హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించేందుకు రంగం సిద్ధమైంది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలున్న కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించేందుకు రంగం సిద్ధమైంది. పరిశ్రమల తరలింపునకు అనువుగా 19 ప్రాంతాల్లో 3,104 ఎకరాల భూమిని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఐసీ) గుర్తించింది.
కౌడిపల్లి మండలం చండూరు, కొట్టాల, సలాబత్‌పూర్, కొల్చారం మండలం పోతం షెట్పల్లి, రాంపల్లి, పాపన్నపేట మండల అన్నారం, పటాన్‌చెరు మండలం చిట్కూల్æ, కొండపాక మండలం లక్డారం, భువనగిరి మండలం హుస్సేనబాద్, దామరచర్ల మండలం చిట్యాల, బీబీనగర్ మండలం గుర్రాలదండి, మోమిన్‌పేట మండలం ఎంకటాల, నవాబ్‌పేట మండలం అర్కటాల, ఎక్‌మామిడి, వికారాబాద్ మండలం గిరిగిట్‌పల్లి, గుడ్పల్లి, సిద్ధులూరు, మునుగల్, కొత్తూరు మండలం సిద్ధాపూర్, చేగూరు గ్రామాల్లో పరిశ్రమల తరలింపు కోసం టీఎస్‌ఐఐసీ భూములను గుర్తించింది. హైదరాబాద్‌లో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో కాలుష్య కారక ఫార్మ, తదితర పరిశ్రమల తరలింపునకు చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.