తిండిని కాపాడుకునేందుకు పరుగో ప‌రుగు | Viral Video: Seagulls Chase Man To Steal Food | Sakshi
Sakshi News home page

అత‌ని తిండిపై క‌న్నేసిన ప‌క్షులు

Published Wed, Aug 26 2020 4:52 PM | Last Updated on Wed, Aug 26 2020 5:11 PM

Viral Video: Seagulls Chase Man To Steal Food - Sakshi

మీకు బాగా ఆక‌లి వేస్తుంద‌నుకోండి. ఏం చేస్తారు? ఇంట్లో ఉంటే ఏముందో అది తినేస్తారు. అదే బ‌య‌ట ఉంటే అర్జంటుగా హోట‌ల్‌కు వెళ్లి న‌చ్చింది తినేస్తారు. లేదంటే పార్సిల్ క‌ట్టుకుని ఇంటికి ప‌ట్టుకెళ్తారు. మ‌రి ఆ మ‌ధ్య‌లోనే మీ తిండినెవ‌రైనా గ‌ద్ద‌లా త‌న్నుకుపోతే ఎలా ఉంటుంది? త‌లుచుకోడానికే క‌ష్టంగా ఉంది క‌దూ.. ఇంచుమించు ఇలాంటి ఇబ్బందిక‌ర ఘ‌ట‌నే ఓ వ్యక్తికి ఎదురైంది. ఆహార పొట్లంతో పాటు ఓ కూల్‌డ్రింక్‌ను ప‌ట్టుకుని రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్న వ్య‌క్తిపై సీగ‌ల్స్(స‌ముద్ర ప‌క్షులు) క‌న్ను ప‌డింది. అత‌ని చేతిలో ఉన్న పొట్లాన్ని అందుకునేందుకు అత‌న్ని ఫాలో చేశాయి. (చ‌ద‌వండి: స్కిన్‌ ఎలర్జీ.. ఈ అమ్మాయి ఏం చేసిందంటే!)

దీంతో ఎలాగైనా వాటి బారి నుంచి త‌న‌ తిండిని కాపాడేందుకు అత‌ను ప‌రుగు లంకించుకున్నాడు. అయినా స‌రే, అత‌న్ని వ‌దిలేది లేద‌ని ఆ ప‌క్షులు కూడా వెన‌కాలే వెళ్లాయి. ఇవి న‌న్ను వ‌దిలేలా లేవ‌ని ఆయ‌న వెంట‌నే ఓ దుకాణంలోకి చొర‌బడ‌టంతో ఆ ప‌క్షులు అత‌డిని విడిచిపెట్టాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో న‌వ్వులు పూయిస్తున్న ఈ వీడియోను డార్విన్ అవార్డ్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. "సీగ‌ల్స్ మీ చుట్టూరా ఉన్న‌ప్పుడు తినే ప్ర‌య‌త్నం చేయ‌కండి" అని క్యాప్ష‌న్ జోడించాడు. ఈ వీడియోను చూసిన‌ నెటిజ‌న్లు న‌వ్వ‌లేకుండా ఉండ‌లేక‌పోతున్నారు. (చ‌ద‌వండి: కన్నీళ్లు తుడుచుకో చెల్లి : సోనూసూద్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement