రతపై సందేహాలు ముసురుకుంటున్నాయి. నిత్యం వందలాది మంది సందర్శకులు వచ్చే నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులోని పులులు, సింహాల ఎన్క్లోజర్ల దగ్గర పరిస్థితి ఢిల్లీకి భిన్నంగా ఏమీ లేదు. వీటి చుట్టూ ప్రస్తుతం ఉన్న ఇనుప కంచెల ఎత్తు తక్కువగా ఉండటంతో సందర్శకులు అప్పుడప్పుడు వాటిపైకి ఎక్కి కౄరమృగాలను తిలకిస్తున్నారు. ఇది ప్రమాదమని తెలిసినప్పటికీ... జంతువులను దగ్గరగా చూడాలనే ఆతృతతో జాగ్రత్తలను పాటించడం లేదు. దీంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో గతంలో ఓ సందర్శకుడు పులి ఎన్‌క్లోజర్ జాలీ నుంచి ఆహారాన్ని తినిపించేందుకు ప్రయత్నించగా... అతని చేతిని అది పూర్తిగా కోరికేసింది.ఇలాంటి సంఘటనల గురించి తెలిసినప్పటికీ... సందర్శకులు మేలుకోవడం లేదు. ఎన్క్లోజర్ల వద్ద వన్యప్రాణులకు బయటి ఆహారాన్ని అందించటం...రాళ్లు విసరటం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాలు, పులుల ఎన్క్లోజర్ల పరిస్థితిని బుధవారం ‘సాక్షి’ పరిశీలించగా... అదే తరహా దృశ్యాలు కనిపించాయి. తెల్ల పులుల ఎన్‌క్లోజర్ వద్ద ఇనుప తీగెలతో చేసిన కంచె సగం వరకే ఉంది. కొందరు సందర్శకులు ఈ కంచె పైకి ఎక్కుతూ... పులులను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఢిల్లీలోని సంఘటన ఇక్కడి జూ అధికారులను కదిలించినట్టు లేదు. ఇనుప కంచెల పైకి ఎవరూ ఎక్కకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించలేదు. చిన్నారులు ఇనుప కంచెల మీదకు వెళుతున్నా... జూ యానిమల్ కీపర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాయల్ బెంగాల్ ఎల్లో టైగర్ ఎన్‌క్లోజర్ వద్ద మోకాళ్ల ఎత్తు వరకే ఇనుప కంచె ఉంది. అక్కడ చిన్నారులను తల్లిదండ్రులు ఇనుప కంచెపై నిలబెట్టి పులులను చూపిస్తున్నారు. సింహాల ఎన్‌క్లోజర్ వద్ద తక్కువ ఎత్తున్న ఇనుప రాడ్లపైకి చిన్నారులతో పాటు పెద్దలు ఎక్కుతూ మృగరాజులను తిలకిస్తూ కనిపించారు. అలా ఎక్కకూడదంటూ యానిమల్ కీపర్లు, సెక్యూరిటీ సిబ్బంది వారిని వారించారు. పులులు, సింహాల ఎన్క్లోజర్ల వద్ద కంచె ఎత్తును పెంచితేనే ఢిల్లీలాంటి సంఘటనలను నివారించవచ్చు. పులులు, సింహాలకు బయటి ఆహారాన్ని తినిపించేందుకు చేతులను ఎన్‌క్లోజర్‌కు చాపుతూ ఆహారాన్ని విసరడం వంటివి సందర్శకులు చేస్తున్నారు. దీన్ని కూడా నిరోధించాల్సిన అవసరాన్ని జూ అధికారులు, సిబ్బంది గుర్తించాలి. -
బయటపడ్డ భద్రతా లోపం
న్యూఢిల్లీ: ఢిల్లీ జంతుప్రదర్శనశాలలో మంగళవారం జరిగిన దుర్ఘటన సందర్శకులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పొరబాటున తెల్లపులి ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి పడ్డ యువకుడిని పులి బలితీసుకోవడంతో జూలో భద్రత చర్చనీ యాంశమైంది. నిజానికి ఎన్‌క్లోజర్‌లోకి యువకుడు పడిన తర్వాత దాదాపు రెండుమూడు నిమిషాలపాటు పులి అతని జోలికి వెళ్లలేదు. అయితే బయటివారి కేకలు, అరుపులు విన్నా కూడా ఘటనాస్థలానికి సెక్యూరిటీ గార్డులు చేరుకోవడంలో తీవ్రమైన జాప్యం జరిగిందని, చేరుకున్నవారి వద్ద కూడా ట్రాంక్విలైజర్ గన్స్, వాకీటాకీల వంటి పరికరాలేమీ లేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఉండి ఎందుకు? అని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు. కూరమృగాలు ఉంటున్న ఎన్‌క్లోజర్ ఎత్తు కూడా చాలా తక్కువగా ఉందని, దీంతోనే యువకుడు అందులోకి పడిపోయాడని చెబుతున్నారు. మరి క్రూరమృగాలు ఉంటున్న ఎన్క్లోజర్ల వద్ద భద్రతను అధికారులు గాలికొదిలేశారా? అని నిలదీస్తున్నారు. నిజానికి ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే జూకు వచ్చే ప్రతి సందర్శకుడు తనవద్ద ఉన్న కెమెరా, సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో కూడా సందర్శకులకు ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం జూ అధికారులపై ఉంది. అయినప్పటికీ ఎన్క్లోజర్ల ఎత్తు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సందర్శకులు ఆరోపిస్తున్నారు. ఎన్‌క్లోజర్ ఎత్తు ఎక్కువగా ఉంటే ప్రమాదం జరిగేది కాదంటున్నారు. బాలుడు అరుపులు విని తాను పులి ఉన్న ఎన్‌క్లోజర్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లానని, కానీ అప్పటికే అతను పులి నోట చిక్కి మెకలికలు తిరిగి పోతున్నాడని హిమాన్షు అనే ప్రత్యక్షసాక్షి చెప్పారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు తాము మొసళ్లను చూస్తుండగా హఠాత్తుగా అరుపులు వినిపించాయని, తాము వెళ్లి చూసేసరికి కొందరు పిల్లలు పులి ఎన్‌క్లోజర్‌లోకి కట్టెపుల్లలు, రాళ్లు విసరడం కనిపించిందని, దగ్గరకు వెళ్లి చూస్తే ఓ యువకుణ్ని పులి నోటకరిచి పట్టుకొని ఉండడం కనిపించిందని హిమాన్షు చెప్పారు. ఆ వ్యక్తి బాధతో మెలికలు తిరుగుతూ దాదాపు పావు గంటసేపు బాధపడడ్డాడని, అయినా అతణ్ని రక్షించే సాహసం ఎవరూ చేయలేదన్నాడు. పులి ఉన్న ఎన్‌క్లోజర్ రెయిలింగ్ ఎక్కువ ఎత్తులో ఉందని, అతడు పొరపాటున లోపలికి పడిఉంటాడని హిమాన్షు చెప్పాడు. ఎన్‌క్లోజర్‌లో పడిన వెంటనే పులి అతని మీదకు దాడి చేయలేదని, పులి సమీపంలో నిలబడినప్పుడు ఆ యువకుడు ముడుచుకుని కూర్చుని రెండు చేతులతో దండం పెట్టడం చూశామని, అయితే పులి దృష్టిని మళ్లించడం కోసం ఎన్‌క్లోజర్ బయటనున్న కొందరు కట్టెపుల్లలు, రాళ్లు ఎన్‌క్లోజర్‌లోకి విసిరారని , రెండు నిమిషాలపాటు చూస్తూ నిలబడిన పులి ఈ చేష్టలతో రెచ్చిపోయి పంజా విసిరి యువకునిపై దాడిచేసిందని, యువకుణ్ని నోట కరచుకుని కాసేపు నిలబడిందని, ఆ తరువాత తలపట్టుకుని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్లిందని ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించిన బిట్టూ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.సెక్యూరిటీ గార్డులు ఆలస్యంగా వచ్చారన్నాడు. అకతాయి చేష్టలే కారణం... జూకు వచ్చేవారి ఆకతాయితనం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని జూ అధికారులు చెబుతున్నారు. మంగళవారం జరిగిన ఘటన కూడా యువకుడి ఆకతాయితనం వల్లే జరిగిందని చెబుతున్నారు. పులికి బలైన యువకుడిని మక్సూద్గా గుర్తించామని చెబుతున్నారు. ఎన్‌క్లోజర్ ఎక్కి ఫొటో తీయాలనే అత్యుత్సాహమే అతని ప్రాణాలు తీసిందంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఎన్‌క్లోజర్‌లోకి పడిన తర్వాత కూడా పులి అతణ్ని ముట్టలేదని, అయితే బయటివారు పులిని తరిమేందుకు కర్రలు, రాళ్లతో కొట్టే ప్రయత్నం చేయడంతో రెచ్చిపోయిన పులి అతనిపై దాడి చేందని, ఈ సమయంలో సందర్శకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి, అధికారులకు సమాచారం అందించి ఉంటే యువకుడి ప్రాణాలను కాపాడే అవకాశముండేదని చెబుతున్నారు. సింహం కరుణించింది... ఆరేళ్లక్రితం కూడా ఢిల్లీ జూలో ఇటువంటి ఘటనే జరిగింది. తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. అయితే అతను పడిన విషయాన్ని గమనించిన సింహం అతని వద్దకు వచ్చి.. ఏమీ చేయకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు కూడా పులి వదిలి పెడుతుందని భావించినా బయటివారు దానిని రెచ్చగొట్టడంతో యువకుడు బలికాక తప్పలేదని జూ అధికారులు చెప్పారు.