సాక్షి, పాట్నా: వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఇలాంటి సంబంధాల కారణంగా మహిళలపై దాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. తాజాగా వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళా డాక్టర్ రోడ్డు మీదకు వచ్చి నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. దర్భంగా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ రేణు ప్రభకు, కతిహర్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డాక్టర్ సంతోష్‌తో అయిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే సంతోష్ కొంత కాలంగా రేణు ప్రభను పట్టించుకోకపోవడంతో ఆమె అతడిపై నిఘా వేసింది. ఈ క్రమంలో తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న తెలుసుకొని షాక్‌కు గురైంది. దీంతో అతడిని నిలదీసింది. కానీ, అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా వారిద్దరిని సంతోష్ పట్టించుకోవడమే మానేశాడు.
దీంతో, రేణు..తనకు న్యాయం చేయాలని కోల్‌కత్తాకు చెందిన ఎన్జీవో మహిళా వికాస్ మంచ్‌ను ఆశ్రయించింది. దీంతో సదరు ఎన్జీవో కార్యకర్తలు సంతోష్‌ను కలిసి మాట్లాడే ప్రయత్నం చేయగా అతను నిరాకరించాడు. మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని తనపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడని బీహార్‌లోని కతిహార్ వీధుల్లో నిరసనకు దిగింది. అంతేగాక భర్త విషయంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆమె పేర్కొంది. ఈ క్రమంలో కతిహర్ మెడికల్ కాలేజీలో ఈ దంపతుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment