వేగంగా వెళుతున్న మినీ హెలీకాప్టర్ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో వెంటనే 1500 అడుగుల ఎత్తులో ఉన్న హెలీకాప్టర్ ఒక్కసారిగా 700 అడుగుల ఎత్తులోకి పడిపోయింది. పైలెట్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రాణాలు కాపాడుకోగలిగారు.
వివరాలు.. హోవర్డ్ స్టాట్ దగ్గర ఫిల్ రాబిన్సన్ పైలట్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంగ్లాండ్లోని బోల్టన్ నగరం పై విహరిస్తున్న సమయంలో ఓ పక్షి హెలీకాప్టర్ను ఢీ కొట్టి కాక్పిట్లో పడింది. వేగంగా వచ్చిన పక్షి హెలీకాప్టర్ ముందు భాగంలోని గ్లాస్ను ఢీ కొట్టింది. బలంగా ఢీ కొట్టడంతో గ్లాస్ పగిలి కాక్ పిట్లో ఉన్న ట్రైనీ పైలెట్ రాబిన్సన్ చేతిలో పక్షిపడింది. క్షణాల్లో హెలీకాప్టర్ అదుపుతప్పి 800 అడుగుల కిందకు చేరింది. అప్రమత్తమైన సీనియర్ పైలెట్ స్కాట్ వెంటనే హెలీకాప్టర్ను అదుపులోకి తీసుకువచ్చాడు. క్షేమంగా బర్న్ లీ సిటీ ఎయిర్ పోర్టులో సేఫ్గా ల్యాండ్ అయ్యారు.
క్షణాల్లో భారీ ప్రమాదం నుంచి హెలీకాప్టర్లో ఉన్న ఇద్దరు క్షేమంగా బయట పడినా, పక్షి మాత్రం మృతిచెందింది. భారీ ప్రమాదానికి కారణమయిన పక్షిని తీసుకెళ్లి ఫ్రిజ్లో పెట్టి పార్టీ చేసుకుందామనుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రాబిన్సన్ తన కెమెరాతో హెలీకాప్టర్ లోపలి భాగాన్ని వీడీయో తీశాడు. దీన్ని చూస్తే ఎంతగా ఆ హెలీకాప్టర్ డ్యామేజ్ అయ్యిందే మనకే అర్థం అవుతుంది.
వేగంగా ఢీ కొట్టి కాక్ పిట్లో పడింది
Published Mon, Jun 20 2016 4:27 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement