genitals chopped off
-
ప్రియుడి మర్మాంగాన్ని కత్తిరించిన మహిళ
భువనేశ్వర్ : ఒడిశాలో దారుణ చోటు చేసుకుంది. ప్రియుడి మర్మాంగాన్ని ఓ మహిళ కత్తితో కత్తిరించిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర నాయక్(25), ఓ మహిళ(24) ఇరువురు కియోంజర్ జిల్లాలో బదువాగాన్ గ్రామంలో నివసిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఇరువురు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రాజేంద్ర నాయక్ చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇలా ఇంటికి వచ్చినప్పుడల్లా మహిళను ఆమె ఇంట్లో కలుస్తుండేవాడు. కాగా గత మంగళవారం నాయక్ చెన్నై నుంచి తన సొంత గ్రామానికి వచ్చాడు. ఆ తరువాతి రోజు రాత్రి నాయక్ ఆ మహిళను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం నాయక్ అక్కడే పడుకున్నాడు. అర్థరాత్రి దాటాక నిద్రలో ఉన్న నాయక్‌పై మహిళ దాడి చేశారు. ఓ పదునైన కత్తితో నాయక్ మర్మాంగాన్ని కత్తిరించారు. అతిన అరుపులు విని చూట్టుపక్కల వారు వచ్చి ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మహిళను అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. -
అనుమానంతో భర్తపై దాష్టీకం
బీజింగ్: భర్తపై అనుమానం పెంచుకున్న ఓ భార్య దాష్టీకానికి పాల్పడింది. పరాయి మహిళలతో మాట్లాడుతున్నాడని అనుమానించి ఏకంగా భర్త మర్మాంగాన్ని కత్తిరించి పడేసింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని జియాంగ్సి ప్రొవిన్స్, ఫెంగ్చెంగ్ నగరంలోని ఓ అపార్ట్మెంట్లో లీ, అతని భార్య నివసిస్తుండేవారు. పరాయి మహిళలతో చనువుగా ఉంటున్నాడంటూ ఆ భార్య భర్తతో తరచూ పడుతుండేది. ఇదిలా ఉంటే ఈ మధ్యే లీ ఉద్యోగం మారాడు. అయితే కొత్త కంపెనీలో మహిళలతో రాసలీలలు నడుపుతూ.. తనను భర్త మోసం చేస్తున్నాడని ఆమె అనుమానించింది. ఈ క్రమంలో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. అన్నింటికి కారణం మగతనం అని భావించి.. దాన్ని తొలగించాలని నిర్ణయించుకుంది. ఓ రోజు ఉదయం అతను బ్రష్ చేసుకుంటున్న సమయంలో ప్యాంట్‌ను కిందకు లాగి, అతని మర్మాంగాన్ని కట్ చేసి పడేసింది. తీవ్ర రక్తస్రావం.. బాధతో మూలుగుతూ ఆస్పత్రికి లీ పరుగులు తీశాడు. శస్త్ర చికిత్స చేసి తిరిగి పార్ట్‌ను అతికించిన వైద్యులు.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరాయి మహిళలతో మాట్లాడినా.. వారిని చూసినా తన భార్య టార్చర్ పెట్టేదని సరదు బాధితుడు చెబుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూలై 21న ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
పనికిరాదని నేనే కోసేసుకున్నా: స్వామి
కేరళ ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తన జననాంగాన్ని న్యాయవిద్యార్థిని కోయలేదని, అది తనకు ఎటూ పనికిరాదన్న ఉద్దేశంతో తానే కోసేసుకున్నానని 54 ఏళ్ల గణేశానంద తీర్థపద స్వామి తాజాగా చెప్పారు. ఈ కేసులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆస్పత్రిలో ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో మరో విషయం కూడా పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. ఈ స్వామి గత ఏడేళ్లుగా ఆ యువతిపై పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, అందుకే విసుగు చెందిన ఆమె ఈ దాడి చేసిందని అంటున్నారు. ఎవరీ స్వామి.. ఎక్కడివాడు? 15 ఏళ్ల క్రితం ఆధ్యాత్మిక గురువుగా మారడానికి ముందు కేరళలోని ఎర్నాకులం జిల్లా కొల్లెంచెరి ప్రాంతంలో ఒక టీ స్టాల్ నడుపుకొనేవాడు. ఇప్పుడు ఆ దుకాణాన్ని ఆయన సోదరుడు నడుపుతున్నాడు. ఆరేళ్ల క్రితం ఆయన చివరిసారిగా తన స్వగ్రామానికి వెళ్లాడు. హిందూ ఐక్యవేది అనే సంస్థతో గణేశానందకు సంబంధాలుండేవి. కేరళలో సంఘ సంస్కర్త అయిన చట్టాంబి స్వామి జన్మస్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేయడంతో పాటు వరుసపెట్టి ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా గణేశానంద ప్రాచుర్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత కేరళ అదనపు డీజీపీ డాక్టర్ బి. సంధ్యపై హిందూ సంస్థలు చేసిన ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. ఆ ఉద్యమ సమయంలోనే ప్రస్తుతం ఆయన జననాంగం కోసేసినట్లు చెబుతున్న యువతి కుటుంబంతో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. యువతి తల్లి ఆయనను పూజల కోసం ఇంటికి పిలిచేవారని పోలీసులు చెప్పారు. అనారోగ్యంతో ఉన్న ఆమె భర్తకు బాగుచేస్తానని చెప్పి ఆశ్రమానికి తీసుకెళ్లి, ఆమె కుమార్తెను లైంగికంగా దోచుకున్నాడని ఆ పోలీసు అధికారి చెప్పారు. -
కోసిపారేసిన యువతికి సీఎం అభినందన
అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి పురుషాంగాన్ని కోసిపారేసిన యువతి సాహసాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు. ఆమె చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని, అందులో అనుమానం ఏమీ లేదని చెప్పారు. తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఒక దొంగస్వామి మర్మాంగాన్ని కేరళకు చెందిన న్యాయ విద్యార్థిని కోసి పారేసిన విషయం తెలిసిందే. కొల్లాంలోని పన్మన ఆశ్రమంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గణేశానంద తీర్థపద స్వామి (54) అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఎంత వారించినా వినకపోవడంతో ఆమెకు కోపం వచ్చి తన వద్ద ఉన్న చాకుతో అతడి పురుషాంగాన్ని కోసేసింది. తిరువనంతపురం పోలీసులకు ఫోన్ చేసి ఆ విషయాన్ని చెప్పగా, వాళ్లు కూడా ఆమెపై కేసు ఏమీ నమోదు చేయకుండా అతడిపైనే పోస్కో కేసు పెట్టారు. కేరళ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఆ యువతిని అభినందించారు. మతం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. రేప్ చేయబోతే.. కోసి పారేసింది! -
సంబంధం కోరాడని.. కోసిపారేసింది!
అంతకుముందున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని కోరినందుకు ఓ వ్యక్తి జననాంగాలను కోసిపారేసిందో మహిళ. ఇందుకు ఆమెకు ఇరుగుపొరుగు వాళ్లు కూడా సాయం చేశారు. ఈ ఘటన బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది. బాధితుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అశోక్ రాం అనే ఆ వ్యక్తి పార్వతీ దేవి ఇంట్లోకి బలవంతంగా వెళ్లి, తనతో అంతకుముందున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి చేశాడని పోలీసు అధికారి నౌషాద్ ఆలం తెలిపారు. దాంతో కోపం వచ్చిన ఆమె, ఇరుగుపొరుగుల సాయంతో అశోక్ (26) జననాంగాలను కోసిపారేసింది. అతడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. అతడి కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలోనే ఉండటంతో ఇంతవరకు ఎవరూ ఈ ఘటనపై ఫిర్యాదు చేయలేదు. ముగ్గురు పిల్లల తల్లి అయిన పార్వతీదేవికి గతంలో అశోక్‌తో వివాహేతర సంబంధం ఉండేది. అయితే ఈ విషయం అందరికీ తెలియడంతో గ్రామస్థులు నిలదీయగా అశోక్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల క్రితమే తిరిగి వచ్చిన అతడు.. పాత సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించింది. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది.