పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. పెషావర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ (పెస్కో), వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ (వాప్డా) సంస్థల ఫిర్యాదు మేరకు ఈ చిన్నారిపై కేసు నమోదు చేశారు.
తరువాత ఆ చిన్నారిని అడిషనల్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు పరిచారు. ఈ ఉదంతానికి సంబంధించిన అఫిడవిట్‌ను పరిశీలించిన న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. కాగా ఆ చిన్నారి ఏమి చేసిందనే దానిపై పెస్కో, వాప్డా అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
పాక్‌కు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థలలో విద్యుత్ చౌర్యం కారణంగా జాతీయ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థల అధిక వసూళ్లపై పాక్‌లోని పంజాబ్ ఇంధన శాఖ ఏప్రిల్ 7న ఆందోళన చేపట్టింది.
లాహోర్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ఫైసలాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ, ముల్తాన్ ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, గుజ్రాన్‌వాలా ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ, ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీలు ప్రభుత్వ శాఖల నుంచి అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్నాయని విద్యుత్ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment