
బీజింగ్: భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య దాష్టీకానికి పాల్పడింది. పరాయి మహిళలతో మాట్లాడుతున్నాడని అనుమానించి ఏకంగా భర్త మర్మాంగాన్ని కత్తిరించి పడేసింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని జియాంగ్సి ప్రొవిన్స్, ఫెంగ్‌చెంగ్ నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లీ, అతని భార్య నివసిస్తుండేవారు. పరాయి మహిళలతో చనువుగా ఉంటున్నాడంటూ ఆ భార్య భర్తతో తరచూ పడుతుండేది. ఇదిలా ఉంటే ఈ మధ్యే లీ ఉద్యోగం మారాడు. అయితే కొత్త కంపెనీలో మహిళలతో రాసలీలలు నడుపుతూ.. తనను భర్త మోసం చేస్తున్నాడని ఆమె అనుమానించింది.
ఈ క్రమంలో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. అన్నింటికి కారణం మగతనం అని భావించి.. దాన్ని తొలగించాలని నిర్ణయించుకుంది. ఓ రోజు ఉదయం అతను బ్రష్ చేసుకుంటున్న సమయంలో ప్యాంట్‌ను కిందకు లాగి, అతని మర్మాంగాన్ని కట్ చేసి పడేసింది. తీవ్ర రక్తస్రావం.. బాధతో మూలుగుతూ ఆస్పత్రికి లీ పరుగులు తీశాడు. శస్త్ర చికిత్స చేసి తిరిగి పార్ట్‌ను అతికించిన వైద్యులు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరాయి మహిళలతో మాట్లాడినా.. వారిని చూసినా తన భార్య టార్చర్ పెట్టేదని సరదు బాధితుడు చెబుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూలై 21న ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment