పాండాతో యువకుడి రెజ్లింగ్ | Man vs panda: And the winner is.. | Sakshi
Sakshi News home page

పాండాతో యువకుడి రెజ్లింగ్

Published Sun, Oct 30 2016 6:07 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

పాండాతో యువకుడి రెజ్లింగ్

పాండాతో యువకుడి రెజ్లింగ్

బీజింగ్: చైనాలో షాంగారోకు చెందిన చెన్ అనే వ్యక్తి పాండాను ఆటపట్టించాలనుకొని నవ్వులపాలయ్యాడు. ఈ సంఘటన జియాంగ్సీ ప్రావీన్స్లోని ననచాంగ్ జూ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అసలేం జరిగిందంటే.. ననచాంగ్ జూ లో జంతువులను చూడటానికి వచ్చిన చెన్, పాండా డెన్లోకి దూకి వెళ్లాడు. అంతేకాకుండా గాఢ మత్తులో ఉన్న ఆ పాండాను తట్టిమరీ నిద్రలేపాడు. చిర్రెత్తుకొచ్చిన ఆ పాండా ఒక్కసారిగా యువకుడిపైకి దాడికి దిగింది. ఇక తర్వాత నువ్వా నేనా అనే రీతిలో ఇద్దరు కొట్టుకుంటుంటే,  రెజ్లింగ్ మ్యాచ్ను తలపించింది. పాండా ఆ యువకుని కాలు పట్టుకొని కిందపడేసింది. చెన్ దాని చెవులు పట్టుకొని అదుపు చేద్దామనుకున్నాడు. ఇక ఈ తతంగాన్నంత చూస్తున్న వారు దాని చెవులు పట్టుకోకు, అలా చేస్తే పాండా కొరికేస్తుంది అంటూ చెన్కు సలహా ఇచ్చారు. అయితే యువకుడు కూడా ఏదోలా ధీటుగానే పాండాతో పోరాడాడు. చివరకు అవకాశం దొరకడంతో పాండాను పక్కకు ఒక్క తోపు తోసి పరుగు లంకించాడు.  

పాండాలు సాధారణంగా వెదురు కర్రలు తింటూ మనుషులై దాడికి దిగవని అందరూ భ్రమపడుతుంటారని జూ ఉన్నతాధికారి లి డోంగ్టావ్ పేర్కొన్నాడు. మొత్తం ఐదు నిమిషాలు జరిగిన ఈ ఫైట్లో యువకుడు చెన్ పారిపోవడంతో చివరకు పాండానే నెగ్గిందంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. జంతు ప్రేమికులు మాత్రం ఆ యువకుడి తీరుపై మండిపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement