అంతకుముందున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని కోరినందుకు ఓ వ్యక్తి జననాంగాలను కోసిపారేసిందో మహిళ. ఇందుకు ఆమెకు ఇరుగుపొరుగు వాళ్లు కూడా సాయం చేశారు.
అంతకుముందున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని కోరినందుకు ఓ వ్యక్తి జననాంగాలను కోసిపారేసిందో మహిళ. ఇందుకు ఆమెకు ఇరుగుపొరుగు వాళ్లు కూడా సాయం చేశారు. ఈ ఘటన బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో జరిగింది. బాధితుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అశోక్ రాం అనే ఆ వ్యక్తి పార్వతీ దేవి ఇంట్లోకి బలవంతంగా వెళ్లి, తనతో అంతకుముందున్న వివాహేతర సంబంధాన్ని కొనసాగించాల్సిందిగా ఒత్తిడి చేశాడని పోలీసు అధికారి నౌషాద్ ఆలం తెలిపారు. దాంతో కోపం వచ్చిన ఆమె, ఇరుగుపొరుగుల సాయంతో అశోక్ (26) జననాంగాలను కోసిపారేసింది. అతడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు.
అతడి కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలోనే ఉండటంతో ఇంతవరకు ఎవరూ ఈ ఘటనపై ఫిర్యాదు చేయలేదు. ముగ్గురు పిల్లల తల్లి అయిన పార్వతీదేవికి గతంలో అశోక్తో వివాహేతర సంబంధం ఉండేది. అయితే ఈ విషయం అందరికీ తెలియడంతో గ్రామస్థులు నిలదీయగా అశోక్ ఊరు వదిలి వెళ్లిపోయాడు. కొన్ని రోజుల క్రితమే తిరిగి వచ్చిన అతడు.. పాత సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించింది. ఆ తర్వాత ఈ ఘటన జరిగింది.