గర్ల్ఫ్రెండ్ కోసం యూఎస్ వెళ్తాడట!
లండన్: ఇంగ్లండ్ ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెక్హామ్ కుమారుడు బ్రూక్లిన్ బెక్హామ్ ఇప్పుడు అమెరికాకు వెళ్తానంటూ ఒకటే మారాం చేస్తున్నాడట. ఈ మారాంకు కారణం బ్రూక్లిన్ తన గర్ల్ఫ్రెండ్ క్లో గ్రేస్కు దగ్గరగా ఉండాలనుకోవడమేనంటున్నారు ఆయన సన్నిహితులు. అయితే బ్రూక్లిన్ మాత్రం ఈ విషయంపై మాట్లాడుతూ.. యూఎస్లోనే ఫోటోగ్రఫీతో పాటు నటనలో ఎడ్యుకేషన్ను కొనసాగిస్తానని, దీని కోసం లాస్ ఎంజిల్స్లోని ఓ కాలేజీలో అడ్మిషన్ కూడా దొరికిందని..గర్ల్ఫ్రెండ్ క్లో గురించి కాకుండా కెరీర్ ప్లానింగ్ గురించి చెబుతున్నాడు.
బ్రూక్లిన్ తల్లి విక్టోరియా బెక్హామ్ మాత్రం కొడుకు తీసుకున్న నిర్ణయంతో సంతృప్తిగా లేనట్లుగా తెలుస్తోంది. ఎప్పుడూ ఫ్యామిలీతో పాటే ఉండే కొడుకును దూరంగా పంపించడం ఆమెకు ఇష్టం లేదట. ఆ చదువేదో ఇక్కడే లండన్లో చదువొచ్చుగా అని విక్టోరియా కొడుకు బ్రూక్లిన్తో చెబుతోంది. అయితే యూఎస్లో గర్ల్ఫ్రెండ్ పిలుస్తోంటే తల్లి మాటలు ఎక్కడ వినబడుతాయి బ్రూక్లిన్కి. అందుకే 'నేను యూఎస్కు వెళ్లడానికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను' అని తల్లికి బ్రూక్లిన్ గట్టిగానే చెప్పాడని బ్రిటన్ మీడియా సంస్థ 'ఇన్సైడర్' వెల్లడించింది.