move
-
రూ. 1.5 కోట్ల డ్రీమ్ హౌస్... కూల్చడం ఇష్టం లేక ఇంటినే తరలిస్తున్న రైతు
రొడ్డు విస్తరణలో భాగంగా లేదా హైవే నిర్మించడం కోసం ప్రభుత్వం కొన్ని ఇళ్లను తొలగిస్తుంటుంది. ఇది సర్వ సాధారణం. అందుకు ప్రభుత్వం వారికి నష్ట పరిహారం కూడా ఇస్తుంది. ఐతే అచ్చం అలాంటి పరిస్థితే ఒక రైతుకు ఎదురైంది. కానీ ఆ రైతు అందుకు ససేమిరా అంటే ఏకంగా ఇంటినే తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన రైతు సుఖ్విందర్ సింగ్ తన డ్రీమ్ హౌస్‌ని కూల్చడం ఇష్టం లేక మొత్తం ఇంటినే తరిలించిందేకు సిద్ధమయ్యాడు. సంగ్రూర్ జిల్లాలోని రోషన్వాలా గ్రామంలో తన స్థలంలో నిర్మించుకున్న ఇల్లు ఉన్న ప్రదేశం ఎక్స్‌ప్రెస్ వే రోడ్డుని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్‌మాల ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఈ రహదారిని ఢిల్లీ, అమృత్సర్ కత్రా ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎక్ప్రెస్ వే హర్యానా, పంజాబ్, జమ్ముకాశ్మీర్ మీదుగా వెళ్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిఖ్విందర్ సింగ్ అనే రైతుకి తన ఇంటిని కూల్చివేసేందుకు నష్టపరిహారం కూడా చెల్లించింది. ఐతే సుఖ్‌విందర్‌కి తన ఇంటిని కూల్చడం ఇష్టం లేక మొత్తం ఇంటినే మరోక ప్రదేశానికి మార్చాలనుకున్నాడు. అంతేకాదు అతను భవన నిర్మాణ కార్మికుల సహకారంతో సుమారు 250 అడుగుల మేర ఉన్న ఇంటిని 500 అడుగులు దూరం కదిలించేందుకు పనులు కొనసాగిస్తున్నాడు. భవనాన్ని కదిపేందుకు చక్రాల వలే కనిపించే గేర్లను కూడా ఏర్పాటు చేశాడు. ఆ రైతు ఈ ఇంటిని నిర్మించడానికి దాదాపు రూ. 1.5 కోట్లు ఖర్చు అయ్యిందని, అదే సమయంలో ఇంటిని నిర్మించడానికి రెండేళ్లు పట్టిందని చెప్పుకొచ్చాడు. ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్‌ప్రెస్‌వే ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారి ప్రాజెక్టు అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ గత నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఈ రహదారి వల్ల కాశ్మీర్‌కు ప్రయాణించే ప్రయాణికులకు సమయం, డబ్బు, శక్తి ఆదా అవుతుందని చెప్పారు. (చదవండి: చిచ్చు రేపిన తాగుడు అలవాటు... ఖతం చేసి సెల్ఫీ వీడియో!) -
వీల్ చైర్ ట్యాక్సీ
అనారోగ్యం వల్లో లేదా రోడ్డు ప్రమాదం కారణంగానో కొంతమంది వీల్ చైర్‌కే పరిమితం అయిపోతుంటారు. అలాంటి వారిని ఆసుపత్రికో, ఏదైనా శుభకార్యానికో లేదా మరో చోటుకో తీసుకెళ్లాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. మరోవైపు మిగతా వాళ్లలాగా తాము అన్నిచోట్లకీ వెళ్లలేకపోతున్నామని, నాలుగు గోడల మధ్య బందీలుగా మారిపోయామని, ఎక్కడికెళ్లాలన్నా మరొకరిపై ఆధారపడాల్సి వస్తుందని మానసికంగానూ వీరు కుంగిపోతుంటారు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం చూపుతోంది ‘ఈజీ మూవ్’. వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను అవసరమైన చోటుకి సులభంగా తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ ట్యాక్సీలను ఈ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ముంబైలో ఇప్పటికే ఈ ట్యాక్సీలు సేవలందిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏడువేల మంది ఈ సేవలు ఉపయోగించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలా మొదలైంది ఢిల్లీలో 2015లో దివ్యాంగుల 15వ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. అయితే అక్కడ వారికి అవసరమైన వీల్‌చైర్ లిఫ్ట్‌లు, ర్యాంపులు అందుబాటులో లేవు. నిర్వాహకులు మెట్లపై ప్లేవుడ్ను మాత్రమే పరిచారు. ఇది ఈ సంస్థ కో ఫౌండర్ రోమియో రవ్వను కదిలించింది. వీల్‌చైర్‌కే పరిమితమైన తన స్నేహితుడి చెల్లెలు ఇతరులకు ఇబ్బంది లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా వీల్‌చైర్‌పై కాలేజీకి వెళ్లి రావడం చూశారు. చాలా మందికి ఇలాంటి అవకాశం ఉండదు. మిగతావాళ్లకు కూడా ఇలాంటి సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుందనే మరో ఇద్దరి ఆలోచనలు తోడయ్యాయి. ..దీంతో ‘ఈజీ మూవ్’ కు అంకురార్పణ జరిగింది. కదలలేని స్థితిలో ఉన్న వాళ్లు గౌరవంగా, హుందాగా అనుకున్న చోటుకి వెళ్లేలా సేవలందించడమే తమ లక్ష్యమని నిర్వహకులు పేర్కొంటున్నారు. ఎలాంటి సేవలందిస్తారు వీల్‌చైర్‌కే పరిమితమైన రోగులను తరలించేందుకు కార్లలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా వీల్‌చైర్‌తో సహా కారులోకి వెళ్లిపోవచ్చు. భద్రతాపరంగాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కారులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. డ్రైవర్‌కు ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం ద్వారా రోగిని కారులోకి భద్రంగా చేర్చడంతో పాటు అవసరమైన సేవలు అందిస్తారు. ఆసుపత్రి, ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లడం.. తీసుకురావడం, దేవాలయాలు, పెళ్లిళ్లు ఇతర ఫంక్షన్లకు తీసుకెళతారు. అంతేకాదు సర దాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లాలన్నా ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ముంబాయిలో అందుబాటులో ఉన్న వీల్ చైర్ టాక్సీ సర్వీసును త్వరలో గోవాలోనూ ప్రారంభించనున్నారు. 2019 నాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాలకు విస్తరింపచేయాలని సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎంత చార్జీ చేస్తారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటలకు వరకు బేసిక్ చార్జి రూ. 250 గా ఉంది. ప్రతీ నాలుగు కి.మీ కు అదనంగా రూ. 30 వసూలు చేస్తారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రూ. 350 బేసిక్ చార్జి, ప్రతీ నాలుగు కి.మి. కు అదనంగా రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, ఎనిమిది గంటల అద్దెకు కూడా లభిస్తాయి. అంతేకాదు సొంతకారు ఉన్న వారు తమ కారులో కూడా మార్పులు చేసుకోవాలంటే ఆ సదుపాయమూ ఇక్కడ అందుబాటులో ఉంది. వృద్ధులు, ప్రత్యేక అవసరాలు కల్గిన వారు సులభంగా ప్రయాణించే విధంగా కారులో మార్పులు చేస్తారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ధర్మ పోరాట దీక్షకు ఆర్టీసీ బస్సులో ప్రజలను తరలింపు!
-
తరలింపు వద్దు!
► కలెక్టరేట్‌ను ప్రస్తుతమున్న చోటే ఉంచాలని డిమాండ్ ► చర్చనీయాంశంగా మారిన సమీకృత కార్యాలయాల ఏర్పాటు ► భీమన్నగుట్ట ప్రాంతంలో నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనలు ► జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరం కావడంతో వ్యతిరేకత ► పునరాలోచించాలని సీఎంకు నివేదించిన నిర్మల్ జిల్లా సాధన సమితి నిర్మల్అర్బన్: ప్రస్తుతం నిర్మల్ నడిబొడ్డున కొనసాగుతున్న కలెక్టరేట్‌ను జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో భీమన్నగుట్ట వద్దకు తరలించి, అక్కడ నిర్మించాలనే ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లా మంత్రి, అధికారుల నోట సమీకృత కార్యాలయాల కోసం భీమన్న గుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేశామని, త్వరలోనే పనులకు టెండర్లు పూర్తి చేస్తామని చెప్పడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ ఆలోచన ఇలా... పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, పాలన సౌలభ్యం ఏర్పడుతుందని సమీకృత భవనాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒకే చోట 25 ఎకరాల స్థలం అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని నూతన జిల్లాల్లో ఈ దిశగా చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న నిర్మల్‌లో భీమన్న గుట్ట ప్రాంతంలో జిల్లా సమీకృత కార్యాలయాల నిర్మాణానికి అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. అయితే దీనిని కొందరు వ్యతిరేకిస్తుండగా, అధికారులు, మరికొందరు సమర్థిస్తున్నారు. సమీకృత కార్యాలయాలే నిర్మల్ ప్రత్యేకత ప్రభుత్వ కార్యాలయాల విషయంలో నిర్మల్‌కు ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చాలా కాలం నుంచే ఒకే ప్రాంతంలో అనేక కార్యాలయాలున్నాయి. సీఎం నోట సమీకృత మాట రావడంకంటే ముందు నుంచే ఇక్కడ సమీకృత కార్యాలయాలు కొనసాగుతున్నాయి. పట్టణం నడిబొడ్డున పాత ఆర్డీవో(ప్రస్తుతం కలెక్టరేట్), మున్సిపల్, తహసీల్దార్, న్యాయస్థానం, ఆర్అండ్బీ అథితి గృహం, ఆర్అండ్బీ కార్యాలయం, నీటిపారుదల శాఖ, అటవీ శాఖ, అగ్నిమాపక, పశుసంవర్థక శాఖ, ప్రసూతి ఆస్పత్రి, ఉపకారాగారం, వ్యవసాయ శాఖ, బాలుర బీసీ వసతి గృహం, బాలికల వసతి గృహం, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ, ఇరిగేషన్, డీఎస్పీ, రూరల్ పోలీస్‌స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత భవనం, తదితర కార్యాలయాలతో పాటు ఎన్టీఆర్ మిని స్టేడియం అన్నీ ఒకదాని పక్కనే మరోటి ఉన్నాయి. అంటే సీఎం చెప్పిన సమీకృత సముదాయానికి దగ్గరిగానే ఉన్నాయి. దీంతో ప్రజలకు కార్యాలయాలు అన్ని అందుబాటులో ఉండేవి. దూర భారం లేకుండా సుదూరం నుంచి నిర్మల్‌కు వచ్చిన ప్రజలు సులువుగా అన్ని కార్యాలకు వెళ్లి పనులు పూర్తి చేసుకునేవారు. ఈ ప్రాంతంలో సమీకృత జిల్లా కార్యాలయాల ఏర్పాటు చేస్తే ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేది. అయితే దీనిని విస్మరించి నిర్మల్ పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్లన్న గుట్టను ఎంపిక చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత కలెక్టరేట్ కార్యాలయ చుట్టుపక్కనే ఉన్న ఈ ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన భూ విస్తీర్ణం సుమారు 65 ఎకరాలకు పైనే ఉంటుంది. ఇందులో శిథిల భవనాలు, ఖాళీ స్థలాలు, జిల్లా స్థాయి కార్యాలయాలున్నాయి. వీటితో పాటు చాలా ప్రాంతం కబ్జాకు గురయింది. పాలకుల నోట.. భీమన్న గుట్ట మాట.. ఎవరి కోసం..? జిల్లా సమీకృత కార్యాలయాల ఏర్పాటుకు 25 ఎకరాలు ఉండాలని ప్రభుత్వం సూచించింది. దీనిని ఆధారం చేసుకుని అధికారులు స్థల పరిశీలన చేపట్టారు. అయితే 25 ఎకరాల స్థలం జిల్లా కేంద్రంలో ఎక్కడా లేదని అధికారులు, పాలకులు చెబుతున్నారు. నడిబొడ్డున ప్రస్తుత కలెక్టరేట్ చుట్టూ సుమారు 65 ఎకరాల స్థలం ఉందన్న భావనను వ్యక్తం చేసినప్పటికీ దానిని పట్టించుకోకుండా జిల్లా కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమన్న గుట్టను ఎంపిక చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి సౌలభ్యంగా ఉండాల్సిన కార్యాలయాలను దూరం చేయడం వెనుక ఎవరికి ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. కేవలం భీమన్న గుట్ట చుట్టూ వెలసిన రియల్ ఎస్టేట్ భూములున్న వారికి తప్ప ప్రజలకు ఒనగూరేదేమీ లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారుల పక్కనే ప్రజలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని విస్మరించడంతో కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలోని 7 లక్షల మందికి జిల్లా కార్యాలయాల పాలన దూరం చేయడం వెనుక ‘మతలబు’ ఏమిటన్నది..? ఎవరి కోసమన్నది..? ప్రస్తుతం అందరి నోటి నుంచి వెలువడుతున్న ప్రశ్న. అభివృద్ధి పేరిట చారిత్రక స్థలాల ధ్వంసం ప్రభుత్వ స్థలాలను రక్షించాల్సిన అధికారులు దానిని విస్మరించి అభివృద్ధి పనుల కోసం చారిత్రక స్థలాలను ధ్వంసం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అభివృద్ధి పనులు చేపడుతున్నామంటూ చెరువులు, కోటలు, గుట్టలు, కందకాలను చెరపుతున్నారు. ఏరియా ఆస్పత్రి నిర్మాణ సమయంలో పక్కన ఉన్న కోటలను ధ్వంసం చేశారు. అలాగే పద్మనాయక రాజుల కాలం నాటి లేడిస్ పార్కును ధ్వంసం చేసి ఇందిరమ్మ కాంప్లెక్స్ నిర్మించారు. రోడ్డు విస్తరణ పేరిట నిర్మల్‌కు ముఖ ద్వారంగా ఉన్న గొలుసుల దర్వాజాలను నామరూపాల్లేకుండా చేశారు. ఇలా అభివృద్ధి పేరిట అనేక చారిత్రక స్థలాలను ధ్వంసం చేయడం ఒక వంతు అయితే ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం మరోవంతుగా మారింది. వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే వాటిని కాపాడాల్సింది పోయి అధికారులే ధారాదత్తం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాలు లేకుండా చేయడం పథకంలో భాగమేనన్న వాదన కూడా లేకపోలేదు. అన్యాక్రాంతం అయిన స్థలాలను గుర్తిస్తే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే అవకాశం ఉండేది. కానీ ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. తప్పని ఆర్థిక భారం.. నిర్మల్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమన్న గుట్ట ప్రాంతంలో కలెక్టరేట్‌తో పాటు అన్ని జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేయనుండటంతో ప్రజలపై ఆర్థిక భారం పడనుందని మేధావులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడి నుంచి అన్ని జిల్లా కార్యాలయాలకు వెళ్లడం మరో ఎత్తు కానుంది. జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేకంగా జిల్లా కార్యాలయాలకు వెళ్లి రావాలన్నా కనీసం రూ.100 వరకు ఖర్చు భరించాల్సి ఉంటుంది. ప్రజల మనోభీష్టాలతో సంబంధం లేకుండా, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరపకుండానే సమీకృత కార్యాలయాల ఏర్పాటుకు స్థల సేకరణలో అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చొరవ తీసుకోవాలని కోరాం.. సమీకృత జిల్లా కార్యాలయాల ఏర్పాటు విషయంలో స్థానిక అధికారులు, నాయకులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నందున స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరాం. పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రస్తుత కార్యాలయాల స్థలంలో సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని నిర్మించాలని ఇటీవలే విన్నవించాం. – నంగె శ్రీనివాస్, నిర్మల్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు -
రిలయన్స్ షేర్ రూ.2వేలు దాటుతుందా?
ముంబై: జియో బొనాంజా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సుదీర్ఘకాలం తరువాత మెరుపులు మెరిపించి చరిత్ర సృష్టించింది. తద్వారా మార్కెట్ వర్గాలను, విశ్లేషకులు విస్మయపర్చింది. సెన్సెక్స్ 0.36 లాభాలతో సరిపెట్టుకుంటే.. రిలయన్స్ఇడస్ట్రీస్ ఏకంగా 11.17 శాతం లాభపడింది. మంగళవారం నాటి అంబానీ ప్రెస్‌మీట్ తరువాత బుధవారం మార్కెట్ లో ఆర్ఐఎల్ టాప్ విన్నర్ గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఎనలిస్టులు ఈ షేర్ పెర్ఫామెన్స్ గా సానుకూలంగా మారిపోయారు. అంతేకాదు ఆర్ఐఎల్ మార్కెట్ విలువ కూడా భారీగా పుంచుకుంది. రూ. 25,000 కోట్లకుపైగా ఎగసి రూ. 3.91 లక్షల కోట్లను తాకింది. 2009 మే 18 తరువాత ఇండెక్స్ హెవీవెయిట్ ఆర్ఐఎల్ 11 శాతం పైగా జంప్‌చేసి 1,211 వద్ద ఎనిమిదేళ్ల గరిష్టాన్ని నమోదు చేయడం విశేషం. ఆర్ఐఎల్ షేరు1133 స్థాయియిని బ్రేక్ చేసి దూసుకుపోవడంపై విశ్లేషకులు పాజిటివ్‌గా స్పందించారు. గత 5,6 ఏళ్లుగా బలహీనంగా రిలయన్స్ కీలక మద్దతుస్తాయి 1200కి స్థాయికిపైన నిలబడటం, ఎంకేజింగ్ గా ఉండటం సంతోషం దాయకమంటున్నారు. కోటక్ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ హరీష్ కృష్ణన్ జియో కార్యకలాపాల ద్వారా వచ్చిన పెట్టుబడులు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా లాభపడిందని చెప్పారు. రాబోయే 18-24 నెలలో ఇది రూ.2 వేల స్థాయిని టచ్ చేస్తుందని ఇండస్ ఈక్విటీస్ డైరెక్టర్ సుశీల్ చాక్సీ తెలిపారు. ఉచిత సేవలనుంచి టారిఫ్ ప్లాన్ లోకి జియో మారడంపై ఎనలిస్టులు పాజిటివ్ గా స్పందించారు. అంబానీ మార్పు స్వాగతించిన విశ్లేషకులు ఇది టెలికం రంగానికి మరింత హేతుబద్ధ పోటీని తీసుకొస్తుందన్నారు. ఇకముందు మరింత వేగంగా దూసుకుపోనుందని పాజిటివ్ గ్లోబల్ బ్రోకరేజ్ క్రెడిట్ స్యూజ్ ఒక నోట్ లోతెలిపింది. రిలయన్స్ జియో టెలికాం కార్యకాలాపాలు తన తొలి సంవత్సరం చివరినాటికి అంచనాలకు మించి రికార్డ్ లాభాలను నమోదు చేసే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఈ కౌంటర్లో గత ఏడేళ్లలోలేని విధంగా భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదైంది. దీంతో మార్కెట్ విలువలో తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది ఆర్ఐఎల్. రూ. 25,000 కోట్లకుపైగా ఎగసి రూ. 3.91 లక్షల కోట్లను తాకింది. టీసీఎస్ తరువాత రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా ఇటీవల రెండవ స్థానానికి ఎగబాకిన హెచ్డీఎఫ్సీ బ్యాంకును వెనక్కి నెట్టేసింది. కాగా ఒకపుడు రిలయన్స్ షేర్ ధర స్పందన ఆధారంగా స్టాక్‌మార్కెట్ కదలికలను అంచనా వేసేవారంటే అతిశయోక్తి కాదు. మరి తాజా మార్పులతో మరోసారి ఆక్రెడిట్ నిలబెట్టుకుంటుందా? వేచిచూడాలి. -
హైదరాబాద్ నుంచి పరిశ్రమల తరలింపు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించేందుకు రంగం సిద్ధమైంది. పరిశ్రమల తరలింపునకు అనువుగా 19 ప్రాంతాల్లో 3,104 ఎకరాల భూమిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ) గుర్తించింది. కౌడిపల్లి మండలం చండూరు, కొట్టాల, సలాబత్పూర్, కొల్చారం మండలం పోతం షెట్పల్లి, రాంపల్లి, పాపన్నపేట మండల అన్నారం, పటాన్చెరు మండలం చిట్కూల్æ, కొండపాక మండలం లక్డారం, భువనగిరి మండలం హుస్సేనబాద్, దామరచర్ల మండలం చిట్యాల, బీబీనగర్ మండలం గుర్రాలదండి, మోమిన్‌పేట మండలం ఎంకటాల, నవాబ్‌పేట మండలం అర్కటాల, ఎక్మామిడి, వికారాబాద్ మండలం గిరిగిట్‌పల్లి, గుడ్పల్లి, సిద్ధులూరు, మునుగల్, కొత్తూరు మండలం సిద్ధాపూర్, చేగూరు గ్రామాల్లో పరిశ్రమల తరలింపు కోసం టీఎస్ఐఐసీ భూములను గుర్తించింది. హైదరాబాద్‌లో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో కాలుష్య కారక ఫార్మ, తదితర పరిశ్రమల తరలింపునకు చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. -
పెద్దనోట్ల రద్దుపై రిలయన్స్ అధినేత అంబానీ..
ముంబై: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఎప్పటినుంచో ఊరిస్తున్న ఆ శుభవార్త ను అధికారికంగా వెల్లడించారు. సంచలన జియో ఆఫర్ ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ జియో ఖాతాదారులకు బంపర్ఆఫర్ ఇచ్చారు. గురువారం జరిగిన వాటాదారుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన ఆయన పెద్ద నోట్ల రద్దుపై తొలిసారి స్పందించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ పట్ల హర్షం ప్రకటించారు. ఇందుకు ప్రధానికి అభినందనలు తెలిపిన రిలయన్స్ అధినేత ప్రధాని నిర్ణయం చాలా విశాలమైందనీ కొనియాడారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనివలన సామాన్య ప్రజలు లబ్ది పొందుతారనీ,మార్పుకు సాయపడుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు నగదు రహిత లావాదేవీలకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. డిజిటల్ సేవలు ఆర్థిక వృద్ధికి మరింత ప్రోత్సాహాన్నిస్తాయన్నారు. లావాదేవీల్లో అపూర్వమైన పారదర్శక, జవాబుదారీతనం తీసుకురావడం దీనికి దోహదపడుతుందన్నారు. 'హ్యాపీ న్యూయర్ ప్లాన్' పేరుతో ఫ్రీడేటా, వాయిస్ కాల్స్, వైఫై, యాప్స్ ఫ్రీ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంల ద్వారా వేగంగా జియో మనీ సేవల్ని వేగంగా విస్తరిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు జియో కస్టమర్లకు ఇతర టెలికాం నెట్ వర్క్ లు సహకరించడం లేదని ఆరోపించారు. ఆయన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు: 2017 మార్చి 31 వరకూ డేటా, వాయిస్ కాల్స్ అన్నీ ఫ్రీ ఆధార్ ఆధారంగా 5 నిమిషాల్లో జియో సిమ్ యాక్టివేషన్ కాల్ డ్రాప్ సమస్యల 90 శాతం నుంచి 20 శాతానికి తగ్గింది. హ్యాపీ న్యూయర్ ప్లాన్‌తో ఫ్రీడేటా, వాయిస్ కాల్స్, వైఫై, యాప్స్ ఫ్రీ ప్రతి రోజూ 1 జిబి వరకూ ఉచితంగా వాడుకోవచ్చు 2016 డిసెంబర్ 4 నుంచి 2017 మార్చి 31 వరకూ ఫ్రీ కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లకి వర్తించే జియో ఆఫర్ జియో మనీతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ -
అంధులకు అండగా..
అంధులు, దృష్టి లోపం ఉన్నవారు ఇతరుల సాయం లేకుండా తమ పనులు తామే చేసుకునేందుకు సహకరించే కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. చేతికి ధరించే ఉంగరంలా ఉండే ఈ అతి చిన్న పరికరం 3.5 మీటర్ల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా ఇట్టే గుర్తించి వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. ఈ పరికరాన్ని చేతికి ధరించి ప్రయాణిస్తే నడిచే మార్గంలో వచ్చే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని సృష్టికర్తలు చెప్తున్నారు. లైవ్ బ్రెయిలీ అధినేత అభినవ్ వర్మ ఇప్పుడు అంధులకు అత్యంత ఉపయోగకరంగా ఉండే అతి చిన్న పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని చేతికి ధరిస్తే మూడు, నాలుగు మీటర్ల ముందుగానే వారికి వచ్చే అడ్డంకులను గుర్తించి వైబ్రేషన్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. సెకనులో 50వ వంతు సమయంలో అడ్డంకులను గుర్తించగలిగే ఈ పరికరంతో పాటు, దీనికి అనుసంధానంగా బ్యాటరీతో నడిచే మరో రెండు పరికరాలను కూడ అభినవ్ తయారు చేశారు. ఈ 'మినీ' పరికరం అంధుల సాధారణ అవసరాలకు ఉపయోగపడటంతోపాటు, దీనిద్వారా విద్యార్థులు తమ పుస్తకాలను ఆడియో రూపంలో రికార్డు చేసుకొని వినే సదుపాయం కూడ ఉంది. ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి అభినవ్ తోపాటు అతడి స్నేహితుల బృందం విభిన్న ఆలోచనతోనే ఈ చిన్న పరికరం రూపం దాల్చింది. అంధులు కర్రసాయం లేకుండా నడవలేరా? వారు సాధారణ ప్రజల్లా నడవాలంటే ఏం చేయాలి అన్న కోణంలో ఆలోచించిన విద్యార్థులు ఈ చిన్న గాడ్జెట్ ను కనుగొనే ప్రయత్నం చేశారు. మూడేళ్ళ క్రితం వారు విద్యార్థులుగా ఉన్నపుడు అంధులకోసం సృష్టించిన గ్లౌవ్స్ వంటి పరికరం విజయవంతం కావడంతో మరింత ఉపయోగంగా ఉండే అతి చిన్న పరికరాన్ని తయారు చేసేందుకు అభినవ్ చదువు పూర్తయిన తర్వాత సన్నాహాలు ప్రారంభించాడు. తాను స్వయంగా స్థాపించిన ఎంబ్రోస్ కంపెనీలో విభిన్నంగా వస్తువులను రూపొందించే ప్రయత్నం చేశాడు. అనేక ప్రయోగాలు, ప్రయత్నాల అనంతరం అభినవ్.. కేవలం 29 గ్రాములు బరువుండే అతి చిన్న రింగులాంటి లైవ్ బ్రెయిలీ పరికరాన్ని రూపొందించి విజయం సాధించాడు. చేతికి పెట్టుకునే ఉంగరంలా ఉండే ఈ చిన్న రింగు.. అంధులు వాడే కేన్ కు పది రెట్లు తేలిగ్గా ఉండటంతోపాటు... కేవలం 50 సెకన్ల లోపే అడ్డు వచ్చే వస్తువులను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు వస్తువు దూరం, బరువు వంటి విషయాలను బట్టి పరికరం వైబ్రేట్ అవుతుంది. తాము రూపొందించిన ఈ చిన్న పరికరం సహాయంతో దృష్టిలోపం ఉన్నవారు నడవడమే కాదు ఏకంగా పరుగులు కూడా పెట్టొచ్చని అభినవ్ బృందం చెప్తున్నారు. -
గర్ల్‌ఫ్రెండ్ కోసం యూఎస్ వెళ్తాడట!
లండన్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ కుమారుడు బ్రూక్లిన్ బెక్‌హామ్ ఇప్పుడు అమెరికాకు వెళ్తానంటూ ఒకటే మారాం చేస్తున్నాడట. ఈ మారాంకు కారణం బ్రూక్లిన్ తన గర్ల్‌ఫ్రెండ్ క్లో గ్రేస్‌కు దగ్గరగా ఉండాలనుకోవడమేనంటున్నారు ఆయన సన్నిహితులు. అయితే బ్రూక్లిన్ మాత్రం ఈ విషయంపై మాట్లాడుతూ.. యూఎస్‌లోనే ఫోటోగ్రఫీతో పాటు నటనలో ఎడ్యుకేషన్‌ను కొనసాగిస్తానని, దీని కోసం లాస్ ఎంజిల్స్‌లోని ఓ కాలేజీలో అడ్మిషన్ కూడా దొరికిందని..గర్ల్‌ఫ్రెండ్ క్లో గురించి కాకుండా కెరీర్ ప్లానింగ్ గురించి చెబుతున్నాడు. బ్రూక్లిన్ తల్లి విక్టోరియా బెక్‌హామ్ మాత్రం కొడుకు తీసుకున్న నిర్ణయంతో సంతృప్తిగా లేనట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ ఫ్యామిలీతో పాటే ఉండే కొడుకును దూరంగా పంపించడం ఆమెకు ఇష్టం లేదట. ఆ చదువేదో ఇక్కడే లండన్‌లో చదువొచ్చుగా అని విక్టోరియా కొడుకు బ్రూక్లిన్తో చెబుతోంది. అయితే యూఎస్‌లో గర్ల్‌ఫ్రెండ్ పిలుస్తోంటే తల్లి మాటలు ఎక్కడ వినబడుతాయి బ్రూక్లిన్‌కి. అందుకే 'నేను యూఎస్‌కు వెళ్లడానికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను' అని తల్లికి బ్రూక్లిన్ గట్టిగానే చెప్పాడని బ్రిటన్ మీడియా సంస్థ 'ఇన్సైడర్' వెల్లడించింది. -
ఇదేం పని!
♦ స్వరాజ్యమైదాన్ రైతుబజారు ♦ తరలింపు నిర్ణయంపై అభ్యంతరాలు ♦ కాల్వ గట్టుపై వ్యాపారాలు ఎలా అంటూ ♦ రైతులు, వ్యాపారుల ఆందోళన ♦ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ రైతుల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా.. ప్రజల సౌకర్యం పట్టించుకోకుండా సర్కారు ఏకపక్ష నిర్ణయంతో స్వరాజ్య మైదానం రైతుబజార్‌ను తరలించేందుకు నిర్ణయించింది. సీఎం తాత్కాలిక క్యాంపు కార్యాలయం కోసం.. రైతులకు అనుకూలంగా ఉండి ఏళ్లతరబడి కొనసాగుతున్న రైతుబజార్‌ను తరలించేందుకు నిర్ణయించటంపై రైతులు, ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క సాంబమూర్తి రోడ్డులోని రైవస్ కాల్వ కట్టపై స్థల పరిశీలన చేసి నమూనాల రూపకల్పనకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయవాడ : నగరం నడిబోడ్డున అందరికీ అందుబాటులో, సౌకర్యంగా ఉన్న స్వరాజ్య మైదానం రైతుబజారును సాంబమూర్తి రోడ్డులోని రైవస్ కాల్వ కట్టపైకి తరలించేందుకు సర్కారు నిర్ణయించటంపై జనంలో కలకలం మొదలైంది. ఏడాది రెండేళ్ల అవసరం కోసం ఏళ్లతరబడి లక్షలాదిమంది వినియోగదారులకు, వేలాదిమంది రైతులు, వ్యాపారులకు ఎంతో తోడ్పడుతున్న రైతుబజారును విధ్వంసం చేస్తారా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, ప్రజల సౌకర్యాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయించటంపై ధ్వజమెత్తుతున్నారు. ఓ వైపు అమరావతి రాజధాని రెండేళ్లలోపు నిర్మిస్తామని, అక్కడే తాత్కాలిక సచివాలయం వెలగపూడిలో ఏర్పాటు చేస్తున్నామని చెబుతూనే.. మరోపక్క సీఎం తాత్కాలిక క్యాంపు కార్యాలయం సెక్యూరిటీ జోన్ పేరుతో రైతుబజారును తొలగించేందుకు నిర్ణయించటంపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండి, అన్ని హంగులతో వెలుగొందుతున్న రైతుబజారును నాశనం చేయొద్దని కోరుతున్నారు. రెండేళ్ల క్రితమే ఆధునికీకరణ... స్వరాజ్యమైదానంలోని ఎకరం విస్తీర్ణంలో రైతుబజార్‌ను 1999లో ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం దాదాపు కోటి రూపాయల నిధులతో పక్కా షెడ్లు కూడా నిర్మించి ఆధునికీకరించారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాటికి ప్రారంభోత్సవం కూడా చేసి, ఇది తమ ప్రభుత్వ ఘనతేనని కూడా చెప్పుకొన్నారు. మరో కోటి రూపాయలతో ఆధునికీకరించి మోడల్ బజార్‌గా తీర్చిదిద్దుతామని వాగ్దానం కూడా చేశారు. ప్రస్తుతం ఈ రైతుబజారులో 208 మంది రైతులు, 107 మంది వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు, వారితో పాటు పనిచేసే సుమారు 1500 మంది రకరకాల కూరగాయలు, ఆకు కూరలు విక్రయిస్తున్నారు. రెండు జిల్లాల్లో వినియోగదారులు... నిత్యం ఈ రైతుబజారుకు నగరం నలుమూలల నుంచే గాక, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వేలాదిమంది కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. ఆదివారం, సెలవు రోజుల్లో రోజుకు 20 వేల మంది వరకు వస్తుంటారని అంచనా. బందరు రోడ్డుకు ఆనుకుని, అటు ఐదో నంబర్ రోడ్డుకు, ఏలూరు రోడ్డులో కలవటానికి అతి తక్కువ దూరంలో ఉన్న స్వరాజ్య మైదానం రైతు బజార్ అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉంది. ఓ వైపు ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, ఆస్పత్రులు, వివిధ రకాల పనులపై కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చి వెళ్లేవారు ఇక్కడి రైతుబజార్ చాలా అనుకూలంగా ఉంటుందని చెపుతున్నారు. కాల్వగట్టు పైకి తరలిస్తే రైతుబజార్ నిర్వీర్యం అవుతుందని రైతులు వాపోతున్నారు. తద్వారా తమ పార్టీ కార్యకర్తలు నడుపుతున్న ప్రైవేటు రైతుబజార్లు పుంజుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న రైతులు, వ్యాపారుల అభిప్రాయం తెలుసుకోకుండానే ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. దశలవారీగా అనుమతుల నిరాకరణ ♦ దశాబ్దాలుగా నగరానికి వేసవి వినోదం అందించిన ఎగ్జిబిషన్‌కు గ్రహణం పట్టింది. స్వరాజ్య మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌కు సెక్యూరిటీ జోన్ పేరుతో అనుమతినివ్వడం లేదు. దీంతో రెండు జిల్లాల ప్రజలు వేసవి వినోదానికి దూరమవుతున్నారు. ♦ అతి పెద్ద పుస్తక మహోత్సవం నిర్వహణకు కూడా స్వరాజ్య మైదానమే వేదికగా ఉంది. దీనికి ఈ ఏడాదే కనాకష్టంగా స్థలం, దుకాణాల సంఖ్య తగ్గించి అనుమతులు ఇచ్చిన సర్కారు.. వచ్చే ఏడాదికి ఎలా వ్యవహరిస్తుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. ♦ {పస్తుతం స్వరాజ్య మైదానంలో నిర్వహిస్తున్న లేపాక్షి వంటి ఓ మోస్తరు ప్రదర్శనల నిర్వహణ కూడా రానున్న రోజుల్లో కష్టంగా మారే పరిస్థితి నెలకొననుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ♦ సెలవొస్తే నగరంలోని ఆబాలగోపాలం క్రికెట్ ఆడుకోవడానికి స్వరాజ్య మైదానం వేదికగా ఉండేది. ఇప్పుడు వారినీ అనుమతించే పరిస్థితి లేదు. దీంతో వారంతా ఆటలకు ఎక్కడికెళ్లాలనేది ప్రశ్నార్థకంగా మారింది. తరలించవద్దు రైతుబజారు ఏర్పాటైన నాటి నుంచి మునక్కాయలు, మామిడి కాయలు విక్రయించుకుని జీవిస్తున్నాం. నా తండ్రి ఇక్కడే వ్యాపారం ప్రారంభించి నాకు అప్పగించాడు. రైతులకు, వినియోగదారులకు అనుకూలంగా ఉన్న రైతుబజార్‌ను కాల్వగట్టు పైకి తరలించటం తగదు. దీనివల్ల మా వ్యాపారాలు పడిపోతాయి. అనుకూలంగా లేని ప్రదేశానికి ప్రజలు రారు. అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి. - మరీదు శ్రీనివాసరావు, రైతు, పాతపాడు వ్యాపారం సాగదు స్వరాజ్యమైదానంలో సాగినంత వ్యాపారం కాల్వగట్టుపై సాగదు. నగరంలో ఇంకా నాలుగు చోట్ల రైతు బజార్లు ఉన్నా అందరికీ అనుకూలంగా ఉన్న స్వరాజ్యమైదానం బజార్‌కు అధిక డిమాండ్ ఉంది. ఇక్కడ సాగినంత వ్యాపారం మరెక్కడా ఉండదు. దీన్ని మార్చితే మా వ్యాపారాలు మూతపడినట్లే. అధికారులు పునరాలోచన చేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ రైతుబజార్‌ను తరలించకూడదు. - అమ్మిశెట్టి సుబ్బారావు, మిర్చి రైతు, కుంచనపల్లి ప్రైవేటు బజార్ల కోసమే ప్రైవేటు రైతుబజార్లు ఏర్పాటు చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారు. ప్రభుత్వ రైతుబజార్లు సాగితే ప్రైవేటు బజార్లకు జనం వెళ్లరు. నగరంలో అతి పెద్దదైన ఈ బజార్‌ను తీసివేస్తే అధికార పార్టీ నేతల అనుచరులు ప్రైవేటు బజార్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా బ్రహ్మాండంగా నడుస్తున్న రైతుబజార్‌ను నిర్వీర్యం చేస్తున్నారు. ఇది మంచి పని కాదు. విరమించుకోవాలి. - జి.షరాబ్, మామిడి రైతు, పి.నైనవరం -
కెనడా వైపు చూస్తున్న అమెరికన్లు!
వాషింగ్టన్: ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు అగ్రరాజ్యం అమెరికాకు వలస వెళ్తుంటారు. అయితే ఇప్పుడు అమెరికా ప్రజలు మాత్రం అమెరికా నుంచి పారిపోవడం ఎలా అని ఆలోచిస్తున్నారట. వినడానికి కొంత విచిత్రంగా ఉన్నా.. ఓ వార్తాపత్రిక ఈ అంశంపై మాక్ ట్యుటోరియల్ను సైతం నిర్వహించింది. గూగుల్‌లో అమెరికన్లు కెనడాకు వెళ్లడం ఎలా అనే అంశాన్ని ఎక్కువగా శోధిస్తున్నారు. మొత్తానికి అమెరికా ప్రజలు కెనడాను సురక్షిత ప్రాంతంగా భావిస్తున్నారని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున ముందువరుసలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దేశ దక్షిణ సరిహద్దులోని మెక్సికన్లపై విషం చిమ్ముతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర సరిహద్దులోని కెనడాపై లిబరల్ అమెరికన్ల దృష్టి పడిందని అంటున్నారు విశ్లేషకులు. దేశంలోకి ముస్లింలను రాకుండా అడ్డుకోవాలని, దేశ దక్షిణ ప్రాంతం మెక్సికో సరిహద్దులో గోడను నిర్మిస్తానని, ఇండియాతో సహా పలు దేశాలకు చెందినవారిని వెనక్కి పంపుతానని అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా మొదటి నుంచి శరణార్థుల విషయంలో కఠినవైఖరినే అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో కెనడా యువ ప్రదాని జస్టిన్ ట్రుడేవ్ సిరియా సహా ఇతర ప్రాంత శరణార్థులను సాదరంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ట్రుడేవ్ ఉదారవాద విధానాలు ఆకర్షించడంతో పాటు.. శరణార్ధులు ఇతర విషయాల్లో ట్రంప్ అహంకార ధోరణితో విసుగెత్తిన లిబరల్ అమెరికా ప్రజలు కెనడా వైపు చూస్తున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
పాల కోసం పసి ముహమ్మద్ పయనం
పాణసమానమైన చిన్నారి ముహమ్మద్‌ను దాదికి అప్పగించడం ఇష్టం లేకపోయినా, తరతరాల నుండి వస్తున్న సంప్రదాయాన్ని పాటించవలసిందేనని సర్దిచెప్పుకున్నారు ఆమినా. బోసినవ్వులు చిందిస్తున్న చిన్నారిని తనివితీరా చూసుకొని, గుండెలకు హత్తుకున్నారు. అనంతమైన మమతానురాగాలతో ముద్దులు కురిపించారు. తరువాత బాబును ఆయా చేతుల్లో పెడుతూ.. ‘హలీమా! ఈ పసిబిడ్డ అనాథ అని బాధపడకు. దైవసాక్షిగా చెబుతున్నా. ఈ పసిబిడ్డే ముందుముందు మహిమాన్వితుడవుతాడు. మహోజ్వల చరిత్రను సృష్టిస్తాడు’ అన్నారు దృఢనిశ్చయంతో. ‘అమ్మా! ఇక్కడికి రాకముందు సంపన్నుల బిడ్డ దొరకలేదని బాధపడ్డ మాట నిజమే. కాని నీ బిడ్డ చిరునవ్వు నా బాధను పటాపంచలు చేసింది. లోగడ నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను. ఎంతోమందికి పాలు పట్టాను. కాని నీ ముద్దుల బిడ్డ మోములో ఏదో దివ్యతేజస్సు ఉంది. ఆ చిరునవ్వులో మాత్రం ఖచ్చితంగా ఏదో లక్ష్యం, ఏదో సందేశం ఉన్నట్లు అనిపిస్తోంది. నాకు ఈ రోజు కలిగినంత ఆనందం మునుపెన్నడూ కలుగలేదు. అది నేను మాటల్లో వ్యక్తం చెయ్యలేను’ అన్నది. దాయీహలీమా అమితానందపడుతూ... ఆమె మాటలకు ఆమినా చిరునవ్వు నవ్వారు. తరువాత హలీమా ఆమినా ఆశాజ్యోతిని తన ఒడిలోకి తీసుకుంటుండగా... తన ముద్దుల బిడ్డ నుదుటిని తనివితీరా ముద్దాడారు ఆమినా. ప్రాణ సమానమైన బిడ్డ ఎడబాటు, తన హృదయేశ్వరుని మరణం వల్ల అయిన గాయాన్ని కెలికింది. అప్రయత్నంగా ఆమె కళ్లు అశృపూరితాలయ్యాయి. హలీమా, హారిస దంపతులిద్దరూ చిన్నారి ముహమ్మద్‌ను తీసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. అబ్దుల్ ముత్తలిబ్ మక్కా పొలిమేరల వరకు తోడువెళ్లి వారిని సాగనంపుతూ... ‘‘హలీమా! బాబును అనాథగా భావించి, ఆదరణలోగాని, పోషణలోగాని ఎలాంటి లోటు రానీయకు. ఖురైష్ వంశ చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి మహిమాన్వితమైన విశిష్ట బాలుడు జన్మించలేదు. ‘ఏదో ఒక రోజు యావత్ ప్రపంచం ముహమ్మద్ పాదాల ముందు మోకరిల్లుతుంది.’ ఇది నేనొక్కడినే చెబుతున్న మాటకాదు. అనేకమంది సాధుసన్యాసులు, యోగులు, జ్యోతిష్యులు, పండితులు చెప్పినమాట’ అన్నారు అబ్దుల్ ముత్తలిబ్ గద్గద కంఠంతో. ‘అయ్యా! తమరు నిశ్చింతగా ఉండండి. మీ మనుమడి మీద ఈగ కూడా వాలనివ్వను. దైవసాక్షిగా చెబుతున్నా. ఈ చిన్నారి కడుపారా పాలుతాగి నిద్రపోయే వరకు నేను నా బిడ్డకు కూడా పాలివ్వను. నన్ను నమ్మండి’ అన్నది హలీమా ఎంతో నమ్మకంగా. అబ్దుల్ ముత్తలిబ్ హలీమాకు మరికొన్ని జాగ్రత్తలు చెప్పి, తనివి తీరా మనుమణ్ణి ముద్దాడి ఇంటికి తిరుగుముఖం పట్టారు. అదేమి విచిత్రమోగాని, వచ్చేటప్పుడు ఈసురోమంటూ వచ్చిన బక్క ఒంటె, తిరుగు ప్రయాణంలో మాత్రం పరుగులాంటి నడకతో అనుకున్న సమయం కంటే ముందే గమ్యానికి చేర్చింది. అంతేకాదు, మార్గమధ్యంలో కూడా హలీమా అనేక వింతలు, విశేషాలను చూసింది. ఏదో తెలియని అనిర్వచనీయ ఆనందానుభూతులను అనుభవించింది. లోగడ నేను ఎంతోమంది పిల్లల్ని చూశాను. ఎంతోమందికి పాలు పట్టాను. కాని నీ బిడ్డ మోములో ఏదో దివ్యతేజస్సు ఉంది. ఆ చిరునవ్వులో ఏదో లక్ష్యం, ఏదో సందేశం ఉన్నట్లు అనిపిస్తోంది. నాకు ఈ రోజు కలిగినంత ఆనందం మునుపెన్నడూ కలుగలేదు. - యం.డి. ఉస్మాన్‌ఖాన్ (వచ్చేవారం మరికొన్ని విశేషాలు) -
‘ప్రాణహిత’ను కాళేశ్వరానికి తరలించొద్దు
- వివిధ సంఘాల నేతల డిమాండ్ - అదే జరిగితే రాష్ట్రానికి తీరని నష్టమని హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ‘ప్రాణహిత-చేవెళ్ల’ పథకం బ్యారేజీని తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించొద్దని వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అదే జరిగితే ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క చుక్క నీరు దక్కకపోగా.. రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఈ అంశంపై శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి, తుమ్మిడిహెట్టి ప్రాణహిత ప్రాజెక్టు పరిరక్షణ వేదికకు చెందిన కేవీ ప్రతాప్, ఉమామహేశ్వర్రావు, సామాజిక స్పందన వేదిక నేత కె.నారాయణ, తెలంగాణ జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్ధన్, స్వార్ధభారతి చైర్మన్ వై.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. తక్కువ నీటి సామర్థ్యం, ముంపు, పర్యావరణం, అధిక విద్యుత్ అవసరాల దృష్ట్యా కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మాణం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఏడేళ్ల కిందట అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారని.. ఇప్పుడు ఆదిలాబాద్‌లోని గిరిజనులకు అన్యాయం చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం డిజైన్ మార్పులకు పూనుకున్నదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టేందుకు మహారాష్ట్ర అభ్యంతరం చెబుతోందన్నది అసంబద్ధ వాదన అని, కాళేశ్వరం వద్ద కట్టినా అవతలి ఒడ్డు కూడా ఆ రాష్ట్ర పరిధిలోనిదేనని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల వెనుక మతలబేమిటని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా బ్యారేజీ నిర్మాణాన్ని కాళేశ్వరానికి తరలించాలన్న యోచనను మానుకోవాలని, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని 5 లక్షల ఎకరాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. -
చకచకా సచివాలయం బదలాయింపు
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం తరలింపునకు అవసరమైన భూ బదలాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. సచివాలయం నిర్మాణానికి కంటోన్మెంట్‌లోని బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా మైదానాల్ని తమకు ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ కేంద్ర రక్షణ మంత్రిని కోరడం తెలిసిందే. ఈ మేరకు ఆ స్థలాల సమాచారాన్ని అందజేయాల్సిందిగా రక్షణ శాఖ ఉన్నతాధికారులు స్థానిక డిఫెన్స్ ఎస్టేట్స్, లోకల్ మిలటరీ అథారిటీస్(ఎల్ఎంఏ) అధికారులను ఆదేశించారు. తాజాగా సికింద్రాబాద్ డిఫెన్స్ ఎస్టేట్స్ అధికారులు, ఎల్ఎంఏ అధికారులు పంపిన నివేదిక ఆధారంగా రక్షణ మంత్రిత్వ శాఖ కొద్ది రోజుల్లోనే సానుకూల నిర్ణయం వెలువరించే అవకాశమున్నట్లు తెలిసింది. గత నెలలోనే లేఖ: బైసన్ పోలో గ్రౌండ్, జింఖానా మైదానాల్ని తమకు అప్పగించాల్సింది కోరుతూ సీఎం కేసీఆర్ గత నెల 24న రక్షణమంత్రి మనోహర్ పారికర్‌కు లేఖ రాశారు. దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ సాధ్యాసాధ్యాలపై క్షేత్రస్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా డెరైక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్(డీజీడీఈ)అధికారులకు సూచించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరగా నివేదికను అందజేయాల్సిందిగా సూచిస్తూ ఈ నెల 6న పుణేలోని సదరన్ కమాండ్ ప్రిన్సిపల్ డెరైక్టర్ సికింద్రాబాద్ డీఈఓ కార్యాలయానికి లేఖ పంపారు. ప్రిన్సిపల్ డెరైక్టర్ ఆదేశాలకు అనుగుణంగా నివేదికను సిద్ధం చేసిన స్థానిక అధికారులు సోమవారం సమాధానం పంపారు. భూబదలాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన, అంగీకారాల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు(ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉంది), లోకల్ మిలటరీ అధికారులు(ఎల్ఎంఏ) మధ్య సివిల్ మిలటరీ లైజన్ కాన్ఫరెన్స్(సీఎంఎల్సీ) జరగాల్సి ఉంది. ఈ సమావేశం సజావుగా ముగిస్తే భూ బదలాయింపు లాంఛనమే. ప్రభుత్వం కోరుతున్న ఈ 60 ఎకరాల స్థలం మార్కెట్ విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు.