రిలయన్స్ షేర్‌ రూ.2వేలు దాటుతుందా? | Reliance Industries Hits 8-Year Highs On Jio's Move To End Free Benefits | Sakshi
Sakshi News home page

రిలయన్స్ షేర్‌ రూ.2వేలుదాటుతుందా?

Published Wed, Feb 22 2017 5:20 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

రిలయన్స్ షేర్‌ రూ.2వేలు దాటుతుందా?

రిలయన్స్ షేర్‌ రూ.2వేలు దాటుతుందా?

ముంబై: జియో బొనాంజా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ సుదీర్ఘకాలం తరువాత మెరుపులు మెరిపించి చరిత్ర సృష్టించింది. తద్వారా మార్కెట్‌ వర్గాలను, విశ్లేషకులు విస్మయపర్చింది.  సెన్సెక్స్‌  0.36 లాభాలతో సరిపెట్టుకుంటే..  రిలయన్స్‌ఇడస్ట్రీస్‌ ఏకంగా 11.17 శాతం లాభపడింది. మంగళవారం నాటి అంబానీ ప్రెస్‌మీట్‌ తరువాత బుధవారం మార్కెట్‌ లో  ఆర్‌ఐఎల్‌ టాప్‌ విన్నర్‌ గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఎనలిస్టులు ఈ షేర్‌  పెర్‌ఫామెన్స్‌ గా  సానుకూలంగా మారిపోయారు.  అంతేకాదు ఆర్‌ఐఎల్‌ మార్కెట్ విలువ కూడా భారీగా పుంచుకుంది.  రూ. 25,000 కోట్లకుపైగా ఎగసి రూ. 3.91 లక్షల కోట్లను తాకింది. 2009 మే 18 తరువాత ఇండెక్స్‌ హెవీవెయిట్‌ ఆర్‌ఐఎల్‌ 11 శాతం పైగా జంప్‌చేసి 1,211 వద్ద ఎనిమిదేళ్ల గరిష్టాన్ని నమోదు  చేయడం విశేషం.   

ఆర్‌ఐఎల్‌  షేరు1133 స్థాయియిని బ్రేక్‌ చేసి దూసుకుపోవడంపై విశ్లేషకులు పాజిటివ్గా  స్పందించారు. గత 5,6 ఏళ్లుగా బలహీనంగా రిలయన్స్‌ కీలక మద్దతుస్తాయి 1200కి స్థాయికిపైన నిలబడటం, ఎంకేజింగ్‌ గా ఉండటం  సంతోషం దాయకమంటున్నారు. కోటక్‌  మ్యూచువల్‌ ఫండ్ ఫండ్‌ మేనేజర్‌ హరీష్‌ కృష్ణన్‌ జియో కార్యకలాపాల ద్వారా వచ్చిన పెట్టుబడులు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా లాభపడిందని చెప్పారు. రాబోయే 18-24 నెలలో ఇది  రూ.2 వేల స్థాయిని టచ్‌ చేస్తుందని ఇండస్ ఈక్విటీస్ డైరెక్టర్  సుశీల్ చాక్సీ తెలిపారు.

ఉచిత సేవలనుంచి టారిఫ్ ప్లాన్‌ లోకి జియో మారడంపై ఎనలిస్టులు పాజిటివ్‌ గా స్పందించారు. అంబానీ మార్పు స్వాగతించిన విశ్లేషకులు  ఇది టెలికం  రంగానికి మరింత హేతుబద్ధ పోటీని తీసుకొస్తుందన్నారు.  ఇకముందు మరింత వేగంగా  దూసుకుపోనుందని పాజిటివ్ గ్లోబల్‌ బ్రోకరేజ్ క్రెడిట్ స్యూజ్ ఒక నోట్‌ లోతెలిపింది. రిలయన్స్ జియో  టెలికాం కార్యకాలాపాలు  తన తొలి సంవత్సరం చివరినాటికి   అంచనాలకు మించి రికార్డ్‌ లాభాలను నమోదు  చేసే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.

ఈ కౌంటర్లో గత ఏడేళ్లలోలేని విధంగా భారీ ట్రేడింగ్‌ పరిమాణం నమోదైంది. దీంతో మార్కెట్‌ విలువలో తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది  ఆర్‌ఐఎల్‌.   రూ. 25,000 కోట్లకుపైగా ఎగసి రూ. 3.91 లక్షల కోట్లను తాకింది. టీసీఎస్‌  తరువాత  రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా  ఇటీవల రెండవ స్థానానికి ఎగబాకిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును వెనక్కి నెట్టేసింది. 

కాగా   ఒకపుడు రిలయన్స్ షేర్‌ ధర  స్పందన ఆధారంగా స్టాక్‌మార్కెట్ కదలికలను  అంచనా వేసేవారంటే అతిశయోక్తి కాదు.  మరి తాజా మార్పులతో మరోసారి ఆక్రెడిట్‌ నిలబెట్టుకుంటుందా? వేచిచూడాలి.




 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement