Seagull
-
తిండిని కాపాడుకునేందుకు పరుగో పరుగు
-
తిండిని కాపాడుకునేందుకు పరుగో పరుగు
మీకు బాగా ఆకలి వేస్తుందనుకోండి. ఏం చేస్తారు? ఇంట్లో ఉంటే ఏముందో అది తినేస్తారు. అదే బయట ఉంటే అర్జంటుగా హోటల్‌కు వెళ్లి నచ్చింది తినేస్తారు. లేదంటే పార్సిల్ కట్టుకుని ఇంటికి పట్టుకెళ్తారు. మరి ఆ మధ్యలోనే మీ తిండినెవరైనా గద్దలా తన్నుకుపోతే ఎలా ఉంటుంది? తలుచుకోడానికే కష్టంగా ఉంది కదూ.. ఇంచుమించు ఇలాంటి ఇబ్బందికర ఘటనే ఓ వ్యక్తికి ఎదురైంది. ఆహార పొట్లంతో పాటు ఓ కూల్‌డ్రింక్‌ను పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై సీగల్స్(సముద్ర పక్షులు) కన్ను పడింది. అతని చేతిలో ఉన్న పొట్లాన్ని అందుకునేందుకు అతన్ని ఫాలో చేశాయి. (చదవండి: స్కిన్ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!) దీంతో ఎలాగైనా వాటి బారి నుంచి తన తిండిని కాపాడేందుకు అతను పరుగు లంకించుకున్నాడు. అయినా సరే, అతన్ని వదిలేది లేదని ఆ పక్షులు కూడా వెనకాలే వెళ్లాయి. ఇవి నన్ను వదిలేలా లేవని ఆయన వెంటనే ఓ దుకాణంలోకి చొరబడటంతో ఆ పక్షులు అతడిని విడిచిపెట్టాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను డార్విన్ అవార్డ్ ట్విటర్లో షేర్ చేశారు. "సీగల్స్ మీ చుట్టూరా ఉన్నప్పుడు తినే ప్రయత్నం చేయకండి" అని క్యాప్షన్ జోడించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు నవ్వలేకుండా ఉండలేకపోతున్నారు. (చదవండి: కన్నీళ్లు తుడుచుకో చెల్లి : సోనూసూద్) -
కెమెరాను కాకి ఎత్తుకెళ్లింది.. అద్భుత వీడియో
-
కెమెరాను కాకి ఎత్తుకెళ్లింది.. అద్భుత వీడియో
నార్వే : ఓ వ్యక్తికి తాను కొత్త కెమెరా తీసుకున్నాన్న ఉత్సాహం కాసేపు కూడా నిలవలేదు. అత్యంత దగ్గర నుంచి షూట్ చేద్దామని టైమ్ సెట్ చేసి ఉంచగా దానిని దొంగ ఎత్తుకెళ్లారు. అయితే ఆ దొంగ మనిషి కాదండోయ్ ఓ కాకి. అవును నార్వేకు చెందిన జెల్ రాబర్ట్సన్ అనే వ్యక్తి సముద్రపు కాకిని అతి సమీపంలో నుంచి తన కెమెరాలో బందించాలని అనుకున్నాడు. అందులో భాగంగా ఇంటి బయట కంటెగోడపై కెమెరాను పెట్టి దానికి సమీపంలో బ్రెడ్‌ముక్కలు వేశాడు. తొలుత అక్కడి వచ్చిన కాకులు బ్రెడ్ ముక్కలు తిన్నాయి. అయితే, వాటిల్లో ఒక కాకి నేరుగా ఆ 4 కె కెమెరా వద్దకు వెళ్లి తొలుత ముక్కుతో పొడిచింది. అనంతరం దానిని నోట కరుచుకొని అనూహ్యంగా ఎత్తుకెళ్లింది. ఆ సమయంలో ఆ కెమెరాలో డ్రోన్ వీడియో మాదిరిగా రికార్డ్ అయింది. ఆ కెమెరా కాస్త అతడి ఇంటికి సమీపంలోని గుట్టల ప్రాంతంలో పడేయగా అది దాదాపు ఐదు నెలల తర్వాత దొరికింది. ఆ కాకి కెమెరాను ఎత్తుకెళ్లే సమయంలో రికార్డయిన వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది కాస్త పెద్ద వైరల్ అయ్యి లక్షల మంది వీక్షించారు. -
వేగంగా ఢీ కొట్టి కాక్ పిట్లో పడింది
వేగంగా వెళుతున్న మినీ హెలీకాప్టర్‌ను ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో వెంటనే 1500 అడుగుల ఎత్తులో ఉన్న హెలీకాప్టర్ ఒక్కసారిగా 700 అడుగుల ఎత్తులోకి పడిపోయింది. పైలెట్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రాణాలు కాపాడుకోగలిగారు. వివరాలు.. హోవర్డ్ స్టాట్ దగ్గర ఫిల్ రాబిన్సన్ పైలట్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌లోని బోల్టన్ నగరం పై విహరిస్తున్న సమయంలో ఓ పక్షి హెలీకాప్టర్‌ను ఢీ కొట్టి కాక్‌పిట్‌లో పడింది. వేగంగా వచ్చిన పక్షి హెలీకాప్టర్ ముందు భాగంలోని గ్లాస్‌ను ఢీ కొట్టింది. బలంగా ఢీ కొట్టడంతో గ్లాస్ పగిలి కాక్ పిట్లో ఉన్న ట్రైనీ పైలెట్ రాబిన్సన్ చేతిలో పక్షిపడింది. క్షణాల్లో హెలీకాప్టర్ అదుపుతప్పి 800 అడుగుల కిందకు చేరింది. అప్రమత్తమైన సీనియర్ పైలెట్ స్కాట్ వెంటనే హెలీకాప్టర్‌ను అదుపులోకి తీసుకువచ్చాడు. క్షేమంగా బర్న్ లీ సిటీ ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. క్షణాల్లో భారీ ప్రమాదం నుంచి హెలీకాప్టర్‌లో ఉన్న ఇద్దరు క్షేమంగా బయట పడినా, పక్షి మాత్రం మృతిచెందింది. భారీ ప్రమాదానికి కారణమయిన పక్షిని తీసుకెళ్లి ఫ్రిజ్‌లో పెట్టి పార్టీ చేసుకుందామనుకుంటున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రాబిన్సన్ తన కెమెరాతో హెలీకాప్టర్ లోపలి భాగాన్ని వీడీయో తీశాడు. దీన్ని చూస్తే ఎంతగా ఆ హెలీకాప్టర్ డ్యామేజ్ అయ్యిందే మనకే అర్థం అవుతుంది. -
కూరలో పడి.. రంగు మారింది!
యునైటెడ్ కింగ్ డమ్ లో ఎక్కువగా కనిపించే సీ-గల్ పక్షి ప్రస్తుతం అక్కడ సెలబ్రిటీ అయిపోయింది. బాగా ఆకలితో నకనకలాడిందేమో! ఆహారం కనిపించగానే ముందు వెనుకా చూసుకోకుండా ఓ ఫ్యాక్టరీ దగ్గరలోని చెత్తకుండీలో పడేసి ఉన్న మసాలా చికెన్ టిక్కా కోసం వెళ్లింది. కుండీ లోపల ఉన్న ఆహారం అందుకోలేక బొక్కబోర్లా పడింది. అంతే, ఒక్కసారిగా తెల్లగా ఉన్న పక్షి ఆరెంజ్ రంగులోకి మారిపోయింది. ఇది చూసిన అక్కడి ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు దానిని రక్షించారు. జంతు సంరక్షణ కేంద్రంలో అప్పజెప్పారు. దాని రంగు మారిపోవడాన్ని చూసిన ఓ నర్సు ముచ్చటపడి ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. అంతే సోషల్ మీడియా ప్రపంచం ఒక్కసారిగా రంగు మారిన పక్షి అందానికి ముగ్ధులైపోయారు. లైక్ లు , కామెంట్లతో యూకేలో ఈ ఫోటో వైరల్ అయింది. ప్రస్తుతం సంరక్షణ కేంద్రంలోనే ఉన్న పక్షిని సిబ్బంది శుభ్రపరిచారు. దాని రంగయితే పోయింది కానీ, వాసన పోవడం లేదంటూ పోస్టులు పెట్టింది నర్సు.