షాకింగ్ వీడియో: ప్రమాదం జరిగినా.. | Incredibly lucky infant knocked down by minivan in east China | Sakshi
Sakshi News home page

షాకింగ్ వీడియో: ప్రమాదం జరిగినా..

Published Sat, May 28 2016 12:34 PM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

షాకింగ్ వీడియో: ప్రమాదం జరిగినా..

షాకింగ్ వీడియో: ప్రమాదం జరిగినా..

చైనాలోని ఓ మార్కెట్ పరిధిలోని సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్నాయి. రెండేళ్లు కూడా నిండని పసిబాలుడు తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్కు వచ్చాడు.  బాలుని పేరెంట్స్ పక్కనే ఉన్న మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో బాలుడు ఒంటరిగా ఆడుకుంటుండగా ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. పార్కింగ్లోంచి మినీ వ్యాన్ తీస్తుండగా బాలున్ని గమనించకుండా డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ముందు రెండు టైర్ల మధ్యలో, కుడివైపు టైరుకు దాదాపు ఆనుకొని బాలుని పక్క నుంచి వ్యాను వెళ్లింది. గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. అప్పటికే వెనక టైరు వరకు వచ్చిన బాలుడు వెనక టైరు కిందకు వచ్చాడు. అదృష్టం కొద్ది అక్కడ నీరు ఉండటంతో బ్రేక్ వేయడంతో ఆగిన టైర్లు బాలున్ని ముందుకు తోశాయి. లేక పోతే టైర్లు బాలుని పైకి వచ్చేవి. ఈ సంఘటన తూర్పు చైనాలో జియాంగ్సు ప్రావిన్స్లోని క్సుజోహులో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో చోటు చేసుకుంది.  

ప్రమాదాన్ని గమనించిన బాలుని తల్లిదండ్రులు వెంటనే అక్కడకు వచ్చి బాలున్ని బయటకు తీశారు. వ్యాన్ కింద పడి వెనక టైర్లు ముందుకు లాక్కు వచ్చినా బాలుడు స్పల్పగాయాలతో ప్రాణాపాయస్థితినుంచి తప్పించుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement