చార్జిషీటు పరిగణనపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్‌లు కోరారు.
కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
చార్జిషీటుపై ఈడీ వాదనలు: కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లి మెంటరీ చార్జిషీటును పరి గణనలోకి తీసుకోవ డంపై దర్యాప్తు సంస్థ ప్రత్యే క కోర్టులో వాదనలు వినిపించింది. న్యాయవాది నవీన్ కుమార్ మట్టా వాదనలు వినిపిస్తూ.. కవిత, చారియట్ ప్రొడ క్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్‌కుమార్, చరణ్‌ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్‌ల పాత్ర గురించి చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కవిత కాకుండా మిగిలిన వారి పాత్రపై వాదనలు విన్పించాలని సూచించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి అడి గిన ప్రశ్నలపై సమాధానానికి నవీన్ కుమార్ సమయం కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment