Jiangxi Province
-
చైనాలో అగ్ని ప్రమాదం.. 39 మంది బలి
బీజింగ్/నాన్‌చాంగ్: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో బుధవారం ఒక దుకాణసముదాయంలో జరిగిన భారీ అగి్నప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్జిన్యూ నగరంలోని ఈ భవన సమదాయంలో ఇంకా కొందరు చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారిక గ్జియాన్హువా వార్తాసంస్థ తెలిపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. -
అనుమానంతో భర్తపై దాష్టీకం
బీజింగ్: భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య దాష్టీకానికి పాల్పడింది. పరాయి మహిళలతో మాట్లాడుతున్నాడని అనుమానించి ఏకంగా భర్త మర్మాంగాన్ని కత్తిరించి పడేసింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని జియాంగ్సి ప్రొవిన్స్, ఫెంగ్చెంగ్ నగరంలోని ఓ అపార్ట్మెంట్లో లీ, అతని భార్య నివసిస్తుండేవారు. పరాయి మహిళలతో చనువుగా ఉంటున్నాడంటూ ఆ భార్య భర్తతో తరచూ పడుతుండేది. ఇదిలా ఉంటే ఈ మధ్యే లీ ఉద్యోగం మారాడు. అయితే కొత్త కంపెనీలో మహిళలతో రాసలీలలు నడుపుతూ.. తనను భర్త మోసం చేస్తున్నాడని ఆమె అనుమానించింది. ఈ క్రమంలో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. అన్నింటికి కారణం మగతనం అని భావించి.. దాన్ని తొలగించాలని నిర్ణయించుకుంది. ఓ రోజు ఉదయం అతను బ్రష్ చేసుకుంటున్న సమయంలో ప్యాంట్‌ను కిందకు లాగి, అతని మర్మాంగాన్ని కట్ చేసి పడేసింది. తీవ్ర రక్తస్రావం.. బాధతో మూలుగుతూ ఆస్పత్రికి లీ పరుగులు తీశాడు. శస్త్ర చికిత్స చేసి తిరిగి పార్ట్‌ను అతికించిన వైద్యులు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరాయి మహిళలతో మాట్లాడినా.. వారిని చూసినా తన భార్య టార్చర్ పెట్టేదని సరదు బాధితుడు చెబుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూలై 21న ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
పాండాతో యువకుడి రెజ్లింగ్
బీజింగ్: చైనాలో షాంగారోకు చెందిన చెన్ అనే వ్యక్తి పాండాను ఆటపట్టించాలనుకొని నవ్వులపాలయ్యాడు. ఈ సంఘటన జియాంగ్సీ ప్రావీన్స్‌లోని ననచాంగ్ జూ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలేం జరిగిందంటే.. ననచాంగ్ జూ లో జంతువులను చూడటానికి వచ్చిన చెన్, పాండా డెన్లోకి దూకి వెళ్లాడు. అంతేకాకుండా గాఢ మత్తులో ఉన్న ఆ పాండాను తట్టిమరీ నిద్రలేపాడు. చిర్రెత్తుకొచ్చిన ఆ పాండా ఒక్కసారిగా యువకుడిపైకి దాడికి దిగింది. ఇక తర్వాత నువ్వా నేనా అనే రీతిలో ఇద్దరు కొట్టుకుంటుంటే, రెజ్లింగ్ మ్యాచ్‌ను తలపించింది. పాండా ఆ యువకుని కాలు పట్టుకొని కిందపడేసింది. చెన్ దాని చెవులు పట్టుకొని అదుపు చేద్దామనుకున్నాడు. ఇక ఈ తతంగాన్నంత చూస్తున్న వారు దాని చెవులు పట్టుకోకు, అలా చేస్తే పాండా కొరికేస్తుంది అంటూ చెన్కు సలహా ఇచ్చారు. అయితే యువకుడు కూడా ఏదోలా ధీటుగానే పాండాతో పోరాడాడు. చివరకు అవకాశం దొరకడంతో పాండాను పక్కకు ఒక్క తోపు తోసి పరుగు లంకించాడు. పాండాలు సాధారణంగా వెదురు కర్రలు తింటూ మనుషులై దాడికి దిగవని అందరూ భ్రమపడుతుంటారని జూ ఉన్నతాధికారి లి డోంగ్టావ్ పేర్కొన్నాడు. మొత్తం ఐదు నిమిషాలు జరిగిన ఈ ఫైట్‌లో యువకుడు చెన్ పారిపోవడంతో చివరకు పాండానే నెగ్గిందంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. జంతు ప్రేమికులు మాత్రం ఆ యువకుడి తీరుపై మండిపడుతున్నారు. -
పాండాతో యువకుడి రెస్లింగ్
-
నదిలో పడిన బస్సు : నలుగురు గల్లంతు
బీజింగ్: తూర్పు చైనా జియాంగ్జీ ప్రావెన్స్లో ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు నదిలో పడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. గల్లంతయ్యిన వారిలో ముగ్గురు ప్రయాణికులతో పాటు బస్సు కండక్టర్ ఉన్నారని తెలిపింది. మినీ బస్సు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. అనంతరం నదిలో పడిందని పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు ఓ ప్రయాణికుడిని పోలీసులు స్థానికుల సహాయంతో కాపాడి...సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారని తెలిపింది. బస్సు బ్రేకులు ఫేయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు దర్యాప్తులో వెల్లడైందని మీడియా పేర్కొంది.