బీజింగ్: తూర్పు చైనా జియాంగ్జీ ప్రావెన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. గల్లంతయ్యిన వారిలో ముగ్గురు ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ ఉన్నారని తెలిపింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. అనంతరం నదిలో పడిందని పేర్కొంది.
అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తోపాటు ఓ ప్రయాణికుడిని పోలీసులు స్థానికుల సహాయంతో కాపాడి...సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. బస్సు బ్రేకులు ఫేయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు దర్యాప్తులో వెల్లడైందని మీడియా పేర్కొంది.