టోక్యో: ఈ ఏడాదిలో అత్యంత శక్తివంతమైన గాలివాన తుపానుగా అభివర్ణిస్తున్న హిన్నమ్నోర్.. ఇప్పుడు దక్షిణాసియా దేశాలను వణికిస్తోంది. మహా ప్రళయమే ముంచుకొస్తోందా అనే రేంజ్‌లో ముందుకొస్తోంది తుపాను. జపాన్ వాతావరణ సంస్థ సూచన ప్రకారం.. తూర్పు చైనా సముద్రం నుంచి ఈ బలమైన ఉష్ణమండల తుపాను జపాన్ దీవుల దూసుకువస్తోంది. దీంతో తూర్పు చైనా, జపాన్ సహా పలు దేశాలు, దక్షిణ దీవులు భయాందోళనలకు లోనవుతున్నాయి.
సూపర్ టైపూన్ హిన్నమ్నోర్‌గా నామకరణం చేసిన ఈ శక్తివంతమైన తుపాను.. 50 అడుగుల ఎత్తులో.. గంటకు 160 మైళ్లు(257 కిలోమీటర్ల) వాయువేగంతో దూసుకొస్తోందని అమెరికా జాయింట్ టైపూన్ వార్నింగ్ సెంటర్ ప్రకటించింది. ఈ ప్రభావంతో గాలులు గంటకు 195 మైళ్ల (314 కిలోమీటర్ల) వేగంతో వీస్తాయని హెచ్చరించింది. ఈ ప్రభావం.. చైనా, జపాన్‌తో పాటు ఫిలిప్పీన్స్‌పైనా తీవ్రంగా చూపించనుంది. చిన్న చిన్న ద్వీపాలపై దీని ప్రభావం మరింతగా ఉండొచ్చని భావిస్తోంది. అయితే దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలు, భారత్ తీర ప్రాంతాలపై ప్రభావం తక్కువగా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2.5-minute rapid scan #Himawari8 Infrared images showing Super Typhoon #Hinnamnor as it reached Category 5 intensity while approaching the island of Minamidaitōjima, Japan (station identifier ROMD): https://t.co/oPnRJDgHbY pic.twitter.com/zIkcWGDrEG
— UW-Madison CIMSS (@UWCIMSS) August 30, 2022
ఈ ఏడాదిలో వేగం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దూసుకొచ్చిన 11 తుపానులలో.. హిన్నమ్నోర్ అత్యంత శక్తివంతమైన తుపానుగా పేర్కొంటున్నారు వాతావరణ నిపుణులు. మరోవైపు జపాన్ ఒకినావా నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఈ ఉదయం తుపాను కేంద్రీకృతమై ఉందని, గంటకు 22 కిలోమీటర్ల వేగంతో రియూక్యూ ద్వీపాల వైపు దూసుకొస్తోందని హాంకాంగ్ అబ్జర్వేటరీ ప్రకటించింది. ఇప్పటికే జపాన్ తీర ప్రాంతాల వెంబడి బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్రమక్రమంగా పశ్చిమం వైపు కదులుతూ ఈ తుపాను బలహీన పడొచ్చని అంచనా వేస్తున్నారు.
BREAKING: TY #Hinnamnor is now a SUPER TYPHOON in PAGASA. This was based on their 4 PM Daily Weather Update.
— Matthew Cuyugan (@MatthewCuyugan) August 30, 2022
It will retain its "super typhoon" status as it enters PAR tomorrow, becoming the first storm to do so since #OdettePH (#Rai) in 2021, and the fourth overall since 2015. pic.twitter.com/2TCLDZRlKS
ఇదిలా ఉంటే.. ఆఫ్రికా, కరేబియన్ మధ్య ఉండే అట్లాంటిక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రశాంతత వాతావరణం నెలకొంది అక్కడ. సాధారణంగా ఆగస్టు నెల తుపాను సీజన్ అయినప్పటికీ.. దాదాపు 25 తర్వాత ఈ రీజియన్‌లో ఇలా ప్రశాంత వాతావరణం కనిపిస్తుండడంపై వాతావరణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Super Typhoon #Hinnamnor has rapidly intensified in the Western Pacific Ocean with sustained winds of 150 mph and gusts up to 185 mph and could impact Miyakojima of the Miyako Islands of Okinawa. @JaneMinarWX with the latest. pic.twitter.com/V6Cp4UqDCS
— FOX Weather (@foxweather) August 31, 2022
ఇదీ చదవండి: అమెరికాకు గట్టి షాక్ ఇచ్చిన చిన్న ద్వీపం
Comments
Please login to add a commentAdd a comment